E-Paper
Advertisement

Induction Stove Tips: వంట అవ్వగానే.. ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అయితే చిక్కుల్లో పడ్డట్లే!

Induction Stove Tips: వంట అవ్వగానే.. ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అయితే చిక్కుల్లో పడ్డట్లే!
Advertisement

Induction Stove Tips: దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ఇండక్షన్ స్టవ్స్ వినియోగిస్తున్నారు. దీని వినియోగంపై చాలా మందికి అవగాహన లేనప్పటికీ.. ప్రస్తుత ఇబ్బందుల దృష్ట్యా వాడకతప్పడం లేదు. అయితే సాధారణ గ్యాస్ స్టవ్ తరహాలోనే.. వంట అవ్వగానే ప్రతీ ఒక్కరూ ఇండక్షన్ స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. అయితే ఇది సరైన పద్దతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల సమస్యలు ఎదురుకావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్ త్వరగా పాడయ్యే ప్రమాదముందని సూచిస్తున్నారు.

కూలింగ్ ఫ్యాన్ గురించి తెలుసా?

ఇండక్షన్ స్టవ్ పని చేసేటప్పుడు దాని లోపల ఉండే కాయిల్స్, సర్క్యూట్ బోర్డ్ విపరీతంగా వేడెక్కుతాయి. కాబట్టి దానిని చల్లబరిచేందుకు ఇండక్షన్ స్టవ్ లో ఇన్ బిల్ట్ గా కూలింగ్ ఫ్యాన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది వంట ఆపివేసిన తర్వాత కూడా స్టవ్ లోపల వేడిని తగ్గించేందుకు తిరుగుతూనే ఉంటుంది. మనం మెయిన్ స్విచ్ ఆపకుండా ఉంటే ఈ ఫ్యాన్ కొంత సమయం పాటు తిరిగి లోపల ఉన్న వేడి గాలిని బయటకు పంపేస్తుంది. తద్వారా స్టవ్ ను కూలింగ్ మోడ్ లోకి తీసుకొస్తుంది.

వెంటనే ఆపేస్తే జరిగే నష్టం ఏంటీ?

Advertisement

వంట పూర్తయిన వెంటనే ప్లగ్ పాయింట్ వద్ద స్విచ్ ఆపేస్తే ఆ కూలింగ్ ఫ్యాన్ కూడా వెంటనే ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల లోపల నిలిచిపోయిన వేడి.. సెన్సార్లను, మదర్ బోర్డును లేదా ఇతర సున్నితమైన ఎలక్ట్రానిక్ భాగాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఇండక్షన్ స్టవ్ పనితీరు తగ్గిపోవడమే కాకుండా కాలక్రమేణా అది పూర్తిగా పాడైపోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.

Also Read: TCL QM8K Smart TVs: అమెజాన్ బంపరాఫర్.. టీసీఎల్ స్మార్ట్ టీవీలపై.. కళ్లుచెదిరే డిస్కౌంట్!

మరి సరైన పద్దతి ఏంటీ?

Advertisement

వంట పూర్తయ్యాక మొదట ఇండక్షన్ స్టవ్ పైన ఉన్న ఆఫ్ బటన్‌ను మాత్రమే నొక్కాలి. ఆ తర్వాత కనీసం 5 నుండి 10 నిమిషాల వరకు వేచి ఉండాలి. లోపల ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం ఆగిపోయిన తర్వాత మాత్రమే మెయిన్ స్విచ్ ఆపివేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇండక్షన్ కుక్‌టాప్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

ముఖ్యగమనిక: ఈ వార్తను ప్రముఖ టెక్ వెబ్ సైట్ లోని కథనాలు, నిపుణుల సూచనల ఆధారంగా అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: Gas Saving Tips: గ్యాస్ కొరత వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. నెల వచ్చే గ్యాస్ 3 నెలల వస్తుంది!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×