E-Paper
Advertisement

Haircut: హెయిర్ కటింగ్ ఆ రోజు చేయిస్తే దరిద్రులు అయిపోతారట – ఏ రోజు చేయిస్తే మంచిదో తెలుసా

Haircut: హెయిర్ కటింగ్ ఆ రోజు చేయిస్తే దరిద్రులు అయిపోతారట – ఏ రోజు చేయిస్తే మంచిదో తెలుసా
Advertisement

Haircut: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హెయిర్ కటింగ్‌ చేసుకోవడానికి కూడా టైం చూసుకోవాలట. శాస్త్రం నిర్దేశించిన సమయంలో కటింగ్ చేసుకోవడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయట. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కటింగ్ చేయించుకుంటే లేనిపోని కష్టాలు పడాల్సి వస్తుందట. అయితే ఏ రోజుల్లో జుట్టు అసలు కత్తిరించుకోకూడదో ఏ రోజుల్లో కటింగ్ చేయించుకుంటే శుభమో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం:

హెయిర్ కటింగ్‌ మంగళవారం చేయించుకుంటే ఆ వ్యక్తికి కోపం ఎక్కువగ వస్తుందట. తరుచుగూ ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుందట. మంగళవారం కుజుడికి సంబంధించింది కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కటింగ్‌ చేయించుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. అలాగే అసమతుల్యతను పెంచుతుందట.

గురువారం:

Advertisement

ఎవరైనా గురువారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే అది వారు తమ జాతకంలోని  గురు గ్రహాన్ని బలహీనపరుచుకున్నట్టు అవుతుందట. జాతకంలో గురువు బలహీనపడితే ఆ వ్యక్తికి ఆర్థికపరమైన నష్టాలు రావడమే కాకుండా కోట్లు సంపాదించే వ్యక్తులు కూడా సంపాదన లేకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తుందట. అలాగే గురువారం కటింగ్‌ చేయించుకుంటే ఆ వ్యక్తి జ్ఞానం క్షీణించిపోతుందట.

శనివారం:

ఏ వ్యక్తి అయితే శనివారం హెయిర్  కటింగ్‌ చేయించుకుంటాడో ఆ వ్యక్తికి శనిదోషాలు పట్టుకుంటాయట. దీంతో ఆ వ్యక్తి చేసే పనుల్లో జాప్యాలు ఏర్పడతాయట. అలాగే ఆ వ్యక్తి మానసికమైన ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందట.

ఆదివారం:

Advertisement

ఎవరైనా ఆదివారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే.. ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందట. ఎందకంటే ఆదివారం సూర్యుడికి చెందిన వారం సూర్యుడు అంటే మనిషిలోని ధైర్యాన్ని నిదర్శనమట. అలాగే తేజస్సును కోల్పోవడం… అధికారాన్ని కోల్పోవడం జరుగుతుందట.

అమావాస్య:

అమవాస్య రోజు ఎవరైనా కటింగ్‌ చేయించుకున్నా వారికి ఎన్నో సమస్యలు స్వాగతం పలుకుతాయట. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మరియు పితృదోషాలు వస్తాయట. పూర్వీకుల అసమతుల్యత ఏర్పడుతుందట.

పౌర్ణమి:

ఏ వ్యక్తి అయినా పౌర్ణమి రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే.. ఆ వ్యక్తికి మానసికమైన అస్థిరత ఏర్పడుతుందట. అలాగే ఆ వ్యక్తి ప్రతి చిన్న విషయానికి మానసికమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందట.

నవరాత్రులు ( 9 రోజులు):

అమ్మవారిని పూజించే దసరా నవరాత్రులలో ఎవరైనా హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే వారికి పెద్దల నుంచి కానీ దేవుడి నుంచి కానీ పితృదేవతల నుంచి కానీ వచ్చే ఆశీర్వాదాలు ఆగపోతాయట. సాక్ష్యాత్తు అమ్మవారే వారికి వచ్చే ఆశీర్వాదాలను ఆపేస్తుందట. అందుకే ఎవ్వరూ కూడా నవరాత్రులలో హేయిర్ కటింగ్‌ చేయించుకోకూడదట.

సంక్రాంతి పండగ రోజు:

సంక్రాంతి పండుగ సమయంలో గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ముఖ్యంగా మకర సంక్రమణం జరుగుతుంది. ఆ రోజు కటింగ్‌ చేయించుకుంటే జీవితం కూడా సంచారం చేసినట్టే అయిపోతుందట. అందుకే సంక్రాంతి రోజు కటింగ్‌ చేయించుకోకూడదని పండితులు సూచిస్తున్నారు.

గ్రహణం పట్టిన రోజులు:

ఏదైనా చంద్రగ్రహణం కానీ సూర్య గ్రహణం కానీ పట్టిన రోజులలో కూడా కటింగ్‌ చేయించుకోకూడదట. ఒకవేళ కటింగ్‌ చేయించుకుంటే.. ప్రతికూల విశ్వకిరణాలను మీ జుట్టు గ్రహిస్తుందట. జుట్టు నుంచి మీకు ఆ ప్రతికూలత చేరి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందట.

జుట్టు కత్తిరించుకోవడానికి శుభ దినాలు:

సోమవారం:

ఎవరైనా హెయిర్ కటింగ్‌ చేయించుకోవాలనుకుంటే సోమవారం చేయించుకోవాలట. సోమవారం కటింగ్‌ చేయించుకోవడం వల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుందట. మనిషిలోని భావోద్వేగం తగ్గుతుందట. మానసికమైన స్వస్థత ఏర్పడుతుందట.

బుధవారం:

ఎవరైతే బుధవారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటారో వాళ్లకు తెలివి తేటలు పెరుగుతాయట. వాళ్లు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ది పెరుగుతుందట. ఇంకా కమ్యూనికేషన్‌ వృద్ది చెందుతుందట.

శుక్రవారం:

ఎవరైనా శుక్రవారం హెయిర్ కటింగ్‌ చేయించుకుంటే వారికి అందం పెరుగుతుందట. జనాకర్షన్‌ విపరీతంగా వస్తుందట. అలాగే మంచి రిలేషన్స్‌ ఏర్పడతాయట. ఇంకా విలాసవంతమైన జీవితం ఏర్పడుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మేష రాశికి ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×