E-Paper
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ… రవితేజ ఫ్యాన్స్ కి సగం విముక్తి

Bhartha Mahasayulaku Wignyapthi Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ… రవితేజ ఫ్యాన్స్ కి సగం విముక్తి
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review : రవితేజ హిట్టు కొట్టి 4 ఏళ్ళు అవుతుంది. ‘ధమాకా’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమాతో వచ్చాడు. మరి దీంతో అయినా హిట్టు కొట్టాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…

కథ:

రామ్ అలియాస్ రామ సత్యనారాయణ(రవితేజ) ఓ పెద్ద బిజినెస్ మెన్. కానీ అతను చేసే బిజినెస్ ఏదేదో అనుకోకండి.. అతను ఒక ఆల్కహాల్ కంపెనీకి ఓనర్. ఒకసారి అతను అనార్కలి అనే కొత్త వైన్ తయారు చేసి… దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి అటెన్షన్ తేవాలి అనుకుంటాడు. ఈ క్రమంలో స్పెయిన్ లో ఉన్న ఒక కంపెనీతో కొలాబరేట్ అవుదామని ప్రయత్నిస్తాడు. కానీ అందుకు ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు. అతని ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తారు. అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని రామ్ తన మేనేజర్ లీలా(వెన్నెల కిషోర్) ని తీసుకుని స్పెయిన్ కి వెళ్తాడు.

Advertisement

అక్కడ ఆల్కహాల్ కంపెనీ ఎం.డి అయినటువంటి మానస(ఆషిక రంగనాథ్)ని కలుస్తాడు. రామ్ ఆల్కహాల్ ని రిజెక్ట్ చేసింది మానస మేనేజర్ బెల్లం(సత్య) అని తెలుస్తుంది. అతనికి బుద్ది చెప్పి రామ్ కి దగ్గరవుతుంది మానస. ఊహించని విధంగా వీళ్ళు ఫిజికల్ గా దగ్గరవుతారు. అయితే రామ్ కి పెళ్లైంది అనే విషయం తెలీక అతనికి మనసిచ్చేస్తుంది మానస. అటు తర్వాత రామ్ ఇండియాకి వచ్చేసి తన భార్య బాలామణి(డింపుల్ హయాతి) వద్ద ఎప్పటిలానే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ మానస మాత్రం రామ్ కోసం ఇండియా వచ్చేస్తుంది. తర్వాత రామ్ కి పెళ్లైంది అనే విషయం ఆమెకు తెలుస్తుంది. అటు తర్వాత మానసతో రామ్ వ్యవహారం బాలమణికి కూడా తెలుస్తుంది. అటు తర్వాత ఏం జరిగింది? ఈ మధ్యలో రామ్ కి ఎదురైన సమస్యలు ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా

విశ్లేషణ :

దర్శకుడు కిషోర్ తిరుమల ఫ్యామిలీ సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్. కాకపోతే అతనికో సమస్య ఉంది. ఫస్ట్ హాఫ్ ని మంచి ఎంటర్టైన్మెంట్ తో నింపేస్తాడు. దీంతో సెకండాఫ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అని ప్రేక్షకుడు ఆశపడతాడు. కానీ సెకండాఫ్ ని సాగదీసేసి ఆడియన్స్ కి చిరాకు తెప్పించేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కిషోర్ తిరుమలకి సెకండాఫ్ సిండ్రోమ్ ఉందనుకోవచ్చు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా మొదలైనా సత్య కామెడీ ఆకట్టుకుంటుంది.

Advertisement

స్క్రీన్ ప్లే పరుగులు పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ కి సెకండాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. కానీ సెకండాఫ్ లో అటు భార్యకి ఇటు ప్రియురాలికి మధ్య నలిగిపోయే భర్త పాత్రలో హీరో ఇబ్బంది పడటం.. ఈ క్రమంలో వచ్చే వెన్నెల కిషోర్, సునీల్..ల కామెడీ, సీరియల్ సాంగ్స్ కి డాన్స్ వేయడం వంటివి బాగానే ఉంటాయి.. కానీ ఒక్కటే సీన్ రిపీటెడ్ గా వస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి.

బేసిగ్గా కిషోర్ తిరుమల మంచి రైటర్. చాలా చోట్ల పంచ్ డైలాగులు బాగా పేలాయి. అందువల్ల క్లైమాక్స్ ని సెన్సిబుల్ గా డీల్ చేస్తాడేమో అని అంతా ఆశిస్తారు. కానీ క్లైమాక్స్ ని కూడా అతను సాగదీసి ఆడియన్స్ కి ఇక చాల్లే అనే ఫీలింగ్ తెప్పించాడు. రన్ టైం కూడా తక్కువగా ఉండటంతో ‘ఇట్స్ ఓకే’ అంటూ ప్రేక్షకుడు థియేటర్ ను బయటకు వచ్చేస్తాడు.

నటీనటుల విషయానికి వస్తే.. రవితేజ ఈ సినిమాలో హీరో. అతనికి ఈ పాత్ర కొత్తదేమో.. ఈ సినిమాకి అతని ఇమేజ్ మార్కెట్ పరంగా హెల్ప్ చేస్తుందేమో..! అంతే తప్ప అతని ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా మిస్ అయిన సినిమా ఇది. గతంలో రవితేజ చేసిన ‘సారొచ్చారు’ లో కూడా ఎనర్జీ లెవెల్స్ కనిపించవు. మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత అలాంటి పాత్రనే రవితేజ చేశాడు అనుకోవాలి. ఆషిక రంగనాథ్ గ్లామర్ పరంగా ఫుల్ మర్క్స్ కొట్టేసింది. డింపుల్ హయాతి ఎందుకో ఈ పాత్రకి సెట్ అవ్వలేదు. కానీ ‘వామ్మో వాయ్యో’ సాంగ్ లో మాత్రం డాన్స్ ఇరకొట్టేసింది. సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్.. డౌట్ లేకుండా ఈ సినిమాకి సేవియర్స్ వాళ్ళే అనడంలో సందేహం లేదు.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ డైలాగ్స్
రవితేజ
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ
స్క్రీన్ ప్లే
సెకండాఫ్
అవసరం లేని స్పూఫ్‌లు

మొత్తంగా… ముఖం మీద నవ్వు.. గుండె మీద భారం.. ఇదే భర్త మహాశయుల విజ్ఞప్తి

Bhartha Mahasayulaku Wignyapthi Movie Rating – 2.25/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×