E-Paper
Advertisement

ఏసీ గదిలో స్టాండ్ ఫ్యాన్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. నిజంగా ఆశ్చర్యపోతారు!

ఏసీ గదిలో స్టాండ్ ఫ్యాన్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. నిజంగా ఆశ్చర్యపోతారు!
Advertisement

AC Cooling Tips: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇళ్లల్లో పెద్ద ఎత్తున ఏసీలను ప్రజలు వినియోగిస్తున్నారు. గదిని త్వరగా చల్లబరిచేందుకు ఏసీ టెంపరేచర్ ను అమాంతం తగ్గించేస్తున్నారు. ఫలితంగా నెల తిరిగే సరికి వచ్చే కరెంటు బిల్లును చూసి నాలుక కరుచుకుంటున్నారు. అయితే ఈ సమస్యకు సాధారణ పెడెస్టల్ ఫ్యాన్ (స్టాండ్ ఫ్యాన్) తో చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాండ్ ఫ్యాన్ ను ఉపయోగించి.. క్షణాల్లో గదిని కూల్ గా మార్చుకోవడంతో పాటు విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం.

జెట్ స్పీడ్‌తో కూలింగ్..

సాధారణంగా ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి బరువుగా ఉండటం వల్ల అది కిందనే చక్కర్లు కొడుతూ ఉంటుంది. గదిలోని మూలలకూ, పైభాగాలకూ వెంటనే చేరదు. ఈ నేపథ్యంలో ఏసీ ఆన్ చేసినప్పుడు దానికి ఎదురుగా లేదా గది మధ్యలో పెడెస్టల్ ఫ్యాన్ పెడితే.. అది ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలిని గది నలుమూలకు వేగంగా ప్రసరింపజేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల గాలి సర్క్యులేషన్ పెరిగి.. గది మొత్తం కేవలం కొద్ది నిమిషాల్లోనే ఐస్ ముక్కలా చల్లగా మారిపోతుందని పేర్కొంటున్నారు.

మరి కరెంటు ఎలా తగ్గుతుంది?

Advertisement

చాలామంది ఏసీ ఆన్ చేయగానే గది త్వరగా చల్లబడాలని రిమోట్‌లో టెంపరేచర్‌ను 18°C లేదా 16°C కి తగ్గించేస్తుంటారు. దీనివల్ల ఏసీ కంప్రెషర్‌పై విపరీతమైన భారం పడి కరెంట్ బిల్లు అమాంతం పెరిగిపోతుంది. అదే పెడెస్టల్ ఫ్యాన్ ను గదిలో పెట్టడం వల్ల.. ఏసీ టెంపరేచర్‌ను 24 డిగ్రీలు లేదా 26 డిగ్రీల దగ్గర ఉంచినా కూడా గది చాలా చల్లగా అనిపిస్తుంది. ఫ్యాన్ తిరగడం వల్ల వచ్చే గాలి.. ఏసీ చల్లదనాన్ని కలిపి శరీరానికి తాకేలా చేస్తుంది. దీనివల్ల రూమ్ టెంపరేచర్ 24 డిగ్రీలు ఉన్నా కూడా మనకు 20 డిగ్రీలు ఉన్నంత హాయిగా, చల్లగా అనిపిస్తుంది. మరోవైపు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ప్రకారం.. ఏసీలో ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఈ లెక్కన పెడస్టల్ ఫ్యాన్ చిట్కాతో విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునేందుకు వీలు ఉంటుంది.

ఏసీ లైఫ్ పెరుగుదల..

పెడస్టాల్ ఫ్యాన్ ట్రిక్ తో గది త్వరగా చల్లబడటం వల్ల ఏసీలోని కంప్రెషర్ ఎక్కువ సమయం కష్టపడాల్సిన అవసరం ఉండదు. టెంపరేచర్ సెట్ కాగానే కంప్రెషర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల ఏసీపై లోడ్ తగ్గి అది త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా యూజర్లకు తప్పుతాయి.

Advertisement

Also Read: ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్ సిమ్.. రెండింటికి తేడా ఏంటి? సామాన్యులకు ఏది బెస్ట్?

ఇంతకీ ఫ్యాన్ ఎలా పెట్టాలి?

పెడెస్టల్ ఫ్యాన్‌ను ఏసీ గాలి వచ్చే దిశకు కాస్త ఎదురుగా లేదంటే క్రాస్‌గా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఏసీ గాలిని అది రూమ్ అంతా సులభంగా స్ప్రెడ్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఫ్యాన్‌ను ఒకే వైపే ఉంచకుండా అటు ఇటు తిరిగేలా పెట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల గది అంతటా సమానంగా చల్లదనం వ్యాపిస్తుందని తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఫ్యాన్‌ను ఫుల్ స్పీడ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదని మీడియం లేదా లో స్పీడ్‌లో పెట్టినా గాలి బాగా సర్క్యులేట్ అవుతుందని వివరిస్తున్నారు.

Also Read: BSNL కస్టమర్లకు షాక్.. రూ. 107 ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ కట్!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×