E-Paper
Advertisement

OnePlus 13 Price Drops: కొనడానికి ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ భయ్యా!

OnePlus 13 Price Drops: కొనడానికి ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ భయ్యా!
Advertisement

OnePlus 13 Price Drops: న్యూ ఇయర్‌ కానుకగా.. ప్రీమియం వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న Year End Saleలో హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆఫర్లలో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నది OnePlus 13 స్మార్ట్‌ఫోన్. సాధారణంగా ప్రీమియం ధరలో లభించే ఈ ఫ్లాగ్‌షిప్.. ఇప్పుడు మాత్రం ఆశ్చర్యపరిచే డిస్కౌంట్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది.

సాధారణంగా రూ.69,999 ప్రారంభ ధర కలిగిన OnePlus 13 ఫోన్.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.60 వేలలోపే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో కలిపితే ధర మరింత తగ్గుతుంది. అందుకే ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్న బెస్ట్ ప్రీమియం డీల్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Advertisement

Also Read: ఇప్పుడే కొనాలనిపించే డీల్ మావా.. Galaxy A55 5Gపై ఏకంగా రూ.16,900 తగ్గింపు!

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వన్‌ప్లస్ 13ను రూ.61,999 ప్రత్యేక ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.8,000 తగ్గింపు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే మరో రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

Advertisement

అంతేకాదు.. నెలకు రూ.2,180 నుంచి ప్రారంభమయ్యే EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. డివైజ్ కండిషన్‌ను బట్టి రూ.50,200 వరకు ఎక్స్ఛేంజ్ విలువ పొందే అవకాశం ఉంటుంది.

ఇకపోతే వన్‌ప్లస్ 13 హ్యాండ్ సెట్.. 6.82 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. పనితీరు విషయంలో ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో గరిష్టంగా 24GB RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక బ్యాటరీ పరంగా చూస్తే.. 6,000mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

OnePlus 13లో కెమెరా సెక్షన్ కూడా ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లోనే ఉంటుంది. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ప్రీమియం వీగన్ లెదర్ ఫినిష్, ఆధునిక ఏఐ ఫీచర్లతో వన్‌ప్లస్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ డీల్‌గా నిలుస్తోంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో బిగ్ డీల్.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 భారీ తగ్గింపు ధరలో!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×