E-Paper
Advertisement

Tips For Air Cooler: కూలర్ గాలి సరిగ్గా రావడం లేదా? ఈ 6 టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

Tips For Air Cooler: కూలర్ గాలి సరిగ్గా రావడం లేదా? ఈ 6 టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !
Advertisement

Tips For Air Cooler: సమ్మర్  వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతాయి. ఏసీ కొనేంత స్తోమత లేకపోయినా లేదా కరెంట్ బిల్లు భయంతోనో చాలామంది కూలర్లను వాడుతుంటారు. కానీ.. చాలా సార్లు కూలర్ వేసినా గాలి చల్లగా రాదు అంతే కాకుండా.. ఉక్కపోత తగ్గదు. నిజానికి.. కూలర్ పని తీరు అది ఉండే ప్రదేశం , మనం చేసే చిన్న చిన్న మెయింటెనెన్స్ పనులపై ఆధారపడి ఉంటుంది. మీ కూలర్ నుంచి మంచులాంటి చల్లదనం పొందడానికి ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి.

కూలర్ కోసం బెస్ట్ చిట్కాలు:

Advertisement

1. సరైన వెంటిలేషన్ :
చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. కూలర్ వేసినప్పుడు ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ మూసేస్తారు. దీని వల్ల గదిలో తేమ పెరిగిపోయి గాలి వేడిగా మారుతుంది. ఇలాంటి సమయంలో కూలర్ బెటర్ గా పని చేయాలంటే గదిలోకి తాజా గాలి రావాలి. లోపలి గాలి బయటకు వెళ్లాలి. అందుకే కూలర్‌ను కిటికీకి దగ్గరగా ఉంచండి. అవతలి వైపు ఉన్న కిటికీని కొంచెం తెరిచి ఉంచండి.

2. కూలింగ్ ప్యాడ్లను శుభ్రం:
కూలర్ వెనక ఉండే గడ్డి మీద దుమ్ము పేరుకు పోతే నీరు సరిగ్గా ప్రవహించదు. దీని వల్ల గాలి చల్లబడదు. అందుకే సీజన్ ప్రారంభంలో.. నెలకు ఒక సారి ఈ ప్యాడ్లను నీటితో శుభ్రం చేయాలి. ఒక వేళ అవి బాగా పాతబడిపోయి ఉంటే.. కొత్తవి మార్చడం ఉత్తమం.

Advertisement

3. ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వాడకం:
నీటి ట్యాంక్‌లో సాధారణ నీటికి బదులు బాగా చల్లగా ఉన్న నీటిని పోయండి. ఇప్పుడు వస్తున్న చాలా కూలర్లలో ఐస్ చాంబర్స్ ఉంటున్నాయి. అందులో ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ప్యాడ్ల ద్వారా వచ్చే గాలి అత్యంత చల్లగా మారుతుంది. ఇది తక్షణమే గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయ పడుతుంది.

4. వాటర్ పంప్ , ఫ్యాన్ మోటార్‌ను చెక్ చేయడం:
కూలర్ ఆన్ చేసే ముందు వాటర్ పంప్ సరిగ్గా పని చేస్తూ ప్యాడ్లన్నీ తడుస్తున్నాయో లేదో చూడాలి. పంప్ బ్లాక్ అయితే నీరు పైకి వెళ్లదు. అప్పుడు కూలర్ కేవలం ఫ్యాన్ లాగా మాత్రమే పనిచేస్తుంది. అలాగే.. ఫ్యాన్ బ్లేడ్లపై ఉన్న దుమ్మును తుడవండి. ఇది గాలి వేగాన్ని పెంచుతుంది.

5. నేరుగా ఎండ తగలకుండా చూడటం:
మీ కూలర్ కిటికీలో ఉన్నప్పుడు, సూర్యరశ్మి నేరుగా కూలర్ బాడీపై పడితే లోపల ఉన్న నీరు త్వరగా వేడెక్కుతుంది. దీని వల్ల గాలి చల్లదనం తగ్గుతుంది. వీలైనంత వరకు కూలర్ ఉన్న కిటికీకి నీడ ఉండేలా చూడండి లేదా కూలర్ పైన ఒక క్లాత్ కప్పి ఉంచడం వల్ల చల్లగా ఉంటుంది.

6. హనీకోంబ్ ప్యాడ్ల వాడకం:
మీ కూలర్‌లో సాధారణ గడ్డి ప్యాడ్లు ఉంటే.. వాటి బదులు ‘హనీకోంబ్ ‘ ప్యాడ్లను వాడటానికి ప్రయత్నించండి. ఇవి ఎక్కువ సేపు నీటిని పట్టి ఉంచుతాయి. అంతేకాకుండా గాలిని మరింత సమర్థవంతంగా చల్లబరుస్తాయి. ఇవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి కూడా.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ పాత కూలర్ కూడా కొత్త దానిలా పనిచేస్తుంది. కరెంట్ ఆదా అవ్వడమే కాకుండా.. తక్కువ ఖర్చుతోనే ఏసీ లాంటి అనుభూతిని పొందవచ్చు. ఈ వేసవిలో ఈ టిప్స్ పాటించి మీ ఇల్లు చల్లగా మార్చుకోండి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×