E-Paper
Advertisement

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ, ఎలా దొరకాడంటే?

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ, ఎలా దొరకాడంటే?
Advertisement

కామారెడ్డి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కల్లు దుకాణం విషయంలో బాధితుడిని తీవ్రంగా వేధిస్తూ సత్యనారాయణ పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఇబ్బందులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ ఆపరేషన్ మొదలైంది.

బాధితుడి నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ లావాదేవీ సీఐ తన అద్దె ఇంట్లో నిర్వహిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణ నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా లెక్క చూపని మరో 45 వేల రూపాయలు లభ్యమయ్యాయి. ఈ అదనపు నగదుకు సంబంధించి సీఐ ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు.

Advertisement

కల్లు దుకాణం యజమానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకే ఈ లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. బాధితుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏసీబీ అధికారులు అతని వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. సత్యనారాయణను అరెస్ట్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ALSO READ: BREAKING: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు..! ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×