Honor Play 80 Pro: తమ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో సరికొత్త ఫోన్లను విడుదల చేస్తూ హానర్ దూకుడు పెంచుతోంది. తాజాగా Ply సిరీస్‌లో సరికొత్త మోడల్ Honor Play 80 Proను చైనాలో లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూసేవారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు అనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఈ హానర్ ప్లే 80 ప్రో స్మార్ట్‌ఫోన్ అజూర్ స్కై, బ్లాక్ ఫాంటమ్ నైట్, వైట్ మూన్‌లైట్ వంటి క్లాసీ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.
ఈ Honor Play 80 Pro మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ 6GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.26,000 వరకు ఉంటుంది. అలాగే 8GB RAM మోడల్ ధర రూ.28,000 కాగా.. టాప్ మోడల్ అయిన 12GB RAM వేరియంట్ ధర రూ.31,000గా ఉండనుంది. చైనాలో ఇప్పుడిప్పుడే సేల్ మొదలవుతోంది కాబట్టి.. మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది అనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: 10x జూమ్, 200MP కెమెరాతో రానున్న Oppo Find X9 Ultra.. ఐఫోన్ కూడా దీని ముందు దిగదుడుపే!
చూడటానికి ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలో 6.8 అంగుళాల భారీ స్క్రీన్‌ను ఇచ్చారు. 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల మొబైల్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఇక ఎండలో వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 850 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ఫోన్ సుమారు 207 గ్రాముల బరువు ఉంటుంది. కానీ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP65 రేటింగ్ కూడా ఇచ్చారు.
Honor Play 80 Pro ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 9 పై పనిచేస్తుంది. గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వకుండా పని చేస్తుంది. ఇక ఈ ఫోన్ మెయిన్ హైలైట్ 7,000mAh భారీ బ్యాటరీ. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. రెండ్రోజులపాటు ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఎక్కువగా సోషల్ మీడియా స్క్రోల్ చేసేవారికి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది.
ఫోన్ వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాను అమర్చారు. దీనిలో 8x డిజిటల్ జూమ్ ఉండటంతో ఎంత దూరం నుంచి ఫొటోలు తీసినా మంచి క్లారిటీతో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం 5MP కెమెరాను ఇచ్చారు. అలాగే క్వాలిటీ వీడియోలు తీసుకోవాలి అనుకుంటే దీనిలో ఫుల్ HD రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. మొత్తానికి.. భారీ బ్యాటరీతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలనుకునే వారికి హానర్ ప్లే 80 ప్రో బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
Also Read: ఆరేళ్ల బ్యాటరీ వారంటీతో Honor X80i లాంచ్.. 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా పగలదు!