E-Paper
Advertisement

Whatsapp Earn Money: వాట్సాప్‌తో నెలకు లక్షల్లో సంపాదించే ట్రిక్.. ఎలాగంటే

Whatsapp Earn Money: వాట్సాప్‌తో నెలకు లక్షల్లో సంపాదించే ట్రిక్.. ఎలాగంటే
Advertisement

Whatsapp Earn Money Tricks | చాలా మంది వాట్సాప్‌ను కేవలం చాటింగ్‌కి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ కొందరు దీన్ని దీన్ని ఆదాయ మార్గంగా ఉపయోగించి ప్రతి రోజు వేలల్లో, నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇంట్లో కూర్చొని వాట్సాప్‌తో డబ్బు సంపాదించవచ్చు.

1. వాట్సాప్ బిజినెస్ ప్రమోషన్

ముందుగా WhatsApp Business యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఉచితం! ఇందులో మీ షాప్ పేరు, అడ్రస్, ఫోటో పెట్టి ప్రొఫెషనల్ బిజినెస్ ప్రొఫైల్ తయారు చేయవచ్చు. ఇక్కడే “కెటలాగ్” ఆప్షన్ ఉంటుంది. మీరు విక్రయించే ప్రొడక్ట్స్ ఫోటోలు, ధర, డిటెయిల్స్ అప్‌లోడ్ చేయండి. కస్టమర్ వాట్సాప్ ఓపెన్ చేసి నేరుగా మీ కెటలాగ్ చూసి ఆర్డర్ పెట్టేయొచ్చు. వెబ్‌సైట్ లేకుండానే చిన్న షాపులు రోజుకి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాయి.
వాట్సాప్ బిజినెస్ ఆటో రిప్లై ఫీచర్ పెట్టండి. కస్టమర్ “హాయ్” అని మెసేజ్ పెడితే ఆటోమాటిక్‌గా మీ ప్రొడక్ట్స్ లిస్ట్, ధరలు వెళ్తాయి. ఈ ఫీచర్ 24 గంటలు పని చేస్తుంది. అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా సేల్స్ జరుగుతాయి!

2. కేటలాగ్ ఫీచర్ – వెబ్‌సైట్ లేకుండానే ఆన్‌లైన్ షాప్

Advertisement

కేటలాగ్ ఫీచర్‌లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ ఉపయోగించండి. ఒకేసారి 256 మందికి మెసేజ్ పంపవచ్చు. కొత్త ప్రొడక్ట్ వచ్చాయని, కొత్త ఆఫర్స్ ఉన్నాయని ప్రమోట్ చేయండి.
మీరు విక్రయించే బట్టలు, ఆభరణాలు, హోమ్‌మేడ్ స్వీట్స్, మొక్కలు… ఏవైనా ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయండి ప్రతి వస్తువుకి ధర, సైజు, కలర్ వివరాలు రాయండి. కస్టమర్ మీ నంబర్ ఓపెన్ చేయగానే మీ పూర్తి షాప్ కనిపిస్తుంది. నచ్చిన వస్తువు పక్కన “మెసేజ్” నొక్కితే ఆర్డర్ బుక్ అవుతుంది. చాలా మంది ఈ కేటలాగ్‌తోనే రోజుకు 20 వేల నుంచి 1 లక్ష వరకు సులభంగా సంపాదిస్తున్నారు. వెబ్‌సైట్, షాప్ రెంట్ ఇలాంటి ఖర్చులు ఏమీ అవసరం లేదు!

3. బ్రాడ్‌కాస్ట్, కమ్యూనిటీస్ – ఒక్క క్లిక్‌తో వందల మందికి సేల్

WhatsApp Communitiesలో ఈ కొత్త ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 50 గ్రూపుల వరకు జాయిన్ చేయవచ్చు. మీరు స్టాక్ మార్కెట్ టిప్స్ గ్రూప్, ఆన్‌లైన్ కోర్సు గ్రూప్, ఫుడ్ ఆర్డర్ గ్రూప్ పెట్టి జాయిన్ అయ్యేందుకు రుసుము వసూలు చేయవచ్చు. నెలకు రూ.199 నుంచి రూ.999 వసూలు చేస్తే ఆదాయం లక్షల్లో వస్తుంది. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ టిప్స్ కమ్యూనిటీ (జాయినింగ్ ఫీజు రూ.499). అలాగే హోమ్‌మేడ్ ఫుడ్ ఆర్డర్ కమ్యూనిటీ, ఆన్‌లైన్ కోర్సులు నేర్పే కమ్యూనిటీ. నెలకు 500 మంది చేరితే రూ.2-3 లక్షలు సులభంగా వస్తుంది!

4.అఫిలియేట్ మార్కెటింగ్

Advertisement

అఫిలియేట్ మార్కెటింగ్ సూపర్ ఈజీ! ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా దీని ద్వారా భారీగా సంపాదించవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ లింక్ తీసుకొని మీ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎవరైనా మీ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు కమిషన్ వస్తుంది. 5 శాతం నుంచి 20 శాతం వరకు కమీషన్ లభిస్తుంది. స్టాక్ లేకుండా, డెలివరీ బాధ్యత లేకుండా మీకు ఆదాయం చేకూరే ఇది అద్భుతమైన మార్గం. రోజుకు 20-30 మంది కొన్నా నెలకు రూ.40-80 వేలు గ్యారంటీ!

ఇంకా చాలా మార్గాలున్నాయి. మీకు ఏదైనా స్కిల్ ఉంటే (ఫిట్‌నెస్, కుకింగ్, స్టడీస్) వాట్సాప్‌లోనే కన్సల్టింగ్ ఇవ్వండి. గంటకు రూ.500 నుంచి రూ.2000 వసూలు చేయవచ్చు. eBooks, PDF కోర్సులు తయారు చేసి విక్రయించండి. పెద్ద కంపెనీలకు వాట్సాప్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఇస్తూ సాలరీ కూడా సంపాదించుకోవచ్చు.

మొత్తంమీద వాట్సాప్ ఇప్పుడు కేవలం చాటింగ్ యాప్ కాదు. డబ్బులు ప్రింట్ చేసే మెషిన్! మీ క్రియేటివిటీ ఎంత ఉంటే అంత ఎక్కువ సంపాదన. ఇప్పుడే ప్రారంభించండి.

Also Read: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×