E-Paper
Advertisement

Moto Edge 50 Pro New Color Variant: కొత్త రంగు వచ్చింది.. మోటో ఎడ్డ్ 50 ప్రో.. భారీగా ఆఫర్లు!

Moto Edge 50 Pro New Color Variant: కొత్త రంగు వచ్చింది.. మోటో ఎడ్డ్ 50 ప్రో.. భారీగా ఆఫర్లు!
Advertisement

Moto Edge 50 Pro New Color Variant: మోటరోలా ఇటీవలే భారతదేశంలో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటరోలా Edge 50 Pro 5Gని విడుదల చేసింది. అయితే కంపెనీ తాజాగా కొత్త వెనిలా క్రీమ్ కలర్ వేరియంట్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెర్ల్, బ్లాక్ బ్యూటీ కలర్స్ తర్వాత ఈ షేడ్ వస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌‌పై ఉన్న ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Moto Edge 50 Pro కొత్త వెనిలా క్రీమ్ షేడ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 68W ఛార్జర్‌తో వస్తుంది. అయితే రూ. 35,999 ధర కలిగిన 125W ఛార్జర్‌తో 12GB వేరియంట్ ఈ కొత్త కలర్‌లో అందుబాటులో లేదు. ఆఫర్ గురించి మాట్లాడితే HDFC, SBI, Axis, Kotak బ్యాంక్‌ల క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా ఫోన్ కొనుగోలు చేయడంపై కంపెనీ 2,000 రూపాయల తగ్గింపును ఇస్తోంది.

Advertisement

Moto Edge 50 Pro Specifications
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 50 Pro 144Hz రిఫ్రెష్ రేట్, 2000nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల 1.5K పోల్డ్ కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డిజైన్ గురించి మాట్లాడితే హ్యాండ్‌సెట్‌లో అల్యూమినియం ఫ్రేమ్, వేగన్ లెదర్ బ్యాక్ కొన్ని కలర్ వేరియంట్‌లలో ఉన్నాయి. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ని కలిగి ఉంది.

Advertisement

అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్ ఉంది. సెల్ఫీ కెమెరా కూడా చాలా బెటర్‌గా ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే ఫోన్‌లో 50MP OIS మెయిన్ + 13MP అల్ట్రావైడ్ + 10MP 3X టెలిఫోటో బ్యాక్ కెమెరా ఉన్నాయి. అలానే 50MP సెల్ఫీ షూటర్ ఉంది. అదనంగా ఇది IP68-రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఫోన్‌ను వాటర్‌ప్రూఫ్ చేస్తుంది.

Also Read: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. సోనీ కెమెరా, బిగ్ బ్యాటరీ తక్కువ ధరకే!

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 12GB వేరియంట్‌లో 125W వైర్డు ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది.కేవలం 18 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ కోసం ఛార్జింగ్ బూస్ట్ ఫీచర్ ఆన్ చేయడం ద్వారా 125W టర్బోపవర్ ఛార్జర్‌తో ఫెన్ కేవలం 18 నిమిషాల్లో సున్నా నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కనెక్టివిటీ కోసం, హ్యాండ్‌సెట్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB 3.1 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. డివైస్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌లు ఉన్నాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×