E-Paper
Advertisement

వావ్, ఏముందీ సోలార్ ఫ్యాన్ హ్యాట్.. ఎండలో తిరిగే వారికి ఏసీ కూలింగ్, ధర కూడా తక్కువే!

వావ్, ఏముందీ సోలార్ ఫ్యాన్ హ్యాట్.. ఎండలో తిరిగే వారికి ఏసీ కూలింగ్, ధర కూడా తక్కువే!
Advertisement

Solar Fan Sun Hat: తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వేసవి ముందస్తుగానే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రోజురోజుకీ రికార్డు స్థాయికి చేరుతుండటంతో.. జనం బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగినప్పుడు ఆ వేడికి మాడిపోతున్నారు. అటు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఇటు వీధుల్లో తిరిగే మార్కెటింగ్ వ్యక్తులే కాక, పల్లెల్లో పొలం పనుల కోసం ఎండను సైతం లెక్కచేయక వెళ్లే అన్నదాతలకు ఈ ఎండలు నరకం చూపిస్తున్నాయి.

అయితే, ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఈ తిప్పలు తప్పించే ఒక అద్భుతమైన గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘సోలార్ ఫ్యాన్ సన్ హ్యాట్’. చూడ్డానికి ఎంతో స్టైలిష్‌గా ఉండే ఈ టోపీ.. ఎండ తగలకుండా చూడటమే కాకుండా ముఖంపై చల్లటి గాలిని కూడా వీస్తుంది. ఈ గ్యాడ్జెట్ వివరాలు మీ కోసం..

ఏమిటీ సోలార్ ఫ్యాన్ టోపీ?

Advertisement

సాధారణంగా మనం వాడే వెడల్పాటి టోపీలకు పైన చిన్న చిన్న సోలార్ ప్యానెల్స్ అమర్చి ఉంటాయి. వీటి ద్వారా వచ్చే విద్యుత్తుతో టోపీ లోపల అమర్చిన చిన్న ఫ్యాన్లు తిరుగుతాయి. దీంతో మనం ఎండలోకి వెళ్లగానే సూర్యరశ్మిని గ్రహించి ఈ ఫ్యాన్లు ఆటోమేటిక్‌గా తిరగడం మొదలుపెడతాయి. బ్యాటరీ అయిపోతుందన్న భయం లేకుండా, ఎండ ఎంత ఎక్కువగా ఉంటే ఫ్యాన్ అంత వేగంగా తిరుగుతూ మీకు చల్లదనాన్ని ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన మోడల్స్‌లో రెండు ఫ్యాన్లు ఉన్నాయి. వాటిని ముఖం, మెడ భాగాలకు గాలి తగిలేలా డిజైన్ చేస్తున్నారు.

Also Read: మీ ఏసీ నుంచి ఇలాంటి శబ్దం వస్తోందా? అయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్నట్టే!

ఎవరెవరికి ఉపయోగకరం?

Advertisement

ఈ టోపీ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు.. ఎండలో గంటల తరబడి పనిచేసే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. చెరువుల దగ్గర గంటల తరబడి కూర్చునే జాలర్లు, తోటల్లో పనిచేసే వారు, నిర్మాణ రంగంలో ఉండే ఇంజనీర్లు లేదా కార్మికులు దీనివల్ల ఎంతో ఉపశమనం పొందుతారు. అలాగే సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళ్లే వారికి, ట్రెకింగ్ చేసే వారికి కూడా ఇది భలేగా సెట్ అవుతుంది. ఒకవేళ ఎండ లేని సమయంలో లేదంటే మబ్బులు పట్టినప్పుడు వాడుకోవడానికి వీటిలో USB ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి.. పవర్‌ బ్యాంక్ లేదంటే మొబైల్ ఛార్జర్‌తో కూడా వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు.

ధర వివరాలివే:

ఈ టోపీని వాడటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ కిరణాల (UPF 50+) నుంచి చర్మం రక్షించబడుతుంది. దీనివల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇక ధరల విషయానికి వస్తే.. రూ.600 నుండి ప్రారంభమై, మంచి క్వాలిటీ, ఎక్కువ ఫ్యాన్లు ఉన్నవి రూ.2,500 వరకు లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇవి విరివిగా దొరుకుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని లోకల్ మార్కెట్లలో కూడా ఇప్పుడు ఇవి దర్శనం ఇస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

మీరు ఈ సోలార్ టోపీని కొనాలని అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. టోపీ బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎక్కువ సేపు పెట్టుకుంటే తల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టోపీ ఫాబ్రిక్ గాలి ఆడేలా ఉండాలి. ఫ్యాన్ల వేగాన్ని పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి బటన్స్ ఉన్న మోడల్స్ ఎంచుకోవడం మంచిది. ఈ వేసవిలో మిమ్మల్ని మీరు ఎండ నుంచి కాపాడుకోవడానికి, తక్కువ ఖర్చులో ఇదొక స్మార్ట్ ఐడియా అని చెప్పవచ్చు. దీనివల్ల చెమట పట్టకుండా ముఖం తాజాగా ఉంటుంది. పైగా చూడటానికి కూడా చాలా కూల్‌గా కనిపిస్తారు.

Also Read: వాల్‌కి స్టిక్ చేస్తే చాలు.. కిచెన్‌లో హాయిగా వంట చేసుకోవచ్చు, ఈ ‘ఏసీ ఫ్యాన్’ ధర ఎంతంటే?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తుంచుకోగలరు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×