E-Paper
Advertisement

మీ ఏరియాలో Airtel బ్రాడ్‌బ్యాండ్ ఉందో? లేదో? 2 నిమిషాల్లో చెక్ చేసుకోండిలా..

మీ ఏరియాలో Airtel బ్రాడ్‌బ్యాండ్ ఉందో? లేదో? 2 నిమిషాల్లో చెక్ చేసుకోండిలా..
Advertisement

Airtel Xstream Fiber: నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికీ వేగవంతమైన ఇంటర్నెట్ చాలా అవసరం. ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ వర్క్, ఓటీటీ సినిమాలు లేదా ఇంట్లో ఉండే స్మార్ట్ పరికరాలు.. ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే మంచి ఫైబర్ కనెక్షన్ ఉండాల్సిందే. అయితే ముందుగా మీ ఏరియాలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొత్తగా వైఫై తీసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాకే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందగలరు.

ఇలా చెక్ చేసుకోండి..

మీ ఏరియాలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. దీనికోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ బ్రాడ్‌బ్యాండ్ సెక్షన్‌లో మీ ఇంటి అడ్రస్, పిన్‌కోడ్ ఎంటర్ చేస్తే.. మీ ప్రాంతంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ ఉంటే.. అక్కడికక్కడే ప్లాన్ ఎంచుకుని ఇన్స్టాలేషన్ బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: Nubia NaviX Ultra ఫస్ట్ లుక్ చూశారా? 50MP కెమెరా, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లతో దుమ్మురేపనుంది!

రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు:

ఎయిర్‌టెల్ వివిధ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో నెలకు రూ.499 లేదా రూ.699 ప్లాన్ ఎంచుకుంటే 40 Mbps వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. అదే కొంచెం ఎక్కువ డివైజ్‌లు వాడేవారికి రూ.799 ప్లాన్ సరిపోతుంది. ఎందుకంటే.. ఇది 100 Mbps స్పీడ్ ఇస్తుంది. అలాగే ఓటీటీ ప్రియుల కోసం రూ.999 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా వస్తాయి.

సరైన ప్లాన్ ఎంచుకోవడమెలా?

Advertisement

చిన్న కుటుంబాలు, విద్యార్థులు లేదా తక్కువ వాడకం ఉన్నవారికి ప్రారంభ ప్లాన్లు సరిపోతాయి. ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉండే పెద్ద కుటుంబాలకు రూ.799 లేదా రూ.999 ప్లాన్లు చాలా అనుకూలం. ఆఫీస్ పనులు, గేమింగ్, ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూసే హెవీ యూజర్లయితే 300 Mbps స్పీడ్, అదనపు టీవీ ఛానెళ్లతో వచ్చే రూ.1,599 ప్లాన్ బెస్ట్ ఛాయిస్. మీకు ఎలాంటి ప్లాన్ అవసరమో ముందే తెలుసుకుని రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందగలరు.

Also Read: పాస్‌వర్డ్ మరిచిపోయారా? నో ప్రాబ్లం.. సెల్ఫీతో గూగుల్ అకౌంట్‌ను ఇలా రికవరీ చేసుకోండి!

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×