E-Paper
Advertisement

LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!

LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!
Advertisement

LPG Gas: సాధారణంగా వంటింట్లో అన్ని వేళలా గ్యాస్ స్టవ్ వెలుగుతూనే ఉంటుంది అన్నం, కూరలు, కాఫీ, టీ, స్నాక్స్ ఇలా ఏదొక దానికోసం స్టవ్ ను వెలిగిస్తూనే ఉంటారు. అయితే ఒక గంటపాటు గ్యాస్ స్టవ్ ను వినియోగిస్తే.. ఎంత గ్యాస్ ఖర్చు అవుతుందన్న సందేహం చాలా మందిలో సహజంగానే ఉంటుంది. అయితే గ్యాస్ ఖర్చు అనేది మనం వినియోగించే బర్నర్ (పెద్ద, చిన్న) మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బర్నర్ ను బట్టి ఎల్‌పీజీ ఖర్చు ఎలా ఉంటుంది? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ వాడితే బెటర్? ఈ కథనంలో పరిశీలిద్దాం.

గంటకు గ్యాస్ వినియోగం ఎంత?

సాధారణంగా ఒక గ్యాస్ స్టవ్ బర్నర్ గంటకు సగటున 140 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు LPG గ్యాస్‌ను వినియోగిస్తుంది. ఒక వేళ చిన్న బర్నర్ (Small Burner) మీద వంట చేసినట్లైతే ఇది గంటకు సుమారు 140 – 150 గ్రాముల గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. పెద్ద బర్నర్ విషయానికి వస్తే.. అది గంటకు సుమారు 180 – 210 గ్రాముల గ్యాస్‌ను వినియోగిస్తుంది. ఒక వేళ మీరు సిమ్ మంట పెట్టి వండినట్లైతే.. గ్యాస్ ఖర్చు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెటర్?

Advertisement

పెద్ద బర్నర్ తో పోలిస్తే కచ్చితంగా చిన్న బర్నరే గ్యాస్ ను ఆదాను చేస్తుంది. దీనికి ప్రధాన కారణం దాని ద్వారా వెలువడే ఉష్ణ శక్తి వృథా కాకపోవడమే. సాధారణంగా చిన్న గిన్నెలను పెద్ద బర్నర్ మీద పెట్టినప్పుడు.. మంట గిన్నె అంచుల నుండి బయటకు వచ్చి గాలిలో వేస్ట్ గా కలిసిపోతుంది. దీనివల్ల గ్యాస్ వృథా అవడమే కాకుండా వంట కూడా ఆలస్యమవుతుంది. కాబట్టి గిన్నె పరిమాణాన్ని బట్టి బర్నర్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

ఏ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది?

ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల LPG సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి గృహఅవసరాలకు (14.2 కేజీలు) కాగా, మరొకటి వాణిజ్య ప్రయోజనాలకు (19 కేజీలు) ఉద్దేశించినది. డొమెస్టిక్ సిలిండర్ల విషయానికి వస్తే.. సగటున రోజుకు 2 గంటల పాటు స్టవ్ వినియోగిస్తే (మీడియం ఫ్లేమ్ మీద) సుమారు 25-30 రోజుల పాటు వస్తుంది. ఒక వేళ కేవలం చిన్న బర్నర్ మీదనే వంట చేస్తే.. ఇంకా ఎక్కువ రోజుల పాటు సిలిండర్ వినియోగంలోకి రావొచ్చు. అటు వాణిజ్య సిలిండర్ విషయానికి వస్తే దీనిని లెక్కించడం కష్టం. ఎందుకంటే రెస్టారెంట్ కు ఉన్న క్రేజ్, డిమాండ్ ను బట్టి ఒక సిలిండర్ ఒక రోజుకే అయిపోవచ్చు. మధ్యస్త హోటళ్లకు అయితే 3-5 రోజుల పాటు వాణిజ్య సిలిండర్ రావొచ్చు.

Advertisement

Also Read: Kitchen Waste Biogas: ఏడేళ్లుగా నో సిలిండర్.. వంటింటి చెత్తతో గ్యాస్.. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావయ్యా!

గ్యాస్ ఆదా చేసే చిట్కాలు

ఇదిలా ఉంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా గ్యాస్ ను ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వంట చేసేటప్పుడు గిన్నెపై మూత ఉంచడం వల్ల లోపల ఒత్తిడి పెరిగి ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇది సుమారు 15% నుండి 20% గ్యాస్‌ను ఆదా చేస్తుంది. అలాగే నీరు లేదా ఆహారం మరుగుతున్నప్పుడు మంటను తగ్గించడం ద్వారా గ్యాస్ ను ఆదా చేయవచ్చు. మరోవైపు వంట ప్రారంభించే ముందు బర్నర్ రంధ్రాలు చెక్ చేయాలి. అవి మూసుకుపోయి ఉంటే శుభ్రం చేయాలి. అప్పుడు మంట ఎరుపు రంగులో కాకుండా నీలి రంగులోకి వచ్చి పాత్రకు సమర్థవంతంగా వేడి అందుతుంది.

Also Read: Induction Stove Tips: వంట అవ్వగానే.. ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అయితే చిక్కుల్లో పడ్డట్లే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×