E-Paper
Advertisement

Nubia NaviX Ultra ఫస్ట్ లుక్ చూశారా? 50MP కెమెరా, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లతో దుమ్మురేపనుంది!

Nubia NaviX Ultra ఫస్ట్ లుక్ చూశారా? 50MP కెమెరా, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లతో దుమ్మురేపనుంది!
Advertisement

Nubia NaviX Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నూబియా.. మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. భారీ బ్యాటరీ, మెరుగైన పనితీరు, అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో Nubia NaviX Ultra పేరుతో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. గతేడాది చైనాలో లాంచ్ అయిన మోడల్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రానుంది.

ఈ ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ కెపాసిటీ గురించే. దీనిలో ఏకంగా 7100mAh భారీ బ్యాటరీని అందించబోతున్నారని సమాచారం. ఫోన్ ఎక్కువగా వాడేవారికి ఛార్జింగ్ పదే పదే ఛార్జ్ చేసే పని లేకుండా ఇది రోజంతా బ్యాకప్ ఇస్తుంది. ఇక ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో ఇది రానుంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి.

Advertisement

Also Read: పాస్‌వర్డ్ మరిచిపోయారా? నో ప్రాబ్లం.. సెల్ఫీతో గూగుల్ అకౌంట్‌ను ఇలా రికవరీ చేసుకోండి!

ఈ Nubia NaviX Ultra ఫోన్ 6.78 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చే ఛాన్స్ ఉంది. సెల్ఫీల కోసం కూడా ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరానే అందించనున్నారని లీకుల ద్వారా తెలుస్తోంది.

Advertisement

అలాగే ఈ ఫోన్ డిజైన్ పరంగా వైట్, పింక్, పర్పల్, బ్లాక్ కలర్స్‌లో లభించనుంది. ఫోన్ సైడ్‌లో ఏఐ ఫీచర్ల కోసం ఒక ప్రత్యేకం ఆరెంజ్ కలర్ బటన్ కూడా ఉండనుంది. అంతేకాకుండా.. బైట్‌డ్యాన్స్ అభివృద్ధి చేసిన ‘దౌబావో’ ఏఐ అసిస్టెంట్‌ను దీనిలో పూర్తిగా అనుసంధానించారు. తద్వారా మన దైనందిన పనులను ఫోన్ మరింత స్మార్ట్‌గా, ఆటోమేటిక్‌గా పూర్తి చేయగలదు. శక్తివంతమైన హార్డ్‌వేర్, సరికొత్త ఏఐ సాంకేతికతతో రాబోతున్న ఈ నూబియా ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

Also Read: 10 నిమిషాల ఛార్జ్‌తో 12 గంటలు బ్యాకప్.. 3D ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్‌తో సరికొత్త బోట్ హెడ్‌ఫోన్స్ లాంచ్!

Related News

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

Big Stories

Advertisement
×