Recover WhatsApp on new phone: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మన జీవితమంతా స్మార్ట్ ఫోన్‌లోనే ఉండిపోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి వాట్సాప్ వాడటం మనకు అలవాటు. అయితే.. అనుకోకుండా ఫోన్ దొంగతనానికి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా మన మనసులో మొదట వచ్చే భయం “నా వాట్సాప్ చాట్‌లు, ఫోటోలు సేఫ్ గా ఉన్నాయా?” అనేదే. ఎందుకంటే లొకేషన్ పాయింట్ నుంచి బ్యాంకింగ్ అప్‌డేట్స్ వరకు అన్నీ వాట్సాప్‌లోనే ఉంటాయి.
ఒకవేళ మీ ఫోన్ పోయినట్లయితే.. మీ వాట్సాప్ అకౌంట్ ఇతరులు దుర్వినియోగం చేయకుండా తక్షణమే ఏం చేయాలి? పాత అకౌంట్ సేఫ్ గా ఎలా రీస్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఫోన్ పోయిన వెంటనే మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని మీ టెలికామ్ ఆపరేటర్ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేసి మీ సిమ్ కార్డ్‌ను.. వెంటనే డియాక్టివేట్/బ్లాక్ చేయించడం. దీని వల్ల దొంగిలించిన వ్యక్తి మీ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా మీ వాట్సాప్, యూపీఐ లేదా ఇతర సోషల్ మీడియా అకౌంట్లను లాగిన్ చేయలేరు. సిమ్ బ్లాక్ చేశాక, అదే నంబర్‌తో మరొక డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకోండి.
కొత్త డూప్లికేట్ సిమ్ పొందిన వెంటనే, దానిని కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వేసి వాట్సాప్ ఇన్స్టాల్ చేయండి. మీ పాత మొబైల్ నంబర్‌తో వాట్సాప్ లాగిన్ అవ్వండి. మీ నంబర్‌కు వచ్చే 6 అంకెల SMS ఓటీపీని ఎంటర్ చేయండి. మీ నంబర్‌తో కొత్త ఫోన్‌లో లాగిన్ అవ్వగానే, పాత ఫోన్‌లో ఉన్న మీ వాట్సాప్ అకౌంట్ ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది.
వాట్సాప్ నిబంధనల ప్రకారం ఒకే నంబర్‌పై ఒకే సమయంలో ఒక్క మొబైల్‌లో మాత్రమే మెయిన్ అకౌంట్ రన్ అవుతుంది. కాబట్టి పాత ఫోన్‌లో మీ అకౌంట్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
ఒకవేళ మీకు కొత్త సిమ్ రావడానికి సమయం పడుతుంటే.. మీ వాట్సాప్ ఖాతా తాత్కాలికంగా ఆగిపోవడానికి ఇమెయిల్ మార్గాన్ని ఎంచుకోవచ్చు.
మీ ఇమెయిల్ ఐడీ నుండి వాట్సాప్ సపోర్ట్ టీమ్‌కు ఇమెయిల్ పంపండి. ఇమెయిల్ సబ్జెక్ట్‌లో.. “Lost/Stolen: Please deactivate my account” అని రాయండి. మెయిల్ బాడీలో మీ అంతర్జాతీయ కంట్రీ కోడ్‌తో కూడిన మొబైల్ నంబర్‌ను (ఉదాహరణకు: +91 XXXXXXXXXX) కచ్చితంగా పేర్కొనండి. ఇలా మెయిల్ పంపిన వెంటనే వాట్సాప్ మీ అకౌంట్ 30 రోజుల పాటు డియాక్టివేట్ చేస్తుంది. ఈ 30 రోజుల్లో మీరు మళ్లీ లాగిన్ అయితే మీ చాట్‌లు సేఫ్‌గా ఉంటాయి. లేదంటే శాశ్వతంగా తొలగించబడతాయి.
కొత్త ఫోన్ లో వాట్సాప్ లాగిన్ అయిన తర్వాత.. మీ పాత చాట్‌లు మళ్లీ రావాలంటే.. లాగిన్ ప్రాసెస్ సమయంలో వాట్సాప్ “Restore Backup” అని అడుగుతుంది. మీ పాత ఫోన్ లో వాట్సాప్ బ్యాకప్ కోసం ఉపయోగించిన అదే గూగుల్ అకౌంట్ లేదా ఐక్లౌడ్ ఐడీతో లాగిన్ అవ్వండి. “Restore” బటన్ క్లిక్ చేయగానే మీ పాత మెసేజ్ లు, మీడియా ఫైల్స్ అన్నీ క్షణాల్లో కొత్త ఫోన్ లోకి వచ్చేస్తాయి.
Alos Read: రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు
మీ ఫోన్ పోయినా.. మీ వాట్సాప్ ఇతరుల చేతికి చిక్కకుండా ఉండటానికి ఈరోజే ఈ సెట్టింగ్స్ చేసుకోండి.
టు-స్టెప్ వెరిఫికేషన్ : వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి.. వెళ్లి PIN కోడ్‌ను సెట్ చేసుకోండి. దీని వల్ల ఓటీపీ ఉన్నప్పటికీ.. ఈ పిన్ లేనిదే ఎవరూ లాగిన్ అవ్వ లేరు.
డైలీ చాట్ బ్యాకప్: ఆటోమేటిక్ గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌ను ‘Daily’ ఆప్షన్‌లో పెట్టుకోండి.
పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ బ్యాకప్: మీ బ్యాకప్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసి ఉంచండి.
ఫోన్ పోయినప్పుడు కంగారు పడకుండా.. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే.. మీ పర్సనల్ డేటా, వాట్సాప్ చాట్‌లు వేరొకరి చేతికి చిక్కకుండా ఈజీగా.. కాపాడుకోవచ్చు!