E-Paper
Advertisement

వాషింగ్ మెషీన్ కొంటున్నారా ? మీ కుటుంబానికి ఏ కెపాసిటీ (KG) కరెక్టో తెలుసుకోండిలా!

వాషింగ్ మెషీన్ కొంటున్నారా ?  మీ కుటుంబానికి ఏ కెపాసిటీ (KG) కరెక్టో తెలుసుకోండిలా!
Advertisement

Washing machine buying guide: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషిన్ ఒక భాగమైపోయింది. అయితే మార్కెట్ వెళ్ళినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో చూసినప్పుడు 6kg, 7kg, 8kg, అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల మెషిన్లు కనిపిస్తాయి. వీటిలో మన కుటుంబానికి ఏది సరిపోతుందో తెలియక చాలామంది తప్పు సైజ్ కొని ఇబ్బంది పడుతుంటారు. చిన్న మెషిన్ కొంటే.. బట్టలు సరిగ్గా ఉడకవు, పెద్దది కొంటే కరెంట్, నీళ్లు వేస్ట్ అవుతాయి. మరి మీ ఫ్యామిలీ అవసరాలను బట్టి పర్ఫెక్ట్ కెపాసిటీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు వాషింగ్ మెషిన్ కెపాసిటీ (KG) అంటే ఏంటి?

చాలా మంది వాషింగ్ మెషిన్‌పై ఉండే కేజీల (KG) లెక్కను చూసి.. అది మెషిన్ బరువు లేదా అందులో పోసే నీళ్ల బరువు అనుకుంటారు. కానీ అది తప్పు. ఆ కేజీల లెక్క దేనిని సూచిస్తుందంటే.. ఆ మెషిన్ ఒకేసారి ఎంత బరువున్న పొడి బట్టలను  ఉతకగలదో చెప్పే సామర్థ్యం. బట్టలు తడిస్తే బరువు పెరుగుతాయి కాబట్టి.. డ్రై బట్టల బరువునే ప్రామాణికంగా తీసుకుంటారు.

Advertisement

ఫ్యామిలీ సైజ్ బట్టి కెపాసిటీ లెక్కలు:
మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దాన్ని బట్టి ఏ సైజ్ మెషిన్ కావాలో సులభంగా డిసైడ్ అవ్వచ్చు.

1.బ్యాచిలర్స్ లేదా ఇద్దరు వ్యక్తులు (1-2 సభ్యులు): మీ ఇంట్లో కేవలం ఇద్దరే ఉంటే మీకు 6 KG నుంచి 6.5 KG కెపాసిటీ గల వాషింగ్ మెషిన్ సరిగ్గా సరిపోతుంది. ఇది తక్కువ బట్టలను తక్కువ నీటితో.. వేగంగా ఉతికేస్తుంది.

Advertisement

2.చిన్న కుటుంబం (3-4 సభ్యులు): భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీలకు 7 KG నుంచి 7.5 KG కెపాసిటీ బెస్ట్. రోజువారీ బట్టలతో పాటు వారానికి ఒకసారి బెడ్ షీట్లను కూడా ఇందులో సులభంగా ఉతుక్కోవచ్చు.

3.పెద్ద కుటుంబం (5 లేదా అంతకంటే ఎక్కువ మంది): ఉమ్మడి కుటుంబాలు లేదా ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఇళ్లకు ఖచ్చితంగా 8 KG నుంచి 10 KG లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల మెషిన్ అవసరమవుతుంది. ఎక్కువ బట్టలను విడతల వారీగా కాకుండా ఒకేసారి ఉతకడానికి ఇది హెల్ప్ అవుతుంది.

బట్టలు ఉతికే అలవాట్లను బట్టి ఎంపిక:
కుటుంబ సభ్యుల సంఖ్యే కాకుండా.. మీరు బట్టలు ఎలా ఉతుకుతారనేది కూడా ముఖ్యమే. కొందరు ప్రతిరోజూ బట్టలు ఉతికితే, మరికొందరు వారానికి ఒకేసారి శని, ఆదివారాల్లో బట్టలు ఉతుకుతారు. మీరు వారానికి ఒకేసారి బట్టలు ఉతికే వారైతే.. మీ ఫ్యామిలీ చిన్నదైనా సరే కొంచెం పెద్ద కెపాసిటీ (ఉదాహరణకు 7.5 లేదా 8 KG) మెషిన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే బట్టల లోడ్ ఎక్కువగా ఉంటుంది.

Also Read: కరెంట్ బిల్లు తగ్గించుకుంటూ, ఫ్రిజ్ ఆయుష్షును పెంచే 5 అద్భుతమైన టిప్స్

బెడ్ షీట్లు,బ్లాంకెట్ల వాడకం:
మీ ఇంట్లో కాటన్ బెడ్ షీట్లు, హెవీ కర్టెన్లు, లేదా వింటర్ బ్లాంకెట్లు (దుప్పట్లు) ఎక్కువగా వాషింగ్ మెషిన్‌లోనే ఉతకాలి అనుకుంటే.. మీరు కనీసం 7.5 KG లేదా 8 KG మెషిన్‌ను ఎంచుకోవాలి. చిన్న కెపాసిటీ మెషిన్లలో పెద్ద దుప్పట్లు పెడితే అవి తిరగడానికి స్థలం లేక మోటార్‌పై భారం పడి మెషిన్ త్వరగా పాడైపోతుంది.

వాషింగ్ మెషిన్ అనేది ఐదేళ్లు, పదేళ్ల పాటు వాడే హోమ్ అప్లయన్స్. కాబట్టి కొనే ముందే.. మీ భవిష్యత్తు అవసరాలను కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే సేఫ్ సైడ్ కోసం 7 నుంచి 7.5 కేజీల మెషిన్ తీసుకోవడం ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ సింపుల్ టిప్స్ మైండ్‌లో పెట్టుకుని బడ్జెట్‌కు, అవసరాలకు సరిపోయే పర్ఫెక్ట్ వాషింగ్ మెషిన్‌ను ఇంటికి తెచ్చుకోండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×