Jailer 2 : జైలర్ ..కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ డౌన్ ఫాలో లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెల్సిందే. రజనీకాంత్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
క్యామియో పాత్ర కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్
తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌కు సంబంధించి కోలీవుడ్ నుంచి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ క్యామియో పాత్ర కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ కొల్లాబరేషన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
also read :‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా ఎండ్ కార్డ్.. చిరంజీవి ఎంట్రీతో సీన్ రివర్స్!
కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం, నెల్సన్ దిలీప్‌కుమార్ డిజైన్ చేసిన ఈ స్పెషల్ రోల్ కోసం మొదట బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారట. అయితే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘కింగ్’ షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ క్రేజీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
షారుఖ్ నో చెప్పడంతో మేకర్స్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని అప్రోచ్ అయారని, ‘వార్ 2’ సినిమాతో ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా క్రేజ్ సంపాదించుకున్న హృతిక్ రోషన్ ఈ రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారని ఇన్ సైడ్ టాక్.
మొదటి భాగం లాగే సాలిడ్ క్యాస్టింగ్
ఫస్ట్ పార్ట్ లో ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ చూపించిన మాస్ అవతార్, దానికి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు అదే కథను మరింత ఇంటెన్సివ్‌గా కొనసాగిస్తూ ‘జైలర్ 2’ స్క్రిప్ట్‌ను నెల్సన్ సిద్ధం చేశారట. ఈ సీక్వెల్‌లో కూడా మొదటి భాగం లాగే సాలిడ్ క్యాస్టింగ్ కనిపించబోతున్నట్లు సమాచారం.
also read :రామ్-అనిల్ రావిపూడి కాంబో.. క్రేజీ ప్రాజెక్టా? లేక డిజాస్టర్ ఫార్ములానా?
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తి, టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్, వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య, మలయాళ నటుడు సూరజ్ వెంజారమూడు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా, ‘జైలర్’ పార్ట్ 1లో తమ చిన్నపాటి క్యామియోలతో థియేటర్లను షేక్ చేసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ సీక్వెల్ లో మరింత కీలకంగా మారనున్నట్లు తెలుస్తుంది.
2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘జైలర్ 2’ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు స్పీడప్ చేశాడట నెల్సన్.ఒకవైపు ‘జైలర్ 2’తో బిజీగా ఉన్న రజినీ దీని తర్వాత కమల్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌పై తెరకెక్కనున్న ‘తలైవర్ 173’లో కూడా నటించనున్న సంగతి తెల్సిందే.
also read :జోయా అఖ్తర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు మాయం, కోట్లలో నష్టం!
ఈ ప్రాజెక్ట్‌కు మొదట సుందర్ సి, ఆ తర్వాత సిబి చక్రవర్తి పేర్లు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తున్నాయి.
రికార్డులు క్రియేట్ చేయడం పక్కా
వీటన్నింటికీ మించి రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా చర్చల దశలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్ తో వైరల్ అవుతున్న ఈ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడని టాక్ .
ఏదేమైనా రజనీకాంత్ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ ఎంట్రీ గనుక ఖరారైతే, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా.