E-Paper
Advertisement

Overheating Laptop: హీటింగ్ సమస్యతో మీ ల్యాప్‌టాప్ స్లో అవుతోందా? ఈ సెట్టింగ్స్ ఓసారి మార్చి చూడండి!

Overheating Laptop: హీటింగ్ సమస్యతో మీ ల్యాప్‌టాప్ స్లో అవుతోందా? ఈ సెట్టింగ్స్ ఓసారి మార్చి చూడండి!
Advertisement

Overheating Laptop: ఏదైనా ముఖ్యమైన వర్క్ చేస్తున్నప్పుడు లేదా గేమ్ ఆడుతున్నప్పుడు ల్యాప్‌టాప్ ఒక్కసారిగా వేడెక్కి, ఫ్యాన్లు విపరీతంగా శబ్దం చేయడం మొదలుపెడితే చాలా విసుగు వస్తుంది కదా. ల్యాప్‌టాప్ ఓవర్‌హీట్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ తగ్గడమే కాకుండా, లోపల ఉండే స్పేర్ పార్ట్స్ కూడా త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అయితే, ఖరీదైన కూలింగ్ ప్యాడ్లు కొనకుండానే కొన్ని చిన్న మార్పులతో మీ ల్యాప్‌టాప్‌ను చల్లబరచవచ్చు. అదెలాగో చూసేద్దాం రండి.

గాలి ఆడేలా చూసుకోండి:

చాలామంది ల్యాప్‌టాప్‌ను బెడ్ మీద లేదా సోఫాలో పెట్టి వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కింద ఉండే గాలి వెళ్లే రంధ్రాలు మూసుకుపోయి వేడి లోపలే ఉండిపోతుంది. కాబట్టి, ఎప్పుడూ ల్యాప్‌టాప్‌ను సమాంతరంగా ఉండే టేబుల్ మీద మాత్రమే వాడాలి. దీనివల్ల గాలి ప్రసరణ బాగుంటుంది.

క్లీనింగ్ చాలా ముఖ్యం:

Advertisement

తరచూ ల్యాప్‌టాప్ వాడటం వలన లోపల దుమ్ము పేరుకుపోతుంది. ఇది ఫ్యాన్లు సరిగ్గా తిరగకుండా అడ్డుకుంటుంది. అందుకే కనీసం రెండు నెలలకోసారి కంప్రెస్డ్ ఎయిర్ క్యాన్ ఉపయోగించి వెంటిలేషన్ రంధ్రాల ద్వారా గాలిని కొట్టి లోపల ఉన్న దుమ్మును క్లీన్ చేయాలి. దీంతో ఫ్యాన్లు ఫ్రీగా తిరుగుతాయి.

Also Read: లావా సరికొత్త యాడ్.. మొబైల్ సర్వీస్ సెంటర్లపై అదిరిపోయే సెటైర్, నవ్వకుండా ఉండలేరు

పవర్ సెట్టింగ్స్‌లో మార్పులు:

Advertisement

ఏదైనా చిన్న చిన్న వర్క్ చేసుకునేటప్పుడు ల్యాప్‌టాప్‌ను పవర్ సేవర్ లేదా బ్యాలెన్స్‌డ్ మోడ్‌లో ఉంచుకోండి. విండోస్ సెట్టింగ్స్‌లో ప్రాసెసర్ స్టేట్‌ను 100% నుండి 99%కి తగ్గించడం ద్వారా పెర్ఫార్మెన్స్‌లో పెద్ద తేడా లేకుండానే వేడిని తగ్గించవచ్చు. అలాగే స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను కొద్దిగా తగ్గించడం కూడా మేలు చేస్తుంది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను ఆపేయండి:

అవసరం లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ ప్రాసెసర్‌పై భారాన్ని పెంచుతాయి. టాస్క్ మేనేజర్ (Ctrl+Shift+Esc) ఓపెన్ చేసి, అనవసరమైన సాఫ్ట్‌వేర్‌లను క్లోజ్ చేయండి. మీరు గేమ్స్ ఆడేటప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్‌ను కొద్దిగా తగ్గించుకుంటే ల్యాప్‌టాప్ అంతగా వేడెక్కదు.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్:

ల్యాప్‌టాప్ కంపెనీలు అప్పుడప్పుడు ఇచ్చే BIOS లేదా గ్రాఫిక్ డ్రైవర్ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం మర్చిపోవద్దు. ఇవి పవర్ మేనేజ్‌మెంట్, ఫ్యాన్ కంట్రోల్‌ను మెరుగుపరుస్తాయి. అలాగే Undervolting వంటి టెక్నిక్స్ గురించి తెలుసుకొని ప్రాసెసర్‌కు అందే వోల్టేజీని కొద్దిగా తగ్గిస్తే అసలు వేడి సమస్యే ఉండదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.

Also Read: ఇదే సరైన సమయం.. ఐఫోన్ 17 సిరీస్‌పై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు, మిస్ అవ్వకండి!

Related News

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

Big Stories

Advertisement
×