E-Paper
Advertisement

ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. ఇంట్లో ఉన్న పాత గిన్నెలన్నీ ఇండక్షన్ స్టవ్‌పై వాడేసుకోచ్చు!

ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. ఇంట్లో ఉన్న పాత గిన్నెలన్నీ ఇండక్షన్ స్టవ్‌పై వాడేసుకోచ్చు!
Advertisement

Induction Stove Tips: గ్యాస్ సిలిండర్ కొరత వేధిస్తుందని ఇండక్షన్ స్టవ్ కొంటే.. ఇప్పుడు దాని మీదకు ప్రత్యేకంగా గిన్నెలు కొనాల్సి వస్తుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఒక్క ట్రిక్‌ను ఉపయోగిస్తే.. ఇంట్లో ఉన్న పాత అల్యూమినియం గిన్నెలు, రాగి పాత్రలు, మట్టి కుండలు ఇలా అన్ని పాత్రలనూ ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి వంట చేసుకోవచ్చు. ఇప్పుడా ట్రిక్ ఏంటనే కదా మీ సందేహం? దీనికోసం మీరు చేయాల్సిందల్లా మార్కెట్‌లో దొరికే కన్వర్టర్ డిస్క్ (Converter Disk) అనే ఒక చిన్న ప్లేట్ కొనుక్కోవడమే. ఇది మీ పాత గిన్నెలకు, స్టవ్‌కు మధ్య వారధిలా చేస్తుందన్నమాట.

ఇదో చిన్న మ్యాజిక్ ప్లేట్:

ఈ కన్వర్టర్ డిస్ స్టీల్ ప్లేట్ మాదిరి ఉంటుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి, దాని పైన మీరు ఏ గిన్నె పెట్టినా వంట అయిపోతుంది. అది మట్టి కుండ అయినా, పింగాణీ పాత్ర అయినా, చివరకు మీ పాత రాగి గిన్నె అయినా సరే. ఈ డిస్క్ స్టవ్ నుండి వేడిని తీసుకుని పైన ఉన్న పాత్రకు ఇస్తుంది. దీంతో ఇండక్షన్ కోసం ప్రత్యేకంగా కొత్త గిన్నెలు కొనాల్సిన అవసరం ఉండదు. ఇడ్లీల దగ్గర నుండి రోటీల వరకు ఏదైనా సరే.. పాత పద్ధతిలోనే దీనిపై వండేసుకోవచ్చు.

Advertisement

Also Read: వావ్, ఏముందీ సోలార్ ఫ్యాన్ హ్యాట్.. ఎండలో తిరిగే వారికి ఏసీ కూలింగ్, ధర కూడా తక్కువే!

పుల్కాలు పొంగడం లేదా?

ఇండక్షన్ మీద పుల్కాలు పొంగుతాయా? మంట లేకపోతే ఎలా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. దానికి కూడా ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఒక చిన్న గ్రిల్ నెట్ స్టవ్ మీద పెట్టి, దానిపై పుల్కాలు వేస్తే భలేగా పొంగుతాయి. కూరగాయలు లేదా చికెన్ కాల్చాలన్నా ఇలాంటి ప్లేట్స్ వాడితే గ్యాస్ స్టవ్ మీద వచ్చినట్టే రుచి వస్తుంది. అయితే ఇక్కడ చిన్న జాగ్రత్త పాటించాలి.. పాలు కాచేటప్పుడు మాత్రం పొంగకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ ప్లేట్ వేడికి పాలు పొంగి కింద పడే ఛాన్స్ ఉంటుంది.

స్టవ్ ఎక్కువ కాలం మన్నాలంటే?

Advertisement

⇒ మనం ఎంత బాగా వంట చేస్తున్నామన్న దానికంటే.. స్టవ్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామన్నది ముఖ్యం.

⇒ వంట పూర్తయ్యాక స్టవ్ చల్లారిన వెంటనే తుడిచేయండి. లేదంటే జిడ్డు పేరుకుపోతే తర్వాత వదిలించడం కష్టం అవుతుంది.

⇒ మీరు వాడే గిన్నె అడుగు భాగం ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోండి. గుండ్రంగా ఉన్నవి వేడిని సరిగ్గా గ్రహించవు.

⇒ వంట అయిపోయి స్విచ్ ఆఫ్ చేసినా ఆ సర్కిల్ భాగం కాసేపు సెగ వస్తూనే ఉంటుంది. అందుకే వంట కాగానే గిన్నెను పక్కకు దించాలి.

Also Read: ఎండలు ముదిరినా, కరెంట్ పోయినా ఏం పర్లేదు.. ఈ సోలార్ ఫ్యాన్ ఉంటే రోజంతా చల్లని గాలే!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×