E-Paper
Advertisement

Honor Magic 8 Pro: వారెవ్వా అనేలా హానర్ కొత్తఫోన్.. 200MP కెమెరా, 7200 mAh బ్యాటరీతో లాంచ్!

Honor Magic 8 Pro: వారెవ్వా అనేలా హానర్ కొత్తఫోన్.. 200MP కెమెరా, 7200 mAh బ్యాటరీతో లాంచ్!
Advertisement

Honor Magic 8 Pro: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ తాజాగా తన బ్రాండ్ నుంచి Honor Magic 8 Pro అనే కొత్త‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లోకి దించింది. ఇది ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, అడ్రినో 840 జీపీయూపై పనిచేస్తుంది. 7100 ఎంఏహెచ్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన హానర్ మ్యాజిక్ 8 ప్రో ఫోన్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాదు.. ఇది 200 MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో 50 MP ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 16GB వరకు RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ ఉంటుంది. ఇప్పుడు Honor Magic 8 Pro హ్యాండ్ సెట్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ధర విషయానికొస్తే..

ఈ Honor Magic 8 Pro స్మార్ట్‌ఫోన్ 12GB RAM+ 512GB స్టోరేజ్ మోడల్‌కు సుమారు రూ.99,000. అదే సమయంలో, 16GB RAM+ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1,12,000 ఉంది. హానర్ మ్యాజిక్ 8 ప్రో హ్యాండ్ సెట్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్, స్కై సియాన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: రియల్‌మీ నుంచి కొత్తఫోన్ వచ్చేసిందోచ్.. 15 నిమిషాల ఛార్జింగ్‌​తో రోజంతా వాడేసుకోవచ్చు!

స్పెసిఫికేషన్లు ఇలా:

Honor Magic 8 Pro హ్యాండ్ సెట్ వెనుక భాగంలో అధునాతన ఏఐ ఇమేజింగ్, 5-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 50MP ప్రైమరీ సెన్సార్+ 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్+ 200MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో 3.7X ఆప్టికల్ జూమ్, 100X డిజిటల్ జూమ్ వరకు పొందుతారు. అలాగే ఈ ఫోన్‌లో 3D డెప్త్ సెన్సార్‌తో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. హానర్ మ్యాజిక్ 8 ప్రో.. స్మార్ట్‌ఫోన్ చైనీస్ వేరియంట్ 7200 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో విడుదలైంది. అయితే, గ్లోబల్ వెర్షన్ 7100 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌‌తో వచ్చింది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

గేమింగ్ లవర్స్‌కు పండగే:

Advertisement

ఈ హ్యాండ్ సెట్.. 1.5K రిజల్యూషన్‌తో 6.71-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, మృదువైన 120 Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్‌ల వరకు అత్యంత అధిక పీక్ బ్రైట్‌నెస్‌‌కి సపోర్ట్ చేస్తుంది. ఇది IP68, IP69, IP69K రేటింగ్‌లతో వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు అడ్రినో 840 GPUపై పనిచేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 16GB వరకు RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇకపోతే హానర్ మ్యాజిక్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ద్వారా గేమింగ్, మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్.. వంటి హై-ఎండ్ టాస్క్‌లను సులభంగా చేసుకోవచ్చు.

Read Also: రంగంలోకి లో-కాస్ట్ యాపిల్ ప్రొడక్ట్స్.. ధర, ఫీచర్లు తెలిస్తే యూజర్లకు పిచ్చెక్కిపోద్ది!

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×