E-Paper
Advertisement

Dishwasher Uninstall: డిష్ వాషర్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలా? ఈ స్టెప్స్ పాటిస్తే సరి.. ఈజీగా పని అయిపోద్ది!

Dishwasher Uninstall: డిష్ వాషర్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలా? ఈ స్టెప్స్ పాటిస్తే సరి.. ఈజీగా పని అయిపోద్ది!
Advertisement

Dishwasher Uninstall: ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో డిష్ వాషర్లు దర్శనమిస్తున్నాయి. అంట్లను తోమేందుకు పరిశుభ్రంగా ఉంచేందుకు వీటిని వినియోగిస్తున్నారు. అయితే డిష్ వాషర్ ను ఒకచోట ఫిక్స్ చేశాక మరో చోటికి తరలించడం చాలా కష్టమని అందరూ చెబుతుంటారు. ఇందుకోసం అనుభవమున్న టెక్నిషియన్లపై ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొంటూ ఉంటారు. అయితే 6 సింపుల్ స్టెప్స్ పాటించడం ద్వారా మీరే స్వయంగా డిష్ వాషర్ ను అన్ ఇన్ స్టాల్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. పవర్, వాటర్ సప్లై నిలిపివేత

డిష్ వాషర్ ను అన్ ఇన్ స్టాల్ చేసే క్రమంలో ముందుగా దాని పవర్ సప్లే ప్లగ్ తీసేయండి. ఒకవేళ అది నేరుగా ఎలక్ట్రికల్ బోర్డుకి వైరింగ్ చేసి ఉంటే మెయిన్ స్విచ్ బోర్డు (Circuit Breaker) దగ్గర డిష్‌వాషర్ కి వెళ్లే పవర్‌ను ఆఫ్ చేయండి. తర్వాత సింక్ కింద ఉండే వాటర్ సప్లై వాల్వ్‌ను తిప్పి నీరు రాకుండా జాగ్రత్త పడండి.

2. వాటర్ సప్లై పైప్ ను తొలగించడం

Advertisement

రెండు స్టెప్ లో భాగంగా.. డిష్‌వాషర్‌కు నీటిని అందించే పైపును తొలగించాలి. సింక్ కింద ఉన్న వాటర్ వాల్వ్ నుండి పైపును ‘రెంచ్’ (Wrench) సాయంతో నెమ్మదిగా విప్పండి. తర్వాత పైపులో మిగిలి ఉన్న కొద్దిపాటి నీరు కింద పడకుండా ఒక చిన్న గిన్నె లేదా టవల్‌ను సిద్ధంగా ఉంచుకోండి.

3. డ్రెయిన్ పైపు తీసేయండి

మూడో స్టెప్ లో.. డిష్ వాషర్ నుంచి నీరు బయటకు వెళ్లే పైపును (Drain Hose) తొలగించాలి. ఇది సాధారణంగా సింక్ డ్రెయిన్‌కు లేదా గార్బేజ్ డిస్పోజల్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. స్క్రూడ్రైవర్ లేదా ప్లయర్ సాయంతో క్లాంప్‌ను లూజ్ చేసి ఆ పైపును విడదీయండి.

4. మౌంటింగ్ బ్రాకెట్స్

Advertisement

డిష్‌వాషర్ అటు ఇటు కదలకుండా.. పైన ఉన్న కౌంటర్ టాప్‌కు లేదా పక్కన ఉన్న క్యాబినెట్‌కు స్క్రూలతో బిగించి ఉంచుతారు. ఈ నేపథ్యంలో డిష్‌వాషర్ తలుపు తెరిచి.. పైన లేదా పక్కల ఉన్న ‘మౌంటింగ్ బ్రాకెట్స్’ స్క్రూలను తొలగించండి. ఇప్పుడు డిష్‌వాషర్ ఈజీగా కదపడానికి వీలు అవుతుంది.

5. డిష్‌వాషర్ ఎత్తును తగ్గించండి

డిష్‌వాషర్ కింద ఉండే లెగ్స్ (కాళ్లు) నేలకు గట్టిగా నొక్కి పెట్టి ఉంటాయి. కాబట్టి డిష్‌వాషర్ కింద ఉన్న ప్యానెల్‌ను తొలగించి.. అక్కడ ఉన్న లెగ్స్‌ స్క్రూను లూజ్ చేయడం ద్వారా వాటి ఎత్తును తగ్గించండి. దీనివల్ల డిష్‌వాషర్ సులభంగా బయటకు వచ్చేస్తుంది.

Also Read: Recharge Plans: మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్.. 28 రోజులే ఎందుకు? దీని వెనకున్న వ్యూహం ఏంటి?

6. డిష్‌వాషర్‌ బయటకు లాగండి

పైన సూచించిన 5 పనులు పూర్తిచేసిన తర్వాత చివరి స్టెప్ లో భాగంగా డిష్‌వాషర్‌ను నెమ్మదిగా బయటకు లాగండి. లాగేటప్పుడు వాటర్ పైపులు లేదా ఎలక్ట్రికల్ వైర్లు ఎక్కడైనా తగులుకుంటున్నాయేమో చెక్ చేసుకుంటూ ఉండండి. నేల పాడవకుండా ఉండటానికి డిష్‌వాషర్ కింద పాత క్లాత్ వేయడం మంచిది. ఇలా సింపుల్ పద్దతుల్లో మీరు డిష్ వాషర్ ను అన్ ఇన్ స్టాల్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీకు వైరింగ్ లేదా ప్లంబింగ్ పనుల మీద అస్సలు అవగాహన లేకపోతే నిపుణులైన టెక్నీషియన్‌ను పిలవడం చాలా ఉత్తమం.

Also Read: Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×