E-Paper
Advertisement

Honor Win and Win RT: ఒక్కసారిగా రెండు గేమింగ్ బీస్ట్స్ లాంచ్.. Honor ఫ్యాన్స్‌కు అసలైన పండగ మొదలైంది!

Honor Win and Win RT: ఒక్కసారిగా రెండు గేమింగ్ బీస్ట్స్ లాంచ్.. Honor ఫ్యాన్స్‌కు అసలైన పండగ మొదలైంది!
Advertisement

Honor Win and Win RT: చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే దిశగా Honor మరో కీలక అడుగు వేసింది. పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ కొత్తగా Honor Win సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Honor Win, Honor Win RT అనే రెండు గేమింగ్ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. లాంగ్ గేమింగ్ సెషన్లలో కూడా స్థిరమైన పనితీరు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ఎఫెక్టివ్ హీట్ మేనేజ్‌మెంట్ ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

భారీ బ్యాటరీతో లాంగ్ పెర్ఫామెన్స్:

Honor Win సిరీస్‌లోని రెండు ఫోన్లలోనూ 10,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చారు. హెవీ గేమింగ్ అయినా, డైలీ ఇంటెన్సివ్ యూజ్ అయినా ఛార్జింగ్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేకుండా ఈ బ్యాటరీ సహాయపడుతుంది. అలాగే గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వెనుక భాగంలో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను బిల్ట్‌ఇన్‌గా అమర్చారు. దీని వల్ల లాంగ్ సెషన్లలో కూడా పెర్ఫామెన్స్ డ్రాప్ కాకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో బిగ్ డీల్.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 భారీ తగ్గింపు ధరలో!

స్లిమ్ బాడీతో ప్రీమియం డిజైన్:

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ Honor Win, Win RT ఫోన్లు సుమారు 8.3mm మందంతో స్లిమ్ లుక్‌ను కలిగి ఉన్నాయి. మెటల్ ఫ్రేమ్, గ్లాస్‌ఫైబర్ రియర్ ప్యానెల్‌తో ఈ ఫోన్లు ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ఫ్రంట్ వైపు 6.83 అంగుళాల ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్తో పాటు 185Hz రిఫ్రెష్ రేట్‌ను అందించడం వల్ల గేమింగ్ విజువల్స్ చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. దీంతోపాటు ఫాస్ట్ రెస్పాన్స్ కోసం 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, కంటి చూపు భద్రత కోసం 5920Hz PWM డిమ్మింగ్‌ను కూడా అందించారు.

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ పవర్:

Advertisement

హానర్ విన్ సిరీస్ ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 అల్ట్రా సిరీస్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లపై పనిచేస్తాయి. LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ కలయికతో మల్టీటాస్కింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ను కూడా ల్యాగ్ లేకుండా హ్యాండిల్ చేసేలా ఈ డివైసులను డిజైన్ చేశారు.

ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు:

హానర్ తీసుకొన్చిన ఈ రెండు ఫోన్లలోనూ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా హానర్ విన్ మోడల్‌లో 80W వైర్‌లెస్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా అందించారు. దీని వల్ల ఇతర డివైసులను ఛార్జ్ చేయడానికి కూడా ఈ ఫోన్ ఉపయోగపడుతుంది.

50 మెగాపిక్సల్ కెమరా సెటప్:

ఈ సిరీస్ ఫోన్లు Android 15 ఆధారిత MagicOSపై రన్ అవుతాయి. లాంగ్ టర్మ్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. Honor Win‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, Win RTలో డ్యూయల్ రియర్ కెమెరా అమర్చారు. డైలీ ఫొటోగ్రఫీతో పాటు వీడియో కాల్స్‌కు కూడా ఇవి మంచి అనుభవాన్ని అందిస్తాయి.

అత్యాధునిక ఫీచర్లు:

హానర్ విన్ సిరీస్ ఫోన్లు 3D అల్ట్రాసానిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Honor AI Surround Sound టెక్నాలజీతో ఆకట్టుకుంటాయి. 5G, Wi-Fi 7, Bluetooth, GPS, NFC, USB Type-C, డ్యూయల్ సిమ్ వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా IP68, IP69, IP69K రేటింగ్స్‌తో డస్ట్, వాటర్, హై-ప్రెషర్ వాషింగ్‌కు కూడా రక్షణ లభిస్తుంది.

కలర్ ఆప్షన్ ఇవే:

ఇకపోతే Honor Win సిరీస్ ఫోన్లు ఫాస్ట్ బ్లాక్, విన్నింగ్ సిల్వర్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్లు చైనాలో Honor అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించబడుతున్నాయి.

Also Read: కొనడానికి ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ భయ్యా!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×