E-Paper
Advertisement

T BJP: పంచాయతీ ఎన్నికలపై ఫోకస్‌ చేసే టైమ్ ఉందా? కమలంలో కొత్త పంచాయతీ..

T BJP: పంచాయతీ ఎన్నికలపై ఫోకస్‌ చేసే టైమ్ ఉందా? కమలంలో కొత్త పంచాయతీ..
Advertisement

T BJP: ఓ అడుగు ముందుకైతే నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి.. గ్రామ స్వరాజ్యాన్ని చేజిక్కించుకుంటున్నారనుకుంటే.. అది అయ్యే పనేనా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిన సమయంలో సొంత పంచాయితీలతో ఫుల్ బిజీగా ఉన్నారంటా కమలనాథులు. ఇంతకీ కమలనాథుల గోలేంటి?

తెలంగాణలో అన్ని పార్టీలది ఒక తీరు అయితే.. బీజేపీ పార్టీది మరో తీరు. కేంద్రంలో దశాబ్ధకాలంగా అధికారంలో ఉంటున్నా.. తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు ఈ పార్టీ మనుగడ ఎలా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఓ అడుగు ముందుకు పడితే.. నాలుగడుగులు వెనక్కి పడే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం బీజేపీలో.

Advertisement

గ్రామాల్లో బలాన్ని పెంచుకోవాలనే ఆలోచన
బీజేపీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. గ్రామాల్లో బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ప్రణాళికలు రచిస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే ముఖ్య నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలకు కీలక మార్గదర్శకాలు ఇచ్చారు.

ఈ పంచాయితీలు.. పంచాయతీ ఎన్నికలపై ఎఫెక్ట్
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. పైపైకి ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు లోగుట్టు అంతా ఇప్పుడు అగ్ర నేతల వద్దే ఉంది. ఎందుకంటే పార్టీ నేతల మధ్య ఉన్న పంచాయితీలు.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించడం పక్కా అంటున్నారు దిగువస్థాయి నేతలు. కింది స్థాయిలో కేడర్ అంతా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొని, అనేక ఒడిదుడుకులతో జెండాను మోస్తుంటే.. పైస్థాయిలో నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడంపై పార్టీ శ్రేణులంతా అసంతృప్తిలో ఉన్నాయనే టాక్ నడుస్తోంది.

Advertisement

నిరుత్సాహంలో బీజేపీ కేడర్
పంచాయతీ ఎన్నికలకు నగరా మోగింది. ఇక రాబోయే కాలమంతా ఎన్నికల కాలం. ఇలాంటి సమయంలో కేడర్ అంతా నిరుత్సాహంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారమనే కుంభస్థలాన్ని కొట్టాలంటే, గ్రామీణంలో పాగా వేసి, బలం పెంచుకుంటేనే అనుకున్న లక్ష్యాలు సులువవుతాయి. కానీ అందుకు భిన్నంగా నేతల వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి జిల్లాలు, ఎవరి నియోజకవర్గాలు వారికే సొంతం అన్నట్టూ వారి వారి సెగ్మెంట్లకే నేతలు పరిమితం అవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా సమస్యల మీదా, పార్టీ బలోపేతం మీద దృష్టి లేదు కానీ.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని పార్టీ పరువు తీయడంపై ఫోకస్ చేస్తున్న కొంత మంది నేతలపై శ్రేణులంతా తీవ్ర స్థాయిలో అసహనం వెళ్లగక్కుతున్నారనే టాక్ నడుస్తోంది. ఒకరు ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలుపుతారు.. మరొకరు హాలో రామ చందర్ రావు అంటూ వార్నింగ్‌లిస్తారు.. ఒకరు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే, ఇంకొకరు ఆఫీస్ మెట్లు ఎక్కనివ్వడం లేదని కామెంట్ చేస్తారు. ఇలా ఎవరికివారే విమర్శలు చేసుకొని రచ్చకెక్కుతున్నారు.

Also Read: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

అసలు వీరికి పార్టీ అంటే లైటా? లేక అధ్యక్షుడంటే లైటా? పార్టీలో అందరూ రాజాసింగ్‌లు, మాధవి లతలు, ధర్మపురిలు, బండి సంజయ్‌లు, ఈటలలు ఉంటే.. ఎప్పుడూ ఎవరు ఏం మాట్లాడుతారో? ఎప్పుడు ఎవరెవరు దుమ్మెత్తి పోసుకుంటారో? ఎవరు ఎవరిపై విమర్శలు గుప్పించుకుంటారో? తెలియని పరిస్థితుల్లో పార్టీ ఉంది అనేది నేతలు మధ్య టాక్ నడుస్తోంది.

జూబ్లీహిల్స్ ఓటమి, నిత్యం నేతల మధ్య రగులుతున్న పంచాయితీలు
తాజాగా సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటికీ నేతల్లో ఏ మాత్రం చలనం లేదనట్టుగా విమర్శలు రావడంతో.. హడావుడిగా ఓ సమావేశం ఏర్పాటు చేసి.. అందరికి దిశానిర్ధేశం ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. మొత్తంమీద జూబ్లీహిల్స్ ఓటమి, నిత్యం నేతల మధ్య రగులుతున్న పంచాయితీలతో కేడర్ అంతా అసహనంలోకి వెళ్లిందన్న టాక్ నడుస్తోంది. ఇదే అసహనం ఇలాగే క్యాడర్లో కొనసాగితే తాజాగా జరగబోయే సర్పంచ్ ఎన్నికల పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో నాయకత్వం ఉందట. మరి రాష్ట్రంలో అధికారమనే కుంభస్థలాన్ని కొట్టాలంటే, కమలం పార్టీ గ్రామీణంలో బలపడుతుందా? అనుకున్న స్థానాలను కైవసం చేసుకోగలుగుతుందా? అనేది ఓ పెద్ద మిస్టరీగా మారింది.

Story By Vamshi Krishna, Bigtv

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×