E-Paper
Advertisement

నిజమండీ బాబూ.. రూ.9 వేలకే iPhone లాంటి ఫోన్.. నమ్మట్లేదా? అయితే మీరే చూసేయండి!

నిజమండీ బాబూ.. రూ.9 వేలకే iPhone లాంటి ఫోన్.. నమ్మట్లేదా? అయితే మీరే చూసేయండి!
Advertisement

Honor Play 70C: ఈ ఆధునిక యుగంలో ఫోన్ కొనాలంటే ఫీచర్లు ఎంత ముఖ్యమో.. ఆ ఫోన్ లుక్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఐఫోన్ లాంటి ప్రీమియం డిజైన్ ఉంటే ఆ ఫీలే వేరు కదా. అయితే లక్షలు పెట్టి ఐఫోన్ కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకేనేమో.. ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ సరిగ్గా అదే పాయింట్‌ను క్యాచ్ చేసింది.

అచ్చం ఐఫోన్ ప్రో మోడల్స్‌ను తలపించేలా ఉన్న కెమెరా మోడ్యూల్, స్లిమ్ బాడీతో Honor Play 70Cని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దూరం నుంచి చూస్తే ఇది ఐఫోన్ అని ఎవరైనా నమ్మాల్సిందే. కేవలం డిజైన్ మాత్రమే కాదు.. లోపల ఫీచర్లు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇంతకీ ఈ బడ్జెట్ ఐఫోన్ లుక్ మొబైల్ విశేషాలేంటో చూద్దామా..

స్టైలిష్ లుక్..

Advertisement

హానర్ ప్లే 70సి పేరుతో చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్.. తక్కువ ధరలో మొబైల్ కావాలనుకుంటున్న వారిని టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి తెచ్చారు. హానర్ ప్లే 80 ప్లస్‌తో పాటు వచ్చిన ఈ ఫోన్.. బ్లూ, సిల్వర్, బ్లాక్ కలర్స్‌లో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది.

భారీ డిప్‌ప్లే..

ఈ ఫోన్ చూడటానికి చాలా స్లిమ్‌గా ఉంటుంది. కేవలం 7.89 మిల్లీమీటర్ల మందంతో ఉండటం వల్ల పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. స్క్రీన్ విషయానికి వస్తే.. దీనిలో 6.75 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోడవ్వడంతో, స్క్రీన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.

Advertisement

Also Read: Honor Play 80 Plus విడుదలైంది రోయ్.. 7,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16.. ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!

లేటెస్ట్ ఫీచర్లు..

చాలా బడ్జెట్ ఫోన్లు పాత వెర్షన్లతో వస్తుంటాయి కానీ, ఈ హానర్ ప్లే 70సి మాత్రం లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9.0పై నడుస్తుంది. ఇక దీనిలో మీడియాటెక్ హీలియో జి81 అల్ట్రా ప్రాసెసర్‌ను వాడారు. అలాగే ఈ ఫోన్‌లో 4GB, 6GB RAM ఆప్షన్లతో పాటు 128GB వరకు మెమొరీ అందుబాటులో ఉంది.

బ్యాటరీ ఎంతంటే?

ఈ Honor Play 70C వెనుక వైపు 13MP మెయిన్ కెమెరా ఉంది. ఇది పగటిపూట మంచి ఫొటోలు తీయడానికి హెల్ప్ అవుతుంది. ఇక సెల్ఫీల కోసం 5MP కెమెరాను అమర్చారు. అలాగే ఈ ఫోన్‌లో 5300mah బ్యాటరీ ఉండటం వల్ల.. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంటల తరబడి వాడుకోవచ్చు. దాదాపు 10 గంటల పాటు వీడియో కాల్స్ మాట్లాడినా బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది.

అతి తక్కువ ధరకే..

ముఖ్యంగా ఈ ఫోన్ ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయి. బేసిక్ మోడల్ రూ.9,000 నుంచి మొదలై.. టాప్ మోడల్ రూ.12,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్.. త్వరలోనే భారత్‌లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇందులో మనకు ఎంతో ఇష్టమైన 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండటం విశేషం.

Also Read: శాంసంగ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన Galaxy F17 5G ధర, ఆ ఫీచర్లు, ఈ ప్రైస్.. వదులుకోవద్దు!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×