E-Paper
Advertisement

చిన్నగా, స్టైలిష్‌గా, అంతకు మించి హాట్‌గా.. వచ్చే వారమే Oura Ring 5 గ్రాండ్ ఎంట్రీ?!

చిన్నగా, స్టైలిష్‌గా, అంతకు మించి హాట్‌గా.. వచ్చే వారమే Oura Ring 5 గ్రాండ్ ఎంట్రీ?!
Advertisement

Oura Ring 5: స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్లో ఓరా రింగ్స్‌కు మంచి క్రేజ్ ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన Oura Ring 4 యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి తదుపరి వెర్షన్‌గా Oura Ring 5ను తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు లీకయ్యాయి. అవేంటో ఓసారి చూసేద్దామా..

వచ్చే వారమే లాంచ్?

రెడ్డిట్‌లో లీకైన ఒక అంతర్గత పత్రం ప్రకారం.. Oura Ring 5 మే 28నే మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అదే రోజు నుంచి ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. పాత కస్టమర్లకు ముందే ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారని, జూన్ 4 నుంచి ఈ సరికొత్త రింగ్ డెలివరీలు షురూ అవుతాయని తెలుస్తోంది.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 20 రోజుల బ్యాటరీ.. Realme Watch S5 మార్కెట్‌లోకి వచ్చేసింది.. ధర ఎంతంటే?

చిన్నగా.. మరింత కంఫర్ట్‌గా:

Oura Ring 4తో పోలిస్తే.. కొత్తగా రాబోతున్న Oura Ring 5 పరిమాణంలో చిన్నగా, వేలికి పెట్టుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఇది మునుపటి కంటే స్లిమ్‌గా, కర్వ్‌డ్ డిజైన్‌తో రానుంది. అంతేకాకుండా.. ఈ రింగ్‌ను నాలుగు సార్లు ఫుల్ ఛార్జ్ చేయగల ఒక పోర్టబుల్ ఛార్జింగ్ కేస్‌ను కూడా కంపెనీ అందించబోతున్నట్లు సమాచారం.

ఆకట్టుకునే రంగులు:

Advertisement

ఇక Oura Ring 5 కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. పాత రోజ్ గోల్డ్ వేరియంట్ స్థానంలో సరికొత్త డీప్ రోజ్ షేడ్‌ను పరిచయం చేయనున్నట్లు టాక్. దీంతో పాటు మ్యాట్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ రంగుల్లో కూడా ఇది లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, Oura Ring 4లో ఉన్న హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లనే ఇందులోనూ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న Oura Ring 4 ధర సుమారు రూ.28,900గా ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. కొత్తగా రాబోయే Oura Ring 5 ధర కూడా దాదాపు ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: తిరుగులేని ఫీచర్లతో iQOO Pad 6 Pro లాంచ్.. ల్యాప్‌టాప్‌కు పోటీగా 16GB RAM, భారీ స్క్రీన్!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×