E-Paper
Advertisement

Huawei MatePad Mini: 2.5K డిస్‌ప్లే, 6400mAh బ్యాటరీతో హువావే మేట్‌ప్యాడ్ మినీ.. ధర, పూర్తి వివరాలు ఇవే!

Huawei MatePad Mini: 2.5K డిస్‌ప్లే, 6400mAh బ్యాటరీతో హువావే మేట్‌ప్యాడ్ మినీ.. ధర, పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Huawei MatePad Mini: ప్రముఖ టెక్ సంస్థ హువావే ‘మేట్‌ప్యాడ్ మినీ’ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ముఖ్యంగా కాంపాక్ట్ డిజైన్‌ను ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ట్యాబ్.. అధునాతన హార్మొనీ OS 4.3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ప్రస్తుతం గ్రాఫైట్ బ్లాక్, స్ప్రూస్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది గ్లోబల్ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తోంది.

అద్భుతమైన డిస్‌ప్లే:

ఈ టాబ్లెట్ ప్రధాన ఆకర్షణ దీని 8.8 అంగుళాల OLED ఫుల్‌వ్యూ డిస్‌ప్లే. 2.5K రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా మెరుగైన అనుభూతిని అందిస్తుంది. 1800 నిట్స్ వరకు ఉన్న దీని గరిష్ట బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 92 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉండటంతో యూజర్లకు అంచుల్లేని అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

ఆధునిక ఫీచర్లు:

Advertisement

వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం ఈ ట్యాబ్లెట్‌లో 8GB, 12GB RAM వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్‌లోనూ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఇక క్రియేటివ్ పనుల కోసం ఇది M పెన్సిల్ ప్రో సపోర్ట్‌ను కలిగి ఉంది. దీంతో నోట్స్ రాసుకోవడం లేదా డ్రాయింగ్ వేయడం ఈజీ అవుతుంది. ఇక కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.2, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.

Also Read: కొత్త ఏసీ కొనే ప్లాన్ ఉందా? జనం ఎగబడి కొంటున్న ఈ బెస్ట్ సెల్లింగ్ ఏసీలపై ఓ లుక్కేయండి!

సెల్ఫీలకు 32MP కెమరా:

Advertisement

సాధారణంగా టాబ్లెట్లలో కెమెరాలకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ, ఈ కొత్త హువావే మినీ ట్యాబ్‌లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP వైడ్ యాంగిల్ లెన్స్‌ను అమర్చింది. ఇది 4K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయగలదు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు వైపు ఏకంగా 32MP కెమెరాను అందించడం విశేషం. ఇకపోతే ఆడియో కోసం ఇచ్చిన హిస్టెన్ 9.5 టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్పీకర్లు సినిమా చూసేటప్పుడు థియేటర్ లాంటి అనుభూతిని కలిగిస్తాయి.

ధర ఎంతంటే?

ఈ మేట్‌ప్యాడ్ మినీలో 6,400mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీని ఫుల్ చేయవచ్చు. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో దీని ఖచ్చితమైన ధర వెల్లడి కానప్పటికీ.. చైనాలో దీని ప్రారంభ ధర సుమారుగా రూ.43,000గా ఉంది. ఈ ఫీచర్లను బట్టి చూస్తుంటే ఇది నేరుగా యాపిల్ ఐప్యాడ్ మినీకి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

Also Read: ఛార్జర్ కేబుల్‌కు ఉన్న ఆ రౌండ్ పార్ట్ ఏంటో తెలుసా? 99% మందికి తెలియని అసలు సీక్రెట్ ఇదే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×