E-Paper
Advertisement

ఆరేళ్ల బ్యాటరీ వారంటీతో Honor X80i లాంచ్.. 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా పగలదు!

ఆరేళ్ల బ్యాటరీ వారంటీతో Honor X80i లాంచ్.. 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా పగలదు!
Advertisement

Honor X80i: టెక్ ప్రియుల్లో హానర్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తాజాగా మిడ్‌రేంజ్ ఫోన్ ‘హానర్ X80i’ని చైనా మార్కెట్లోకి దించింది. ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్.. అదిరిపోయే లుక్స్, పవర్‌ఫుల్ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏరిల్ 10 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు షురూ కానున్నాయి.ఇప్పుడీ ఫోన్ ధర వివరాలు, ఫీచర్లు గురించి తెలుసుకుందాం రండి..

చూడగానే నచ్చేసే డిజైన్..

ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. చేతిలో పట్టుకుంటే చాలా తేలికగా అనిపిస్తుంది. సాండ్ పింక్, లైమ్ గ్రీన్ లాంటి నాలుగు డిఫరెంట్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.6 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోంది. ఫోన్ వాడేటప్పుడు కళ్లు అలసిపోకుండా ఉండటానికి దీనిలో ప్రత్యేకమైన టెక్నాలజీని వాడారు. ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఈ 1.5K రిజల్యూషన్ స్క్రీన్ భలేగా ఉంటుంది.

బ్యాటరీ పర్ఫార్మెన్స్ అద్భుతం..

Advertisement

ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే.. అది బ్యాటరీ అనే చెప్పాలి. ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని దీనిలో అమర్చారు. ఈ బ్యాటరీ ఏకంగా ఆరేళ్ల పాటు అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. డైమెన్సిటీ 6500 ఎలైట్ ప్రాసెసర్ ఉండటం వల్ల ఫోన్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఫోన్ కింద పడినా త్వరగా పగిలిపోకుండా దీనికి ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కూడా ఉంది. అలాగే వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల రఫ్ అండ్ టఫ్ యూసేజ్‌కు ఇది కేరాఫ్ అడ్రస్.

Also Read: Pixel 11 Pro XL ఫస్ట్ లుక్ లీక్.. గూగుల్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా? ఎందుకంటే..

స్పెసిఫికేషన్లు ఇలా..

Advertisement

ఈ హానర్ X80iలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. వీటితో పాటు సిగ్నల్ ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి ఒక కొత్త యాంటెన్నా సిస్టమ్‌ను తీసుకొచ్చారు. స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుంది. ఒక ఏఐ ఫిజికల్ బటన్ కూడా దీనిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ప్రస్తుతానికి చైనాలో సందడి చేస్తున్న ఈ ఫోన్.. మన దేశానికి ఎప్పుడు వస్తుందో అని టెక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధర ఎంత ఉండొచ్చు?

సాధారణంగా ఏ ఫోన్ కొనాలన్నా మనం ముందుగా చూసేది బడ్జెట్ గురించే. ఈ హానర్ X80i మన అవసరాలకు తగ్గట్టుగా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్ అయిన 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,000గా ఉంది. ఒకవేళ ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే.. 8GB+256GB మోడల్ రూ.25,300కి, అలాగే 12GB+256GB మోడల్ రూ.28,800కి లభిస్తాయి.

ఇక అన్నిటికంటే హైఎండ్ మోడల్ అయిన 12GB+512GB వేరియంట్ ధర రూ.32,200గా కంపెనీ నిర్ణయించింది. అయితే చైనాలో ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీల వల్ల అక్కడ ఈ ఫోన్ కేవలం రూ.19,500 నుంచే ప్రారంభం కావడం విశేషం. ఇండియాలో కూడా ఇలాంటి రేటుకే వస్తే మాత్రం మిడ్‌రేంజ్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదు.

Also Read: జస్ట్ రూ.499 మాత్రమే.. boAt ప్రీమియం ఇయర్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్!

Related News

ఏంది సామీ ఈ ఆఫర్? రూ.35 వేల ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేస్తోంది!

రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 5G సేవలు.. గెట్ రెడీ అంటూ మెసేజ్‌లు!

మరీ ఇంత తక్కువకా? అది కూడా 2K డిస్‌ప్లే ట్యాబ్లెట్, Redmi Pad 2 9.7 ఫీచర్లు ఇవే!

అమ్మబాబోయ్, 10,200mAh బ్యాటరీతో.. Vivo Y600 Pro లాంచ్.. ధర కూడా చాలా తక్కువే!

జొమాటో సంచలనం.. డెలివరీ బాయ్స్‌కు కూలింగ్ వెస్ట్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

జియో, ఎయిర్‌టెల్, BSNL.. రూ.200లోపు బెస్ట్ ప్లాన్స్ ఇవే.. బోలెడన్ని లాభాలు భయ్యా!

ఓరి దేవుడా.. మే నెలలో ఇన్ని అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయా? మెుబైల్ ప్రియులకు పండుగే!

Big Stories

Advertisement
×