E-Paper
Advertisement

టోవినో థామస్ ‘రక్షకుడా’ లేక ‘రొటీన్’ డ్రామాకు నాయకుడా?.. ‘పల్లిచట్టంబి’ రివ్యూ..

టోవినో థామస్ ‘రక్షకుడా’ లేక ‘రొటీన్’ డ్రామాకు నాయకుడా?.. ‘పల్లిచట్టంబి’ రివ్యూ..
Advertisement

Pallichattambi Review: ‘జనగణమన’ లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా వస్తున్న సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కేరళ రాజకీయ చరిత్రలోని ‘విమోచన సమరం’ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాపై మన ‘గ్యాంగ్’ మస్తు ఆశలు పెట్టుకుంది. మరి ఈ పల్లిచట్టంబి బాక్సాఫీస్ వద్ద గిన్నెలు పగలగొట్టాడా? లేక పాత చింతకాయ పచ్చడిలా మిగిలిపోయాడా? రివ్యూలో చూద్దాం!

కథ

కథ 1958 కాలం నాటి కేరళలోని ‘కాణియార్’ అనే గ్రామంలో సాగుతుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. ఈ ప్రభావాన్ని అడ్డుకోవడానికి, తమ పట్టు నిలుపుకోవడానికి చర్చి కమిటీ ఒక ‘రక్షకుడిని’ రంగంలోకి దించాలని నిర్ణయిస్తుంది. అలా ఆ ఊరికి వచ్చిన ‘పల్లిచట్టంబి’ జీవితం ఏమైంది? ఆ రాజకీయ పోరాటంలో అతని పాత్ర ఏంటి? అనేదే ఈ సినిమా కథ. పాయింట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నా, వెండితెరపై ప్రెజెంటేషన్ మాత్రం గందరగోళంగా ఉంది.

నటీనటులు

Advertisement

టోవినో థామస్: తన పాత్ర కోసం బాడీని మస్తుగా బిల్డ్ చేశాడు. మాస్ సీన్లలో గర్జించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ, ఫస్టాఫ్‌లో ఆయన చేసిన కామెడీ మాత్రం అస్సలు పండలేదు సరికదా చిరాకు తెప్పిస్తుంది.

శత్రు (విలన్): మన తెలుగు నటుడు శత్రు మెయిన్ విలన్‌గా లుక్ పరంగా భయంకరంగా ఉన్నాడు. కానీ ఆయన పలికిన మలయాళ డైలాగులు చూస్తుంటే విలనిజం కంటే నవ్వే ఎక్కువ వస్తోంది. డబ్బింగ్ పెద్ద మైనస్.

Advertisement

కయాదు లోహార్: ఈమె పాత్రలో గ్రేస్ ఉన్నా, డబ్బింగ్ సరిగ్గా కుదరకపోవడంతో ఆ ఇంపాక్ట్ తగ్గిపోయింది.

విశ్లేషణ

సాంకేతికంగా చూస్తే జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేసింది. ముఖ్యంగా ‘కాట్టుచెంబకం’ సాంగ్ మస్తు ఊపు మీద ఉంది. అయితే, క్లైమాక్స్ ఫైట్ సీన్లలో విజువల్స్ మరీ కృత్రిమంగా (AI వాడినట్లు) కనిపిస్తున్నాయి. దర్శకుడు డిజో జోస్ తన పాత స్టైల్ భారీ డైలాగులనే నమ్ముకున్నాడు తప్ప, మేకింగ్‌లో ఎక్కడా కొత్తదనం చూపించలేదు. 1950ల నాటి వాతావరణాన్ని చూపించడంలో ఆ ‘పాత వాసనలు’ పోలేదు.

బలాలు

  • టోవినో థామస్
  • జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • పొలిటికల్ పాయింట్

బలహీనతలు

  • స్క్రీన్ ప్లే
  • పండని కామెడీ
  • విజువల్ ఎఫెక్ట్స్
  • రొటీన్ యాక్షన్ డ్రామా

చివరి ముచ్చట.. “కథలో పదును లేక, క్లైమాక్స్‌లో AI ఫైట్లతో.. టోవినో ‘పల్లిచట్టంబి’ యావరేజ్‌గా మిగిలిపోయింది.. అంచనాలను అందుకోవడం కష్టమే!”

రేటింగ్ –    2 /5

Related News

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×