E-Paper
Advertisement

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్
Advertisement

Telugu Short Film: మనకు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే, ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. కానీ అదే వ్యక్తి మరో రోజు మన కళ్లముందే ఆపదలో పడితే మనం ఏం చేస్తాం ? మన ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతామా… లేక మనకు సాయం చేసిన వ్యక్తి కోసం నిలబడతామా ? భయం, కృతజ్ఞత, మనస్సాక్షి మధ్య మనిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూపించే కథే ‘నల్లజర్ల రోడ్డు’ (Nallajerla Road). అసలు ఈ రోడ్డు కథ ఏంటి ? సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1965 నాటి కాలంలో సాగే ఈ కథ అడవి మార్గం నేపథ్యంగా సాగుతుంది. రామం, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ప్రయాణం మధ్యలో చంద్రం అనే వ్యక్తిని విషపూరితమైన పాము కాటేస్తుంది. పాము కాటు పడినప్పుడు సమయం చాలా కీలకం. వెంటనే సరైన చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న వారికి ఒక స్థానిక వైద్యుడు సాయం చేస్తాడు. అతని ప్రయత్నంతో చంద్రం ప్రాణాలు నిలుస్తాయి.

Advertisement

సాధారణంగా మన ప్రాణాలను కాపాడిన వ్యక్తి పట్ల మనకు కృతజ్ఞత కలగాలి. అతను ఎక్కడ ఉన్నా, అతనికి అవసరం వచ్చినప్పుడు సాయం చేయాలని అనిపించాలి. కానీ ఈ కథలో పరిస్థితి మరోలా మారుతుంది. చంద్రాన్ని కాపాడిన కొద్దిసేపటికే ఆ వైద్యుడిపై కొందరు దారుణంగా దాడి చేస్తారు. వైద్యుడి కూతురు సురీడు తన తండ్రిని రక్షించమని వేడుకుంటుంది. కానీ భయంతో రామం, అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ నిర్ణయం అప్పటికప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకున్న అనుభూతిని కలిగించినా, తరువాత మొదలవుతుంది అసలు కథ.

కాలం గడిచిన తర్వాత రామం కుమారుడు తన తండ్రిని హంతకుడిగా ఎందుకు భావిస్తాడు ? ఆ రోజు అడవిలో జరిగిన సంఘటన అతని జీవితాన్ని ఎలా వెంటాడుతుంది ? సాయం చేయకుండా వెళ్లిపోవడం కూడా ఒకరిని నేరుగా చంపినంత బాధ్యతను కలిగిస్తుందా ? తనకు సాయం చేసిన వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని చూసిన రామం, అతని స్నేహితులు ఎందుకు సాయం చేయలేదు ? అన్నదే సినిమా కథ.

తెలుగులో ఉందా ?

Advertisement

‘నల్లజర్ల రోడ్డు’ తెలుగు చిత్రం. ఈటీవీ విన్ (ETV Win)లో 2026 అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి వచ్చింది. సుమారు 44 నిమిషాల నిడివి ఉన్న ఈ తక్కువ నిడివిలో ఆలోచింపజేసే కథలు ఇష్టపడే వారికి మంచి ఆప్షన్. రాజీవ్ కనకాల (Rajeev Kanakala), వజ్జా వెంకట గిరిధర్, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన కథ ఆధారంగా రూపొందించారు.

Read Also: కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

Tags

Related News

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×