iPhone Storage Tips: ఫోన్‌లో సడన్‌గా స్టోరేజ్ ఫుల్ అయిందని నోటిఫికేషన్ రావడం, అందులోనూ సిస్టమ్ డేటానే ఎక్కువ స్పేస్ ఆక్రమించుకోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. ఈ క్రమంలో యాప్స్ డిలీట్ చేసినా.. ఫోటోలు తీసేసినా ఈ ప్రాబ్లమ్ వెంటనే సాల్వ్ కాదు. సాధారణంగా ఫొటోలు, యాప్స్ లాగా దీన్ని సింగిల్ ట్యాప్‌తో క్లియర్ చేయడం కుదరదు. ఎందుకంటే.. ఇందులో టెంపరరీ ఫైల్స్, క్యాచే డేటా, సిస్టమ్ లాగ్స్ ఉంటాయి. అయితే, కొన్ని సింపుల్ పద్ధతులు పాటిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.
ఏది ఎక్కువ స్పేస్ తింటుందో తెలుసుకోవడం కోసం ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి General ఆప్షన్ ఓపెన్ చేయాలి. అక్కడ ఐఫోన్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే యాప్స్, ఫొటోలు, సిస్టమ్ డేటా ఎంత వాడుకుంటున్నాయనే క్లారిటీ వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా పెద్ద యాప్ ఎక్కువ డేటాను వాడుకుని ఉండవచ్చు. కాబట్టి ఏది ఎంత స్పేస్ తీసుకుంటుందో ముందుగా గమనించడం మంచిది.
Also Read: కేవలం రూ.17 వేలకే హైయర్ ఫ్రిజ్.. అమెజాన్ సేల్‌లో కస్టమర్లకు పండగలాంటి ఆఫర్లు!
మనం ఇంటర్నెట్‌లో వెతికే విషయాలు, ఓపెన్ చేసే వెబ్‌సైట్లు సఫారి బ్రౌజర్‌లో క్యాచే రూపంలో స్టోర్ అయిపోతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోతే చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది. సెట్టింగ్స్‌లో సఫారి ఆప్షన్‌కి వెళ్లి హిస్టరీ అండ్ వెబ్‌సైట్ డేటాను క్లియర్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్రౌజింగ్ హిస్టరీ పోతుంది కానీ ఫోన్ మీద అనవసరంగా పడుతున్న భారం కొంత తగ్గుతుంది.
ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు చిన్న రీస్టార్ట్ పెద్ద తేడా తెస్తుంది. ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసర ప్రాసెస్‌లను ఆపేయవచ్చు. ఫోన్ రీస్టార్ట్ అయ్యాక స్టోరేజ్ మళ్లీ చెక్ చేస్తే స్పేస్ కొద్దిగా ఫ్రీ అయినట్టు కనిపిస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్ ఎప్పుడూ లేటెస్ట్ వెర్షన్‌లో ఉంచుకోవడం వల్ల సిస్టమ్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
మనం రోజూ వాడే ఓటీటీ యాప్స్, సోషల్ మీడియా యాప్స్ ఫోన్‌లో ఎంతోకొంత క్యాచే డేటాను దాచుకుంటూనే ఉంటాయి. వాటిలో ఇకపై అవసరం లేని ఆఫ్‌లైన్ వీడియోలు లేదా సాంగ్స్‌ను డిలీట్ చేయాలి. ఏ యాప్ అయితే విపరీతంగా స్టోరేజ్ లాగేస్తోందో దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ రీఇన్‌స్టాల్ చేస్తే అందులో పేరుకుపోయిన చెత్త అంతా క్లియర్ అయిపోతుంది. దీనివల్ల ఫోన్ చాలా వరకు ఫ్రీ అవుతుంది.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!