BigTV English

Teaser: భయపెడుతున్న టీజర్‌

Teaser: భయపెడుతున్న టీజర్‌

Bollywood Shraddha Kapoor Stree 2 Teaser Out Now: బాలీవుడ్ అందాల భామ శ్రద్ధ కపూర్, రాజ్‌కుమార్‌ రావ్, పంకజ్ త్రిపాటి మెయిన్‌ రోల్స్‌లో యాక్ట్ చేసిన మూవీ స్త్రీ 1. 2018 లో రిలీజైన ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కామెడీ హర్రర్ నేపథ్యంలో ఆడియెన్స్‌ ముందుకు వచ్చిన ఈ మూవీ ఏకంగా 180 కోట్ల వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.


ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2 రూపొందుతోంది. అమర్ కౌశిక్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మళ్ళీ శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆడియెన్స్ ఎంతో ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్న ఈ సీక్వెల్ మూవీ ఆడియెన్స్ ముందుకు ఆగస్టు 15న రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

Also Read: మాస్ హీరో ప్లేస్‌లో మాస్‌ కా దాస్


ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు అంటూ గోడలపై రాసిన రాతలతో భయపెడుతోంది ఈ టీజర్. ఇందులో శ్రద్ధాకపూర్ స్త్రీ పాత్రలో కనిపించబోతుంది. టీజర్ మధ్యలో సైలెన్స్, సడెన్‌గా కనిపించే దెయ్యం విజువల్స్ భయపెట్టేలా ఉన్నాయి. హర్రర్ జోనర్ ఇష్టపడేవారికి థియేటర్స్‌లో ఈ మూవీ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు టీజర్ చూస్తేనే క్లారిటీగా అర్థమవుతోంది. చూడాలి మరి ఏ రకంగా ఆడియెన్స్‌ని అలరించనుందో ఈ మూవీ.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×