E-Paper
Advertisement

Snapchat: మీరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? తరచూ స్నాప్‌చాట్ స్టోరేజ్ ఫుల్ అవ్వడానికి కారణం తెలుసుకోండి..

Snapchat: మీరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? తరచూ స్నాప్‌చాట్ స్టోరేజ్ ఫుల్ అవ్వడానికి కారణం తెలుసుకోండి..
Advertisement

Snapchat: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ద్వారా ‘మెమరీస్ స్టోరేజ్ ఫుల్’ అనే ప్రధాన సమస్యను వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఇన్‌స్టాగ్రామ్ తర్వాత ఎక్కువగా వాడేది స్నాప్‌చాట్‌ మాధ్యమాన్నే. ఈ యాప్‌లో అనేక రకాల ఫిల్టర్ ఆప్షన్స్.. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా స్నాప్ ద్వారా ఇతరులకు తెలియజేస్తూ ఉంటాం. దీనిలో భాగంగా ఫొటోలు, వీడియోలు ఎక్కువగా సేవ్ చేయడం వల్ల 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది.

అయితే ఈ క్లౌడ్ స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు దానిని పరిష్కరించుకోవడానికి ప్రతీ నెల సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇక నుంచి సబ్‌స్క్రిప్షన్ తీసుకునే అవసరం లేకుండానే.. స్నాప్‌చాట్ యాప్‌లో చిన్నసెట్టింగ్ మార్చుకుంటే.. అదనపు ఖర్చు లేకుండా మీ డేటాను సురక్షితంగా బ్యాకప్ చేసుకుని, స్నాప్‌చాట్ స్టోరేజ్‌ను ఖాళీ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దా రండి..

Advertisement

Also Read: కొత్త ఏడాది బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఒక్కసారిగా పడిపోయిన యాపిల్ వాచ్‌ల ధరలు!

ఫ్రీ సబ్‌స్క్రీప్షన్ కోసం ఏం చేయాలి?

సబ్‌స్క్రిప్షన్ లేకుండా మీ డేటాను సేవ్ చేసుకోవడానికి.. ముందుగా స్నాప్‌చాట్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కాస్త కిందకు స్క్రోల్ చేస్తే My Data అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ అనేక
డేటా ఆప్షన్లు ఉంటాయి. వాటిలోని అన్ని ఆప్షన్లను ఆఫ్ చేసి, కేవలం ‘Memories and Other Media’ను మాత్రమే ఆన్ చేయాలి. తర్వాత మీరు కావాల్సిన డేటా రేంజ్‌ను ఎంచుకుని, మీ ఈ-మెయిల్ అడ్రస్ ఇచ్చి డేటా రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ జరిగిన 24 గంటల్లో మీ ఈ-మెయిల్‌కి ఒక డౌన్లోడ్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీ మెమరీస్‌ను ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్ లేదా గూగుల్ ఫొటోస్‌లో ఎంచక్కా సేవ్ చేసుకోవచ్చు.

5GB ఉచిత స్టోరేజ్..

Advertisement

అలాగే ఇక్కడ చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే.. మీ డేటా బ్యాకప్ పూర్తయ్యాక, స్నాప్‌చాట్ మెమరీస్‌లోని పాత ఫొటోలను డిలీట్ చేయాలి. దీని ద్వారా మీ 5GB ఉచిత స్టోరేజ్ మళ్లీ ఖాళీ అవుతుంది. అదనంగా.. సెట్టింగ్స్‌లోని Clear Cache ఆప్షన్‌ను ఉపయోగించడం వల్ల యాప్‌లో స్టోరీజ్ సమస్య తగ్గుతుంది. కానీ ఫోటోలు డిలీట్ అవవు. దీంతోపాటు స్నాప్స్‌ను క్లౌడ్‌లో మాత్రమే కాకుండా ఫోన్ గ్యాలరీలో కూడా సేవ్ చేసేలా Auto Save సెట్టింగ్ మార్చితే.. మీ ఫోన్‌లో డేటాను ఉంచుకుని స్నాప్‌చాట్ నుండి డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మీ మెమరీస్ సేఫ్:

పైన చెప్పిన విధంగా స్నాప్‌చాట్ యాప్‌లో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ద్వారా మీరు అదనంగా డబ్బు చెల్లించి స్టోరేజ్ కొనాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. మీ ఫొటోలు, వీడియోలు కూడా ఎప్పటికీ మీ వద్దే భద్రంగా ఉంటాయి. మీకు అవసరం, ముఖ్యమైనది అనిపించే డేటాను ఒకటి కంటే.. ఎక్కువ చోట్ల భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం గూగుల్ డ్రైవ్ లేదా హార్డ్‌డిస్క్‌లో కూడా బ్యాకప్‌ చేసుకోవచ్చు.

Also Read: మీ వైఫైను ఎవరెవరు వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి!

 

 

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×