E-Paper
Advertisement

కరెంట్ బిల్లు తగ్గించుకుంటూ, ఫ్రిజ్ ఆయుష్షును పెంచే 5 అద్భుతమైన టిప్స్

కరెంట్ బిల్లు తగ్గించుకుంటూ, ఫ్రిజ్ ఆయుష్షును పెంచే 5 అద్భుతమైన టిప్స్
Advertisement

Refrigerator maintenance tips 2026: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ వాడకం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా మారింది. మార్కెట్లో కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫ్రిజ్‌లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ..వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే వేలాది రూపాయల రిపేర్ ఖర్చులు తప్పవు. మరి 2026లో మీ ఫ్రిజ్ ఎలాంటి రిపేర్లు లేకుండా.. సూపర్ కండిషన్‌లో ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలో తెలుసా? మీ రిఫ్రిజిరేటర్ ఆయుష్షును రెట్టింపు చేసే కొన్ని ప్రాక్టికల్, ఈజీ మెయింటెనెన్స్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

ఫ్రిజ్ ఆయుష్షును పెంచే టిప్స్:

1.కాయిల్స్ క్లీనింగ్:
ఫ్రిజ్ వెనక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్ దాని లోని వేడిని బయటకు పంపుతాయి. కాలక్రమేణా వీటిపై దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు పేరుకుపోతాయి. దీనివల్ల కంప్రెసర్‌పై అదనపు భారం పడి, ఫ్రిజ్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. కనీసం సంవత్సరానికి రెండు సార్లు వ్యాక్యూమ్ క్లీనర్ లేదా బ్రష్ సహాయంతో ఈ కాయిల్స్‌ను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ ఆయుష్షు పెరగడమే కాకుండా.. కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గుతుంది.

Advertisement

2.డోర్ గాస్కెట్ చెక్ చేసుకోండి:
ఫ్రిజ్ తలుపుకు ఉండే రబ్బర్ స్ట్రిప్‌ను ‘గాస్కెట్’ అంటారు. ఇది ఫ్రిజ్ లోపలి చల్లదనం బయటకు పోకుండా కాపాడుతుంది. ఒకవేళ ఈ రబ్బర్ లూజ్ అయినా లేదా పాడైనా.. లోపలి కూలింగ్ బయటకు వెళ్ళిపోతుంది. దీని వల్ల లోపల చల్లదనాన్ని మెయింటైన్ చేయడానికి కంప్రెసర్ ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. మీ ఫ్రిజ్ డోర్ సరిగ్గా లాక్ అవుతుందో లేదో తెలియాలంటే.. ఒక చిన్న పేపర్ ముక్కను డోర్ మధ్యలో పెట్టి మూసేయండి. ఆ పేపర్ సింపుల్ గా బయటకు వచ్చేస్తే.. గాస్కెట్ మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం.

3. ఫ్రిజ్ నింపేయొద్దు:
చాలామంది ఫ్రిజ్ నిండా వస్తువులను కుక్కేస్తుంటారు. మరికొందరు పూర్తిగా ఖాళీగా ఉంచుతారు. ఈ రెండు పద్ధతులూ తప్పే.. ఫ్రిజ్ లోపల చల్లటి గాలి ఫ్రీగా తిరగడానికి కొంత స్థలం ఉండాలి. వస్తువులు ఎక్కువగా ఉంటే గాలి ఆడక కూలింగ్ తగ్గుతుంది. అలాగని పూర్తిగా ఖాళీగా ఉంచితే.. ప్రతి సారీ డోర్ తీసినప్పుడు చల్లటి గాలి బయటకు పోయి.. మళ్లీ కూలింగ్ అవ్వడానికి ఫ్రిజ్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రిజ్‌ను ఎప్పుడూ ముప్పావు వంతు మాత్రమే వాడటం మంచిది.

Advertisement

Also Read: కరెంట్ బిల్లు సేవింగ్స్ ఓకే.. BLDC ఫ్యాన్ పాడైతే ఎంత ఖర్చవుతుంది?

4.సరైన ఉష్ణోగ్రత:
ఫ్రిజ్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలన్నా.. అందులోని ఆహార పదార్థాలు తాజాగా ఉండాలన్నా ఉష్ణోగ్రత సరిగ్గా సెట్ చేసుకోవాలి. సాధారణంగా రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 3°C నుంచి 4°C మధ్య ఉండాలి. అలాగే ఫ్రీజర్ ఉష్ణోగ్రత -18°C వద్ద ఉండటం బెస్ట్. వాతావరణ మార్పులను బట్టి (ఎండాకాలం, చలికాలం) ఈ ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేస్తూ ఉండాలి.

5. గోడకు దూరంగా ఉంచండి:
చాలా ఇళ్లలో స్థలం తక్కువగా ఉందని ఫ్రిజ్‌ను తీసుకెళ్లి గోడకు అతుక్కుపోయేలా పెడతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఫ్రిజ్ నుంచి వచ్చే వేడి గాలి బయటకు వెళ్ళడానికి వెనుక వైపు కనీసం 2 నుంచి 3 అంగుళాల ఖాళీ స్థలం ఉండాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే ఫ్రిజ్ త్వరగా వేడెక్కిపోయి మోటార్ మొరాయిస్తుంది.

ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కొంటేనే.. ఎంతో కేర్ తీసుకునే మనం, వేల రూపాయలు పెట్టి కొనే ఫ్రిజ్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. పైన చెప్పిన సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ ఫ్రిజ్ పదేళ్లయినా కొత్తదానిలా పనిచేస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా.. మీ ఫ్రిజ్ లైఫ్‌ను పెంచే ఈ ట్రిక్స్‌ను ఈరోజే మీ ఇంట్లో ట్రై చేయండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×