E-Paper
Advertisement

‘రామాయణ’ టీజర్‌పై సునీల్ లహరి సంచలన వ్యాఖ్యలు.. బాబోయ్ వాళ్లను వాళ్లే..

‘రామాయణ’ టీజర్‌పై సునీల్ లహరి సంచలన వ్యాఖ్యలు.. బాబోయ్ వాళ్లను వాళ్లే..
Advertisement

Ramayana Teaser: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ ఒకటి. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన టీజర్ మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా, రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రతో మెప్పించిన సునీల్ లహరి, ఈ సినిమా టీజర్‌పై రణ్‌బీర్ కపూర్ ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read also-OTT Movies: ఈ మూవీ హరర్ లవర్స్‌కు హెవెన్.. అస్సలు మిస్ అవ్వోద్దు..

శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ సెట్ కాలేదు

Advertisement

సునీల్ లహరి తన తాజా ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్‌ను శ్రీరాముడిగా అంగీకరించలేకపోయారు. ఆయన అభిప్రాయం ప్రకారం, శ్రీరాముడి పాత్రకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ముఖంలోని ప్రశాంతత అమాయకత్వం. “రణ్‌బీర్ కపూర్ చాలా మంచి నటుడు, అందులో సందేహం లేదు. కానీ, శ్రీరాముడి పాత్రలో ఉండాల్సిన ఆ దైవికమైన అమాయకత్వం ఆయన ముఖంలో కనిపించడం లేదు. రణ్‌బీర్ ముఖంపై ఒక విధమైన మెచ్యూరిటీ కనిపిస్తోంది, అది రాముడి పాత్రకు సరిపోదు” అని ఆయన వ్యాఖ్యానించారు.

టీజర్‌పై విమర్శలు

టీజర్‌లో చూపించిన విజువల్స్ పాత్రల ఆహార్యంపై కూడా సునీల్ లహరి పెదవి విరిచారు. గతంలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా ఎదుర్కొన్న విమర్శలను గుర్తు చేస్తూ, పౌరాణిక చిత్రాలను రూపొందించేటప్పుడు మేకర్స్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. “మనం దేవుళ్లుగా ఆరాధించే పాత్రలను వెండితెరపై చూపించేటప్పుడు, ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవించాలి. ప్రయోగాలు చేసే క్రమంలో ఆ పాత్రల మూలాలను దెబ్బతీయకూడదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

సాయి పల్లవి, యష్‌ల గురించి..

Advertisement

సినిమాలోని ఇతర నటుల గురించి మాట్లాడుతూ.. సీతగా సాయి పల్లవి ఎంపిక బాగుందని, ఆమెలో ఒక సహజత్వం ఉందని గతంలో కొందరు అభిప్రాయపడగా, సునీల్ మాత్రం మొత్తం టీజర్ ఇంపాక్ట్ ఆశించిన స్థాయిలో లేదని తేల్చి చెప్పారు. రావణుడిగా యష్ లుక్ గురించి కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది.

Read also-ఆ ఒక్క డైలాగ్ నా పొట్ట కొట్టింది… ఆయనకు రుణపడి ఉంటానన్న కుమారి ఆంటీ..

రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’ ఇప్పటికీ భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందులోని నటులు ఆ పాత్రలకే ప్రాణం పోశారని ప్రజలు నమ్ముతారు. అటువంటి నేపథ్యంలో, నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ ఆధునిక రామాయణం ఎంతవరకు మెప్పిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రణ్‌బీర్ కపూర్ తన అద్భుత నటనతో సునీల్ లహరి వంటి సీనియర్ నటుల విమర్శలను పటాపంచలు చేస్తారా? లేదా అనేది సినిమా విడుదలయ్యాకే తెలియాలి. ప్రస్తుతానికి మాత్రం, సునీల్ లహరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నెటిజన్లు కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×