Air Cooler: సమ్మర్ వచ్చిందంటే.. చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. అయితే ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్ ‘ఎయిర్ కూలర్’, ఏసీ కొనేంత బడ్జెట్ లేకపోయినా లేదా తక్కువ ఖర్చుతో ఇల్లంతా చల్లగా ఉండాలనుకున్నా కూడా కూలర్ బెస్ట్ ఛాయిస్. అయితే మార్కెట్లో రకరకాల బ్రాండ్లు, మోడల్స్ ఉండటంతో ఏది కొనాలో అర్థం కాక చాలామంది అయోమయానికి గురవుతారు. మీ రూం సైజు, గాలి నాణ్యత, మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ఎయిర్ కూలర్‌ను ఎలా ఎంచుకోవాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఇంటికి సరైన ఎయిర్ కూలర్‌ను ఎలా ఎంచుకోవాలి?
ఎయిర్ కూలర్ కొనడం అనేది కేవలం షాపుకి వెళ్ళి ఒక మోడల్ సెలక్ట్ చేసుకోవడం కాదు. దాని వెనక కొన్ని టెక్నికల్ విషయాలు ఉంటాయి. అవేంటంటే..
కూలర్ రకాలు:
ముందుగా మీకు ఏ రకమైన కూలర్ కావాలో నిర్ణయించుకోవాలి. కూలర్లు ఇవి రెండు రకాలు..
1.పర్సనల్ కూలర్స్ : ఇవి చిన్న గదులకు లేదా స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. వీటిలో నీటి ట్యాంక్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
2. డెసర్ట్ కూలర్స్ : పెద్ద హాల్స్ లేదా ఎక్కువ గాలి అవసరమైన చోట్ల ఇవి పనికొస్తాయి. ఇవి బయటి వేడి గాలిని బాగా పీల్చుకుని గదిని త్వరగా చల్లబరుస్తాయి.
సరైన ఎయిర్ కూలర్‌ను ఎలా ఎంచుకోవాలి?
ఎయిర్ కూలర్ కొనడం అనేది కేవలం షాపుకి వెళ్ళి ఒక మోడల్ సెలక్ట్ చేసుకోవడం కాదు. దాని వెనక కొన్ని టెక్నికల్ విషయాలు ఉంటాయి. అవేంటంటే..
2. రూం సైజు:
మీ రూమ్ సైజును బట్టి కూలర్ సామర్థ్యాన్ని లెక్కించాలి. కూలర్ గాలిని ఎంత వేగంగా పంపిస్తుందో చెప్పే దాన్ని CFM అంటారు.
చిన్న చిట్కా: గది పొడవు × వెడల్పు × ఎత్తును లెక్కించి.. దాన్ని 2తో భాగిస్తే మీకు కావాల్సిన CFM సుమారుగా తెలుస్తుంది.
3. వాటర్ ట్యాంక్ కెపాసిటీ:
రాత్రంతా హాయిగా నిద్రపోవాలంటే.. మాటిమాటికీ నీళ్లు నింపే పని లేకుండా ఉండాలి.
చిన్న గదికి 20-30 లీటర్లు సరిపోతుంది.
పెద్ద హాల్స్ అయితే.. 50-80 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్ తీసుకోవడం బెస్ట్.
4. కూలింగ్ ప్యాడ్ల నాణ్యత:
కూలర్ పని తీరు అంతా అందులో ఉండే ప్యాడ్ల మీద ఆధారపడి ఉంటుంది.
హనీకోంబ్ ప్యాడ్లు: ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. చల్లదనాన్ని అందిస్తాయి. కాస్త ఖరీదైనవి అయినా వీటి నిర్వహణ తక్కువ.
ఉడ్ వూల్ ప్యాడ్లు: ఇవి గడ్డి లాగా ఉంటాయి. వీటి ధర తక్కువ కానీ తరచుగా మార్చాల్సి ఉంటుంది.
Also Read: వడకట్టాల్సిన పనిలేదు, విటమిన్లు పోవు.. మీ వంటింటికి కొత్త కళను తెచ్చే బెస్ట్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్!
5. లేటెస్ట్ ఫీచర్లు:
ఇప్పుడు వస్తున్న కూలర్లు రిమోట్ కంట్రోల్‌తో కూడా వస్తున్నాయి. మీరు గమనించాల్సిన ఇతర ఫీచర్లు..
Ice Chamber: నీటితో పాటు ఐస్ ముక్కలు వేయడానికి ప్రత్యేకమైన ప్లేస్ ఉంటే.. ఇంకా చల్లటి గాలి వస్తుంది.
Inverter Compatibility: పవర్ పోయినప్పుడు ఇన్వెర్టర్‌పై పని చేసేలా ఉండాలి.
Humidity Control: వర్షాకాలంలో గాలిలో తేమ పెరిగినప్పుడు ఉక్కపోత రాకుండా కంట్రోల్ చేసే ఫీచర్ ఉంటే ఇంకా మంచిది.
ఎయిర్ కూలర్ కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే కాకుండా పైన చెప్పిన అంశాలన్నీ గమనిస్తే మీ డబ్బుకు తగ్గ విలువ లభిస్తుంది. అలాగే కూలర్ వాడేటప్పుడు గదిలో మంచి ‘వెంటిలేషన్’ ఉండేలా చూసుకోండి (కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచాలి).. అప్పుడే చల్లటి గాలి బాగా సర్క్యులేట్ అవుతుంది. నాణ్యమైన బ్రాండ్, వారంటీ ఉన్న ప్రొడక్ట్ ఎంచుకుని ఈ సమ్మర్ చల్లగా ఎంజాయ్ చేయండి.