E-Paper
Advertisement

ఈ గ్యాడ్జెట్ ఉంటే.. పాత కర్టెన్లనే స్మార్ట్‌గా మార్చేయొచ్చు, గోడకు రంధ్రం కూడా పెట్టక్కర్లేదు!

ఈ గ్యాడ్జెట్ ఉంటే.. పాత కర్టెన్లనే స్మార్ట్‌గా మార్చేయొచ్చు, గోడకు రంధ్రం కూడా పెట్టక్కర్లేదు!
Advertisement

SwitchBot Curtain 3: సాధారణంగా స్మార్ట్ హోమ్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి స్మార్ట్ బల్బులు, ఫోన్‌తో ఆపరేట్ చేసే ఏసీలు, ఫ్యాన్లు. కానీ, ప్రస్తుతం స్మార్ట్ లైఫ్ అంటే పొద్దున్నే లేవగానే మన ఇంటి కర్టెన్లు వాటికవే తెరుచుకోవడం, చీకటి పడగానే అవే మూసుకోవడం. అయితే ఈ క్రమంలో చాలామంది ‘అమ్మో.. ఇప్పుడు దీని కోసం మళ్లీ గోడకు డ్రిల్లింగ్ చేయాలా? కొత్త రాడ్లు కొని గోడలు పాడు చేసుకోవాలా?’ అనుకుంటారు. అలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా.. ఇప్పటికే మీరు ఇంట్లో వాడుతున్న పాత కర్టెన్లలనే స్మార్ట్‌గా మార్చేసే ఒక అద్భుతమైన గ్యాడ్జెటే ‘స్విచ్‌బాట్ కర్టెన్ 3’.

5 నిమిషాల్లో ఇన్‌స్టాలేషన్..

ఈ గ్యాడ్జెట్‌ను బిగించడం చాలా ఈజీ. అలాగే దీని కోసం పాత కర్టెన్ రాడ్లను కూడా తీసేయక్కర్లేదు. కనీసం పరదాలను కూడా దించక్కర్లేదు. జస్ట్ ఆ రాడ్‌కు ఈ చిన్న రోబోను హుక్ చేస్తే చాలు. ఇది చిన్న చక్రాల సాయంతో రాడ్‌ను గట్టిగా పట్టుకుని అటు ఇటు కదులుతుంది. తర్వాత మీ ఫోన్ తీసుకుని యాప్‌తో కనెక్ట్ చేస్తే చాలు.. కేవలం ఐదు నిమిషాల్లో మీ పని అయిపోతుంది. ఒక్క డ్రిల్లింగ్ హోల్ కూడా లేకుండానే ఇంటి లుక్ మారిపోతుంది.

ఎలాంటి సౌండ్ చేయదు..

Advertisement

ప్రతిరోజూ అలారమ్ పెట్టుకుని చిరాగ్గా నిద్రలేవడం కంటే.. సూర్యరశ్మి మొహం మీద పడితే వచ్చే ఆ హాయి బాగుంటుంది కదా. ఈ స్విచ్‌బాట్ కర్టెన్ 3లో క్వైట్ డ్రిఫ్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇది కర్టెన్లను ఎంత సైలెంట్‌గా జరుపుతుందంటే.. ఆ మోటార్ సౌండ్ అస్సలు వినిపించదు. మెల్లగా పరదాలు జరిగి ఎండ గదిలోకి వస్తుంటే.. బాడీ చాలా రిలాక్స్‌డ్‌గా నిద్రలేస్తుంది. ఆర్టిఫిషియల్ స్మార్ట్ లైట్ల కంటే.. ఇలా సహజమైన వెలుతురుతో రోజును స్టార్ట్ చేయడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Also Read: వచ్చేస్తోంది Oppo F33 సిరీస్.. ఫీచర్లు, ధర వివరాలు తెలిస్తే ఇప్పుడే బుక్ చేసేసుకుంటారు!

చిటికెలో లాగేస్తుంది..

Advertisement

కొంతమంది ఏసీ చల్లదనం బయటకు పోకుండా ఉండాలని మందపాటి బ్లాక్ అవుట్ కర్టెన్లు వాడుతుంటారు. అవి కాస్త బరువుగా ఉంటాయి. కానీ ఈ స్విచ్‌బాట్ రోబో సుమారు 15 కేజీల బరువును కూడా సింపుల్‌గా లాగేస్తుంది. ఇంకో క్రేజీ ఫీచర్ ఏమిటంటే.. ఎవరైనా తెలియక పరదాను చేయితో లాగినా, ఇది వెంటనే దాన్ని కనిపెట్టి ఈ పనిని ఇది తీసుకుంటుంది. దీంతో ఈ గ్యాడ్జెట్ గురించి తెలిసిన వారే కాదు.. ఇంట్లోని పెద్దవారు లేదంటే అతిథులు కూడా దీన్ని ఈజీగా వాడేయొచ్చు.

ఎండను బట్టి అవే మూసుకుపోతాయి..

వేసవిలో మధ్యాహ్నం పూట బయట నుంచి వచ్చే ఎండ గదిని వేడెక్కిస్తుంది. ఈ పరికరంలో ఉండే సెన్సార్లతో.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పరదాలు అవే మూసుకుపోయేలా సెట్ చేయొచ్చు. దీనివల్ల గది ఉష్ణోగ్రత ఒక 3 నుండి 5 డిగ్రీల దాకా తగ్గుతుంది. దాంతో ఏసీ మీద లోడ్ తగ్గి కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. అలాగే మనం ఊరెళ్లినప్పుడు కూడా ఆటోమేటిక్‌గా ఇవి ఓపెన్ అవుతూ, క్లోజ్ అవుతూ ఉంటే.. ఇంట్లో ఎవరో ఉన్నారనే అనుకుంటారు. ఇంటి భద్రతకు ఈ గ్యాడ్జెట్ ఎంతో ఉపయోగకరం అనే చెప్పాలి.

సెట్ చేసి వదిలేస్తే చాలు..

ఈ గ్యాడ్జెట్‌కు ప్రతిసారీ ఛార్జింగ్ పెట్టే ఓపిక లేకపోతే.. ఒక చిన్న సోలార్ ప్యానెల్‌ను దీనికి తగిలించేయొచ్చు. అది కిటికీ వైపు ఉంటుంది కాబట్టి.. అవే ఛార్జ్ అయిపోతాయి. అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. అంతేకాదు.. గూగుల్ హోమ్ లేదా అలెక్సా ఉంటే ‘అలెక్సా.. కర్టెన్స్ ఓపెన్ చేయ్’ అంటే చాలు.. చిటికెల్ పని అయిపోతుంది. తక్కువ ఖర్చులో ఇంటిని ఒక ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ లాగా మార్చుకోవడానికి ఇదొక స్మార్ట్ ఐడియా అన్నమాట.

ధర ఎంతంటే?

ఇంత టెక్నాలజీ ఉంది కదా.. మరి దీని ధర ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారా? అమెజాన్ వంటి సైట్లలో ఇది సుమారు రూ.8,000 లోపు లభిస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్ ధరతో పోలిస్తే ఇది తక్కువే. ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ మీద ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే.. ఇంట్లో ఉన్న పాత కర్టెన్లే హైఎండ్ లగ్జరీ లుక్‌ను ఇస్తాయి.

Also Read: ఐఫోన్ లెవల్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ లాంటి డిజైన్.. Infinix Note 60 Pro లాంచ్ డేట్ ఫిక్స్!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×