E-Paper
Advertisement

India’s First Musical Road: జయహో పాట పాడేస్తున్న రోడ్డు.. ఇదేంది బాసూ ఇంత వింతగా ఉంది!

India’s First Musical Road: జయహో పాట పాడేస్తున్న రోడ్డు.. ఇదేంది బాసూ ఇంత వింతగా ఉంది!
Advertisement

India’s First Musical Road In Mumbai: రోడ్డు మీద వాహనదారులు వెళ్లే సమయంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు పలు దేశాలు మ్యూజిక్ వినిపించేలా రూపొందించాయి. వీటిని మ్యూజిక్ రోడ్స్ గా పిలుస్తుంటారు. ఇప్పటి వరకు విదేశాల్లోనే కనిపించిన ఈ మ్యూజిక్ రోడ్స్ ఇప్పుడు ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి ముంబై కోస్టల్ రోడ్ లోని కొంత భాగంలో రోడ్డును మ్యూజిక్ వినిపించేలా తయారు చేశారు. వాహనదారులు ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తున్నాయి.

జయహో పాట పాడుతున్న రహదారి

ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వర్లి వరకు వెళ్లే వాహనాదారులు ఇప్పుడు 2008 ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘స్లమ్‌ డాగ్ మిలియనీర్’లని ‘జయహో’ పాటను వింటూ ఎంజాయ్ చేయనున్నారు.  ప్రజల్లో, వాహనదారులలో దేశ భక్తిని నింపడానికి ఈ పాటను సెలెక్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నారిమన్ పాయింట్ నుంచి వర్లి వైపు ఉన్న క్యారేజ్‌వే పై మ్యూజిక్ స్ట్రిప్‌లు ఏర్పాటు చేశారు. వర్లి వైపు వెళ్లే భూగర్భ సొరంగం నుంచి వాహనదారులు బయటకు వచ్చినప్పుడు, వారు తమ వాహనాలు వెళ్తుంటే చక్కటి ‘జయహో’ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయనున్నారు.  కోస్టల్ రోడ్ కారిడార్‌ లో భాగమైన ఈ మ్యూజికల్ రోడ్, వినోదంతో పాటు సాంకేతికతను చాటి చెప్పనుంది. ఈ మార్గంలో డ్రైవింగ్ ను మరింత ఆనందదాయకంగా మార్చనుంది. ఇది ప్రపంచంలో ఐదవ మ్యూజిక్ రోడ్డు కాగా, ఇండియాలో మొట్టమొదటిది. తాజాగా ఈ రోడ్డును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు.

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ గురించి..

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని అరికట్టడం లక్ష్యంగా ప్రారంభం అయ్యింది.  ధరమ్‌ వీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ అని దీనికి పేరు పెట్టారు. ఇది మొత్తం 29.2 కి.మీ విస్తరించి ఉంటుంది. రోడ్డు దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్ల నుంచి ఉత్తర శివారులోని దహిసర్ వరకు ఉంటుంది.  సుమారు రూ.14,000 కోట్ల వ్యయంతో కూడిన ఈ తీరప్రాంత రహదారి, దక్షిణ ముంబై, శివారు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు వెల్లడించారు. అటు ఈ రోడ్డుపై మ్యూజిక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సమయంలో కాస్త రిలాక్సింగ్ గా ఉంటుందని చెప్తున్నారు.

Advertisement

Read Also: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×