E-Paper
Advertisement

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!
Advertisement

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! అని ముందే మ‌నం చ‌ర్చించుకున్నాం. ఇప్పుడు బొద్దింక‌ల చేత‌జిక్కి బ‌ల‌వంత‌మైన స‌ర్పంలాంటి బీజేపీ మెడ‌లు వంచింది. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఎట్టేక‌లకు రాజీనామా చేశారు.

విద్యార్ధుల‌ ధ‌ర్మ‌బ‌ద్ద‌మైన ఆందోళ‌నను గౌర‌వించి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాన‌ని ఆయ‌న రాజీనామా ప‌త్రంలో పేర్కొన్నారు. ఇది విద్యార్థులు, ఉద్య‌మాలు సాధించిన విజ‌యంగా భావిస్తున్నారు. మోడీకి ఇది వ‌ర‌కు ఇలాంటి ఎదురుదెబ్బ త‌గ‌ల‌లేద‌నే చెప్పాలి. జెన్-జీ చేసిన పోరాటాలు దేశం మొత్తంగా యువ‌త‌ను ఏక‌తాటిపైకి తెచ్చిపెట్టాయి. ఇది దేశ రాజ‌కీయాల్లో కొత్త అధ్య‌య‌నాన్ని లిఖించింద‌నే చెప్పాలి.

Advertisement

బొద్దింక‌లతో ఏమ‌వుతుందిలే.. అని మొదట లైట్‌గా తీసుకున్నారు. ఆ త‌రువాత మొండి పంతానికి వెళ్లింది కేంద్రం… మీరు చెబితే మేం వినాలా? వింటే మీకు త‌లొగ్గిన‌ట్టే.. న‌ని కేంద్రం భావించింది. అందుకే ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో ఇంకా మొండికేసింది. ఆ త‌రువాత ఉద్య‌మ హింసాత్మ‌కంగా మార‌డంతో కేంద్రంలో క‌ద‌లిక వ‌చ్చింది.

మొత్తం జాతి కేంద్ర వైఖ‌రి ప‌ట్ల దుమ్మెత్తిపోస్తున్న త‌రుణంలో పంత0 వీడ‌క‌తప్ప‌లేదు మోడీకి. బింకం వ‌ద‌లి.. రెండు మూడు మెట్లు దిగి.. చాలా విష‌యాల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చింది. కానీ రాజీనామా విష‌యంలో మాత్రం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. కానీ దీనిపైనే కాక్రోచులు ఇంకా గ‌ట్టి డిమాండ్ చేశారు. ఎంత వ‌ర‌కు వ‌చ్చిదంటే… శాఖ మార్పు చేసినా మేం ఊరుకోం.. క‌చ్చితంగా ఆయ‌న‌ను త‌ప్పించాల్సిందేన‌ని.. డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు.

Advertisement

ఇక ఇది ఆగేలా లేద‌ని కేంద్రం గ్ర‌హించింది. అందుకే ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించాల‌ని చివ‌ర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. కానీ మ‌ళ్లీ ధ‌ర్మేంద్రకు ఏలాంటి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇచ్చినా కూడా అది బీజేపీ బ‌ద్నాంకే దారి తీస్తుంది. అందుకే మోడీ ఈ విష‌యంలో ఇక మ‌రీ తెగేదాకా లాగొద్ద‌ని డిసైడ్ అయిన‌ట్టున్నాడు. అందుకే ఇక ధ‌ర్మేంద్ర మాజీ మంత్రిగానే ఉండ‌నున్నారు.

సెల‌బ్రిటీలు కూడా సీజేపీ ఉద్య‌మానికి సంఘీభావం తెలుపుతున్న వేళ‌.. దీన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు బీజేపీ సోష‌ల్ మీడియా ఎన్ని ర‌కాలుగా ప్ర‌చారం చేసినా.. అది ఆగ‌లేదు. జ‌నాలు న‌మ్మ‌లేదు. ఇంకా బ‌లం పెరుగుతూ వ‌చ్చిందే త‌ప్ప‌.. ఎక్క‌డా ఒక్క అడుగు కూడా వెన‌క్కి వేయ‌లేదు. అందుకే మోడీకి నిద్ర‌లేని రాత్రుల‌నే మిగిల్చాయి బొద్దింక‌లు.

అందుకే ఆయ‌న లేట్‌నైట్ వీడియోలు విడుద‌ల చేశారు. ఇది కూడా విమ‌ర్శ‌ల‌కే గురి అయ్యింది. మోడీ భ‌య‌ప‌డుతున్నాడ‌ని ప్ర‌కాశ్ రాజ్ త‌దితరులు కామెంట్ చేయ‌డం.. కేంద్రంలోని ఎన్డీయే ప‌రిస్థితికి ఇది అద్దం ప‌ట్టింది. మోడీకి ఇక తిరుగులేదు.. మోడీ ఏం చేసినా.. ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. దేశం కోసం.. ధ‌ర్మం కోసం అని చెప్పుకుంటూ కాలం గడిపిన రోజుల‌కు చెక్ పెట్టాయి బొద్దింక‌లు. బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ..! అనే ప‌ద్యా సారాంశాన్ని నిజం చేసి చూపింది సీజేపీ.

Related News

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

గ్రాండ్ సక్సెస్ సాధించిన టీపీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణంలో నిలిచిన టాప్ ప్రోగ్రామ్స్ ఇవే!

Big Stories

Advertisement
×