E-Paper
Advertisement

ఏసీ ఆన్ చేశాక ఈ రెండు మార్పులు చేసుకుంటే.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది!

ఏసీ ఆన్ చేశాక ఈ రెండు మార్పులు చేసుకుంటే.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది!
Advertisement

Reduce AC Electricity Bill: ఎండలు ముదిరిపోతున్న ఈ రోజుల్లో ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా గడపటం కష్టంగా మారింది. అయితే ఏసీ ఆన్ చేసినప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల గది త్వరగా చల్లబడకపోగా.. కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రతి రోజూ రెండు అలవాట్లను మార్చుకుంటే ఏసీ పనితీరును పెంచడమే కాకుండా.. కరెంట్ బిల్లును కూడా భారీగా తగ్గించుకోవచ్చు. అదెలాగో చూసేద్దాం రండి..

కర్టెన్లదే కీలక పాత్ర:

కిటికీ అద్దాల గుండా వచ్చే ఎండ గదిలోని ప్రతి వస్తువును వేడెక్కిస్తుంది. దీనివల్ల ఏసీ రూమ్ టెంపరేచర్‌ను తగ్గించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే కిటికీలకు కాస్త మందపాటి లేదా బ్లాకౌట్ కర్టెన్లు వేస్తే.. అవి బయట నుంచి వచ్చే ఎండను, వేడిని అడ్డుకుంటాయి. ఫలితంగా గదిలోకి వేడి తక్కువగా చేరి, ఏసీ చాలా వేగంగా రూమ్‌ను కూల్ చేస్తుంది.

ఒక చిన్న ఉదాహరణ:

Advertisement

మధ్యాహ్నం వేళ ఎండ నేరుగా పడే ఒక గదిలో కర్టెన్లు లేకపోతే.. ఎండ వల్ల గోడలు, మంచం, ఫ్లోర్ అన్నీ వేడెక్కుతాయి. ఆ సమయంలో ఏసీని 24 డిగ్రీలపై ఉంచినా.. లోపలి వేడి వల్ల ఏసీ కంప్రెషర్ పదే పదే ఆన్ అవుతూనే ఉంటుంది. అదే కర్టెన్లు వేసి ఉంచితే.. వేడి లోపలికి రాకుండా ఆగిపోతుంది. దీనివల్ల ఏసీ తక్కువ టైమ్‌లోనే గదిని చల్లబరుస్తుంది.

Also Read: చిన్నగా, స్టైలిష్‌గా, అంతకు మించి హాట్‌గా.. వచ్చే వారమే Oura Ring 5 గ్రాండ్ ఎంట్రీ?!

తలుపులు వేయడం ముఖ్యం:

Advertisement

ఏసీలు ఒక నిర్దిష్టమైన గది పరిమాణాన్ని బట్టి కూలింగ్ ఇస్తాయి. మనం ఏసీ ఆన్ చేసి తలుపు తెరిచి ఉంచితే.. పక్క రూమ్‌లలోని వేడి గాలి లోపలికి వస్తుంది. ఇక్కడి చల్లటి గాలి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఏసీపై భారం పడి, గది ఉష్ణోగ్రత తగ్గడం లేదని కంప్రెషర్ ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి.. తలుపులు పూర్తిగా క్లోజ్ చేయడం వలన చల్లదనం గదిలోనే ఉంటుంది. దీంతో ఏసీ మీద అధిక భారం పడదు.

కంప్రెషర్ ఆగితేనే బిల్లు తగ్గుతుంది:

కరెంట్ బిల్లు ఎక్కువగా రావడానికి ఏసీ కంప్రెషర్ నిరంతరాయంగా నడవటమే ప్రధాన కారణం. కంప్రెషర్ ఎంత తక్కువ సమయం రన్ అయితే, అంతగా కరెంట్ ఆదా అవుతుంది. తలుపులు మూసి ఉంచడం, కర్టెన్లు వేయడం అనే ఈ రెండు చిన్న పనులు గదిలోకి వేడి రాకుండా చూస్తాయి. దీనివల్ల కంప్రెషర్‌కు ఎక్కువ విశ్రాంతి దొరికి, కరెంటు బిల్లు భారం కూడా తగ్గుతుంది.

Also Read: ACల కంటే పవర్‌ఫుల్ గ్యాడ్జెటా? కరెంట్ ఆదా చేస్తూ ప్రకృతిని కాపాడే ఈ Heat Pumps కథేంటి?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×