Honor Play 80: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్ నుంచి 7,000mAh భారీ బ్యాటరీతో ‘Honor Play 80 Pro’ చైనాలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘Honor Play 80’ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. బడ్జెట్ ధరలో మంచి 5G ఫోన్ కావాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..
ఈ Honor Play 80 చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. దీనిలో 6.75 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్ తోడవ్వడంతో.. ఫోన్ వాడుతున్నప్పుడు గానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు గానీ స్క్రీన్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఇక లోపల పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను వాడారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌పై ఇది నడుస్తుంది. ముఖ్యంగా దీనిలో 8GB RAM ఉన్నా, అవసరమైతే మరో 8GB పెంచుకుని మొత్తం 16GB వరకు వాడుకోవచ్చు. దీంతో ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదన్నమాట.
Also Read: ఎండలు 50 డిగ్రీలు దాటినా డోంట్ కేర్.. ఈ Desert Rose AC ఉంటే ఇల్లు స్విట్జర్లాండే!
ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కెమెరా ఓ మోస్తరుగా ఉన్నా.. బ్యాటరీ మాత్రం పిచ్చెక్కించేలా ఉంది. 5,300mAh భారీ బ్యాటరీని ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 65 గంటల పాటు సినిమాలో, పాటలో విన్నా అస్సలు తగ్గదట. కాకపోతే 15W ఛార్జింగ్ అంటే కొంచెం నెమ్మదిగా ఎక్కుతుంది కానీ, ఒక్కసారి ఎక్కితే రోజంతా నిశ్చింతగా ఉండొచ్చు.
ఈ ఫోన్ చూడటానికి చాలా క్లాసీగా ఉండే మూడు రంగుల్లో దొరుకుతుంది. స్టోరేజ్ పరంగా కూడా 128GB, 256GB ఆప్షన్లు ఉన్నాయి. ధర గురించి కంపెనీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ, ఇప్పటికే విడుదైన Pro వెర్షన్ ధర రూ.26,000 వరకు ఉంది కాబట్టి.. దీని ధర అంతకంటే చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన ఈ Honor Play 80 ఫోన్ త్వరలోనే ఇండియాలోకి రానుంది.
Also Read: ఈ గ్యాడ్జెట్ ఉంటే.. పాత కర్టెన్లనే స్మార్ట్‌గా మార్చేయొచ్చు, గోడకు రంధ్రం కూడా పెట్టక్కర్లేదు!