Telangana Politics: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో ఆ ఎమ్మెల్యేల పదవిపై ఉన్న చిక్కుముడి విడిపోయింది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంది.
తెలంగాణలో ఉప ఎన్నికలు లేనట్టే?
ఎట్టకేలకు ఏడాదిపైగా నలుగుతున్న ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎనిమిది ఎమ్మెల్యేలపై క్లారిటీ ఇచ్చారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు పడడం ఖాయమని భావించారు. ఇప్పటికే వారిపై పిటిషన్లను స్పీకర్ విచారించారు. బుధవారం ఉదయం ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చారు.
స్పీకర్ నిర్ణయంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ అంశాన్ని న్యాయస్థానంలో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టులో ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్-కడియం శ్రీహరిలకు క్లీన్‌చిట్ ఇచ్చిన స్పీకర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. సహజంగానే నేతలు వచ్చినప్పుడు కడువా కప్పారు. దీంతో పది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసు ఇచ్చింది బీఆర్ఎస్. స్పీకర్ నిర్ణయం కాస్త డిలే కావడంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ.
ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ క్లారిటీ ఇచ్చేశారు. వారంతా పార్టీ మారలేదని తేలడంతో బయటపడ్డారు. దానం, కడియంలపై కచ్చితంగా వేటు పడడం ఖాయమని అనుకున్నారు. అందుకే వారిద్దరు పిటిషన్లను పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం సాగింది. ఇటీవల ఇరువురు నేతల వాదనలు విన్న స్పీకర్, తీర్పుని రిజర్వ్ చేశారు.
ALSO READ: అంగన్ వాడీ చిన్నారులకు.. త్వరలో మరో కొత్త పథకం..!
బుధవారం 10 గంటలకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇప్పుడు దానికి ఫుల్‌స్టాప్ పడిపోయింది. నిబంధనల ప్రకారం ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు స్పీకర్.
దీని కారణంగా తెలంగాణలో బైపోల్ రావడం ఖాయమని అనుకున్నారు. స్పీకర్ నిర్ణయంతో అవన్నీ పటాపంచలయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సదరు ఎమ్మెల్యేలకు పెద్ద ఉపశమనం లభించింది.
స్పీకర్ తీర్పుపై ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. తనపై స్పీకర్ కి పిర్యాదు చేయడానికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కి జవాబుదారీనేనని, కానీ తనను దూరం పెట్టారని చెప్పారు. ఈ విషయంలో కావాలనే కొందరు వ్యక్తి గతంగా స్పీకర్ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, స్పీకర్‌కి అన్ని ఆధారాలు ఇచ్చానని తెలిపారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడిగా వర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లిన్ చిట్ ఇవ్వడమంటే ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించేందుకు ఇదొక ఉదాహరణగా రాసుకొచ్చారు. ప్రజల ఓట్లతో గెలిచినవారు పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సరైన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు.