PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ అభిమానులు లేకుండానే నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ పాకిస్తాన్ సూపర్ టోర్నమెంట్ కు వర్షం గండంగా మారింది. లాహూర్ లోని గడాఫీ స్టేడియంలో ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది. వర్షం ప్రారంభం కాకముందు పిచ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్ మైన్లు. ఈ క్రమంలో ఈదురు గాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో కవర్లు కప్పుతోన్న గ్రౌండ్ మైన్లు గాల్లో ఎగిరిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీన ప్రారంభం కాగా, ఇప్పటికే ఆరు మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వివాదం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో చోటు చేసుకుంటూనే ఉంది. మ్యాచ్ జరిగితే, కచ్చితంగా వివాదం జరగాల్సిందే అన్నట్లుగా టోర్నమెంట్ కొనసాగుతోంది. అయితే ఇవాళ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మీ జట్ల ( Islamabad United vs Peshawar Zalmi ) మధ్య ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. లాహూర్ లోని గడాఫీ ( Gaddafi Stadium, Lahore) వేదికగా ఈ మ్యాచ్ జరగాలి. అయితే టాస్ వేయకముందే ఈదురు గాలులు ( The Wind in Lahore ) మొదలయ్యాయి.
వర్షం వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో వెంటనే గడాఫీ స్టేడియానికి సంబంధించిన గ్రౌండ్ మెన్స్ ( Ground Mens ) అలర్టయ్యారు. కవర్లతో స్టేడియం పిచ్ పూర్తిగా కప్పేశారు. ఈ క్రమంలో ఈదురు గాలులు ఎక్కువయ్యాయి. అయితే కవర్లు పట్టుకున్న గ్రౌండ్ మెన్స్ ఈ గాలుల దెబ్బకు ఎగిరిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను తుఫాన్ అతలాకుతలం చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈ దెబ్బకు గ్రౌండ్ మెన్లు కూడా కకావికలం కావాల్సి వచ్చిందని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది. మొదటి రోజున హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుకు సంబంధించిన జెర్సీలు వివాదంగా మారగా.. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా తమ రూమ్ లోకి కొంతమందిని రహస్యంగా తీసుకువచ్చారని ఆరోపణలు వచ్చాయి. లేటెస్ట్ గా బాల్ టాంపరింగ్ కూడా వివాదంగా మారింది. అటు మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి పోస్టు పెట్టినందుకుగాను నసీమ్ షాకు భారీ ఫైన్ పడింది.
The Wind in Lahore 😲 #PSL pic.twitter.com/dfURDtuJhq
— Nibraz Ramzan (@nibraz88cricket) March 31, 2026