E-Paper
Advertisement

Kitchen Waste Biogas: ఏడేళ్లుగా నో సిలిండర్.. వంటింటి చెత్తతో గ్యాస్.. ఇన్నాళ్లు ఎక్కడ దాచారయ్యా!

Kitchen Waste Biogas: ఏడేళ్లుగా నో సిలిండర్.. వంటింటి చెత్తతో గ్యాస్.. ఇన్నాళ్లు ఎక్కడ దాచారయ్యా!
Advertisement

Kitchen Waste Biogas: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధం.. భారత్ లో గ్యాస్ సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎల్‌పీజీ సిలిండర్లకు ప్రత్యామ్నయంగా ఇండక్షన్ స్టవ్స్, స్మార్ట్ కుకింగ్ పరికరాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఐఐటీ చదివిన వ్యక్తి.. ఏడేళ్ల క్రితమే ఎల్ పీజీ గ్యాస్ కు ప్రత్యామ్నయాన్ని కనుగొన్నారు. ‘వాయు’ పేరుతో.. వంటింటి వ్యర్థాలతో వంట గ్యాస్ ను తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అతడు అనుసరిస్తున్న మార్గం.. చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

ఇంతకీ ఆయన ఎవరంటే?

మహారాష్ట్ర పూణేకు చెందిన ప్రియదర్శన్ సహస్రబుద్ధే అనే ఐఐటి గ్రాడ్యుయేట్ ‘వాయు’ అనే వినూత్నమైన కాంపాక్ట్ బయోగ్యాస్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది మనం పారేసే రోజూవారి వంటింటి చెత్తను బయో గ్యాస్ గా మారుస్తుంది. దీని వల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరగనుంది.

వ్యర్థాలు.. గ్యాస్‌గా ఎలా మారతాయి?

Advertisement

వాయు ప్రాజెక్ట్ లో కింద గ్యాస్ తయారు చేయాలంటే కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం, అన్నం, చపాతీలు ఇలా మనం పారవేసే వంటింటి వ్యర్థాలు అవసరం. ఈ వ్యర్థాలు మీథేనోజెనిక్ సూక్ష్మజీవులతో నిండిన డైజెస్టర్‌లోకి వెళ్తాయి. ఆక్సిజన్ లేని వాతావరణంలో ఈ పదార్థాలు విచ్చిన్నమై మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఆ వాయువు అక్కడ నుంచి గ్యాస్ నిల్వ కోసం ఏర్పాటు చేసిన యూనిట్ కు వెళ్లి.. దానికి కనెక్ట్ చేసిన పైపు గుండా స్టవ్ వద్దకు ప్రవహిస్తుంది. ఫలితంగా మనం నిత్యం ఎల్ పీజీ గ్యాస్ ను ఏ విధంగా ఉపయోగిస్తామో.. ఆ తరహాలోనే ఈ గ్యాస్ ను వాడుకుంటూ వంట చేసుకోవచ్చు.

రోజుకు ఎన్ని వ్యర్థాలు అవసరం?

అయితే ఈ వాయు బయోగ్యాస్ కోసం నిరంతరాయంగా వంటింటి వ్యర్థాలు అవసరం అవుతాయి. ఒక రోజువారి వంటకు.. సుమారు 5 కిలోల తడి వ్యర్థాలు అవసరం అవుతాయని ఐఐటీ గ్రాడ్యుయేట్ ప్రియదర్శన్ తెలిపారు. 2 కిలోల సేంద్రియ వ్యర్థాల నుండి 200 లీటర్ల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ఇది దాదాపు 40 నిమిషాల పాటు నిరంతరాయంగా గ్యాస్ స్టవ్ మండేందుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

ఏడేళ్లుగా నో సిలిండర్!

Advertisement

పూణెలోని తన నివాసంలో 2019లో వాయు బయోగ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రియదర్శన్ తెలిపారు. ఇక అప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ తో పనిలేకుండానే.. కిచెన్ లో వంట పనులు చెక్కబెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వాయు ప్రాజెక్ట్ కోసం ఎలాంటి విద్యుత్ ఖర్చు కూడా ఉండదని తెలియజేశారు. పైగా గ్యాస్ వెలికితీయగా మిగిలిన వ్యర్థాలను ఇంట్లోని మెుక్కలకు ఎరువులుగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, ముంబయి, ఔరంగబాద్, నాసిక్ వంటి నగరాల్లో 450కి పైగా ఇళ్లల్లో వాయు బయోగ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రియదర్శన్ చెప్పుకొచ్చారు.

Also Read: Induction Stove Tips: వంట అవ్వగానే.. ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అయితే చిక్కుల్లో పడ్డట్లే!

పర్యావరణానికి మేలు

వాయు పద్దతిలో గ్యాస్ ను తయారు చేయడం వల్ల డబ్బు ఆదాతో పాటు పర్యావరణ పరంగానూ రెండు ప్రయోజనాలు కలుగనున్నాయి. మొదటిది వ్యర్థాల నిర్వహణ సులభం అవ్వనుంది. రెండోది శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతేకాకుండా గ్యాస్ తయారైన తర్వాత మిగిలే వ్యర్థం (Slurry) మొక్కలకు అద్భుతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడనుండటం కూడా మరో ప్రకృతిపరమైన ప్రయోజనంగా చెప్పవచ్చు.

Also Read: Gas Saving Tips: గ్యాస్ కొరత వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. నెల వచ్చే గ్యాస్ 3 నెలల వస్తుంది!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×