E-Paper
Advertisement

Realme GT8 Pro: రియల్‌మీ నుంచి కొత్తఫోన్ వచ్చేసిందోచ్.. 15 నిమిషాల ఛార్జింగ్‌​తో రోజంతా వాడేసుకోవచ్చు!

Realme GT8 Pro: రియల్‌మీ నుంచి కొత్తఫోన్ వచ్చేసిందోచ్.. 15 నిమిషాల ఛార్జింగ్‌​తో రోజంతా వాడేసుకోవచ్చు!
Advertisement

Realme GT8 Pro: ప్రముఖ టెక్ కంపెనీ రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్, అదిరిపోయే ఫీచర్లతో యూజర్లకు పిచ్చెక్కిస్తోంది. రియ‌ల్‌మీ GT8 ప్రో పేరిట ఈ హ్యాండ్ సెట్ భార‌త్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌లో 6.79 ఇంచుల హైప‌ర్ గ్లో డిస్‌ప్లేను అమర్చారు. రియ‌ల్‌మీ GT8 ప్రో ఫోన్ 2కె రిజ‌ల్యూష‌న్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ క‌లిగి ఉంది. సూర్య‌కాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్ డిస్‌ప్లేకు 7000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్ ఫీచ‌ర్‌ను అటాచ్ చేశారు. అంతేకాదు.. ఈ ఫోన్‌ స్నాప్ డ్రాగ‌న్ 8 ఎలైట్ జెన్ 5 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది.

వేడిని తట్టుకునేలా కూలింగ్ సిస్ట‌మ్‌:

రియల్‌మీ GT8 ప్రో ఫోన్‌ వీసీ కూలింగ్ సిస్ట‌మ్‌ను కలిగి ఉంది. దీంతో ఫోన్‌ను ఎంతసేపు, ఎలా వాడినా త్వ‌ర‌గా వేడెక్కదు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ ఉపయోగకరంగా ఉంటుంది. గేమింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఈ ఫోన్‌లో గేమింగ్ సూప‌ర్ ఫ్రేమ్ టెక్నాల‌జీని ఇచ్చారు. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారిత రియ‌ల్‌మీ యూఐ 7.0ను ఇచ్చారు. నాలుగేళ్ల వరకు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్స్‌, ఐదేళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ సిమ్మ‌ట్రిక్ మాస్ట‌ర్ అకౌస్టిక్ స్పీక‌ర్‌ను కలిగి ఉంది. అలాగే స్విచ‌బుల్ కెమెరా బంప్ ఫీచ‌ర్‌ను సైతం అందించడం వల్ల వినియోగదారులు కెమెరా మాడ్యూల్స్‌ను త‌మకు న‌చ్చిన‌ట్లుగా అమ‌ర్చుకోవ‌చ్చు.

Advertisement

Read Also: వర్త్ వర్మా వర్తు.. కళ్లు చెదిరేలా మోటొరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ:

ఈ ఫోన్ వెనుక వైపు 200 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ క‌లిగిన టెలిఫొటో కెమెరా ఉంటుంది. అలాగే వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 50 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాట‌రీని కలిగి ఉంది. దీనికిగానూ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. 0 నుంచి 100% చార్జింగ్ అయ్యేందుకు కేవ‌లం 45 నిమిషాలు మాత్ర‌మే ప‌డుతుంది. అలాగే 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. దీని సాయంతో కేవ‌లం 15 నిమిషాల్లోనే 0 నుంచి 50% వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది.

రూ.5వేల వ‌ర‌కు డిస్కౌంట్‌:

Advertisement

రియల్‌మీ GT8 ప్రో హ్యాండ్‌సెట్‌లో 12GB, 16GB ర్యామ్‌, 256GB, 512GB స్టోరేజ్ ఆప్ష‌న్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్స‌ల్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్‌ను సైతం కలిగి ఉంది. ఐపీ 66, 68, 69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌తో పాటు 5G సేవ‌ల‌ను కూడా పొందొ‌చ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 12GB ర్యామ్‌, 256 GB స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.72,999 ఉండ‌గా.. 16GB ర్యామ్‌, 512GB స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.78,999గా నిర్ణ‌యించారు. ఇక ఈ ఫోన్‌పై ప‌లు ప్రారంభ ఆఫ‌ర్ల‌ను సైతం పొందవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై అన్ని బ్యాంకుల‌ కార్డుల‌తో రూ.5వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు.

Read Also: మరోసారి భారీ డిస్కౌంట్.. అమెజాన్‌ సేల్లో రూ.9వేల తగ్గింపుతో 5జీ ఫోన్!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×