E-Paper
Advertisement

రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు పెరగకూడదా? రిమోట్‌లో ఈ ‘సీక్రెట్’ బటన్ నొక్కండి చాలు !

రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు పెరగకూడదా? రిమోట్‌లో ఈ ‘సీక్రెట్’ బటన్ నొక్కండి చాలు !
Advertisement

AC Sleep Mode: ఎండలు మండిపోతున్నాయి. రాత్రిపూట ఏసీ లేనిదే నిద్ర పట్టడం లేదు. ఏసీ ఎక్కువగా వాడటం వల్ల నెల తిరిగేసరికి వచ్చే కరెంట్ బిల్లును చూస్తే.. సామాన్యుడి గుండె గుభేలుమంటోంది. రాత్రంతా ఏసీ వాడటం వల్ల వేలల్లో బిల్లు వస్తుందని భయపడుతున్నారా? అయితే మీ ఏసీ రిమోట్ లోనే ఒక అద్భుతమైన ఫీచర్ దాగి ఉంది. అదే ‘స్లీప్ మోడ్’. ఈ చిన్న బటన్ మీ నిద్రను మెరుగుపరచడమే కాకుండా, కరెంట్ ఖర్చును కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అసలు ఈ బటన్ ఎలా పనిచేస్తుంది ? దీని వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీ కరెంట్ బిల్లును తగ్గించే ‘స్లీప్ మోడ్’ మ్యాజిక్!

చాలా మంది తమ ఏసీ రిమోట్‌లో కేవలం ‘ఆన్/ఆఫ్’,’టెంపరేచర్’ బటన్లను మాత్రమే వాడుతుంటారు. కానీ.. రిమోట్ పై ఉండే ‘చంద్రుడి’ ఆకారం లేదా ‘Sleep’ అని రాసి ఉన్న బటన్ వెనక పెద్ద రహస్యమే ఉంది. ఇది కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు. మీ జేబును కాపాడే ఒక స్మార్ట్ టూల్.

Advertisement

అసలు స్లీప్ మోడ్ అంటే ఏంటి?
మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. రాత్రి 10 గంటలకు ఉన్నంత వేడి, తెల్లవారుజామున 3 గంటలకు ఉండదు. పడుకునే ముందు ఏసీని సాధారణ కూల్ మోడ్ లో ఉంచితే.. అది రాత్రంతా ఒకే ఉష్ణోగ్రతను (ఉదాహరణకు 22 డిగ్రీలు) మెయింటైన్ చేస్తుంది. దీని వల్ల తెల్లవారుజామున చలి ఎక్కువగా అనిపించి.. మనం దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడే ‘స్లీప్ మోడ్’ పని మొదలవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

Advertisement

మీరు ఏసీని 24°C వద్ద సెట్ చేసి ‘స్లీప్ మోడ్’ ఆన్ చేస్తే.. మొదటి ఒక గంట తర్వాత.. ఏసీ ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా 1 డిగ్రీ పెంచి 25°C చేస్తుంది. రెండవ గంట తర్వాత.. మరో డిగ్రీ పెంచి 26°C కి చేరుస్తుంది. ఇలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏసీ కంప్రెసర్ పదే పదే ఆన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కంప్రెసర్ స్టేబుల్ గా ఉండటం వల్ల కరెంట్ ఆదా అవుతుంది.

స్లీప్ మోడ్ వల్ల కలిగే లాభాలు:
కరెంట్ బిల్లు తగ్గింపు: ఏసీలో కంప్రెసర్ ఎంత తక్కువగా నడిస్తే.. అంత తక్కువ కరెంట్ ఖర్చవుతుంది. సాధారణ మోడ్‌తో పోలిస్తే.. స్లీప్ మోడ్ ద్వారా దాదాపు 20% నుంచి 30% వరకు బిల్లు తగ్గే అవకాశం ఉంది.

మంచి నిద్ర: తెల్లవారుజామున రూం మరీ చల్లగా అయిపోకుండా.. శరీరానికి హాయిగా ఉండే ఉష్ణోగ్రతను ఇది అందిస్తుంది. దీని వల్ల మధ్యలో నిద్ర మెలకువ వచ్చే సమస్య ఉండదు.

ఏసీ జీవితకాలం పెరుగుతుంది: కంప్రెసర్ పై ఒత్తిడి తగ్గడం వల్ల ఏసీ త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

ఆరోగ్యకరం: విపరీతమైన చలి వల్ల వచ్చే జలుబు, కీళ్ల నొప్పుల వంటి సమస్యలను ఇది నివారిస్తుంది.

Also Read: సమ్మర్‌లో ఏసీ వాడుతున్నారా ? ఇవి తెలుసుకోకపోతే ప్రమాదమే..

స్లీప్ మోడ్‌ను ఎలా ఆక్టివేట్ చేయాలి?

1. మీ ఏసీని ఆన్ చేసి మీకు నచ్చిన టెంపరేచర్ (ఉదాహరణకు 24 డిగ్రీలు) సెట్ చేయండి.

2. రిమోట్‌లో ఉన్న ‘Sleep’ బటన్ ప్రెస్ చేయండి. కొన్ని రిమోట్లలో చంద్రవంక గుర్తు ఉంటుంది.

3. డిస్ప్లేపై స్లీప్ మోడ్ ఐకాన్ కనిపిస్తే.. మీ ఏసీ స్మార్ట్ గా పనిచేయడం మొదలుపెట్టినట్లే.

కూల్ మోడ్ Vs స్లీప్ మోడ్: ఏది బెస్ట్?
మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకున్నప్పుడు ‘కూల్ మోడ్’ వాడాలి. కానీ గది చల్లబడ్డాక.. నిద్రపోయే సమయంలో ‘స్లీప్ మోడ్’ వాడటం వల్ల కరెంట్ ఆదా చేయవచ్చు.

పెరుగుతున్న కరెంట్ ఖర్చుల నేపథ్యంలో, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లను వాడటం వల్ల మన ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ వేసవిలో తెలివిగా ఏసీని వాడండి. ఆరోగ్యంతో పాటు డబ్బును కూడా కాపాడుకోండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×