E-Paper
Advertisement

Amaravati News: ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు.. ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ రెడీ, ఇదిగో ఉద్యోగాల జాబితా

Amaravati News: ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు.. ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ రెడీ, ఇదిగో ఉద్యోగాల జాబితా
Advertisement

Amaravati News: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌ విడుదలకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలండర్ విడుదల చేసేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయ్యింది. ఏకంగా 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ వార్త తెలియగానే నిరుద్యోగుల్లో సందడి నెలకొంది.

ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు

Advertisement

ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ గురించి క్లారిటీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని శాసనమండలి వేదికగా ఆయన ప్రకటన చేశారు. అన్నట్లుగానే తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈసారి 10 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక‌శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈసారి జాబ్ క్యాలెండర్‌లో డీఎస్సీ- DSC పోస్టులను చేర్చనుంది. ఈ విషయాన్ని సదరు మంత్రి ఇప్పటికే స్పష్టంచేశారు. వివిధ శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాళ్లను మూడేళ్లలో భర్తీ చేయనుంది. మొత్తం 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. అందులో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ స్థాయి ఉద్యోగాలు ఉండనున్నాయి.

Advertisement

ఉగాదికి జాబ్ క్యాలెండర్‌.. ఇదిగో ఉద్యోగాల జాబితా

ప్రతిపాదిత పోస్టులు ఈ విధంగా ఉన్నాయి.
పాఠశాల విద్య – ఇంటర్ స్థాయిలో దాదాపు 3,000 ఉద్యోగాలు
యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు –1,500
ఎస్ఐ -కానిస్టేబుళ్లు ఉద్యోగాలు మరో 3,000
ఏఈ పోస్టులు ఉద్యోగాలు 500
సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు ఉద్యోగాలు 200
అటవీశాఖలో 100 ఉద్యోగాలు
స్టాటిస్టిక్స్ అధికారులు ఉద్యోగాలు 200
ఇక గ్రూప్-1, గ్రూప్-2లకు సంబంధించిన ఉద్యోగాలు 600

ALSO READ: గిరిజన పల్లెల్లో జనసేనాని.. చిన్నారులతో పవన్ ముచ్చట్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

జాబ్ క్యాలెండర్‌ ముందుగా విడుదల చేయడం వల్ల నిరుద్యోగులు ప్రిపరేషన్ మంచి సమయం లభించనుంది. ఈ విధంగా చేయడం వల్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తోంది. కోర్టు కేసులు లేకుండా నియామకాలు పూర్తి చేయవచ్చని ఆలోచన చేసింది ప్రభుత్వం. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించింది. కొన్ని ఉద్యోగాలకు మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని అధికారుల మాట.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×