E-Paper
Advertisement

Most Selling ACs Feb 2026: కొత్త ఏసీ కొనే ప్లాన్ ఉందా? జనం ఎగబడి కొంటున్న ఈ బెస్ట్ సెల్లింగ్ ఏసీలపై ఓ లుక్కేయండి!

Most Selling ACs Feb 2026: కొత్త ఏసీ కొనే ప్లాన్ ఉందా? జనం ఎగబడి కొంటున్న ఈ బెస్ట్ సెల్లింగ్ ఏసీలపై ఓ లుక్కేయండి!
Advertisement

Most Selling ACs Feb 2026: మార్చి నెల ఇంకా మొదలవ్వనే లేదు.. అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయట అడుగుపెడితేనే ఎండలు, ఇంట్లో ఉందామంటే ఉక్కపోత.. మొత్తానికి ఈసారి వేసవి కాలం ముందే వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ గాలి అస్సలు సరిపోదు. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ అనేది విలాసంగా కాకుండా అవసరంగా మారిపోయింది.

అయితే, ఒకప్పుడు ఏసీ అంటే కేవలం గదిని చల్లబరిస్తే చాలనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా ఉండాలంటే ఇంట్లో ఇన్వర్టర్ ఏసీ ఉండాలి. సోఫాలో కూర్చుని ఫోన్‌తోనే ఆపరేట్ చేయాలంటే వై-ఫై ఫీచర్ ఉండాలి. అందుకే ఈ ఫిబ్రవరిలో జనం ఏసీల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఏ మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి? తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే ఆ టాప్-5 ఏసీలేవో ఇప్పుడు చూసేద్దాం.

Voltas 1.5 Ton 5 Star Inverter AC

Advertisement

సాధారణంగా టాటా బ్రాండ్ అంటేనే జనాల్లో గట్టి నమ్మకం ఉంటుంది. ఈ క్రమంలో టాటా వోల్టాస్ బ్రాండ్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇది చాలా త్వరగా గదిని చల్లబరచడమే కాకుండా.. మన చుట్టూ ఉన్న వేడి వాతావరణాన్ని తట్టుకుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సర్వీసింగ్ నెట్‌వర్క్ కూడా బాగుండటం దీనికి ప్లస్ పాయింట్.

LG Dual Inverter AC

ఎల్జీ ఏసీలలోని 6-ఇన్-1 కూలింగ్ మోడ్స్ వినియోగదారులకు చాలా వెసులుబాటును ఇస్తున్నాయి. గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్‌ను మార్చుకోవచ్చు. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ ఏసీని ఇష్టపడుతున్నారు.

Advertisement

Also Read: మతిపోగొట్టే డిస్కౌంట్స్.. రూ.8,990కే స్మార్ట్ టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై భారీ ధర తగ్గింపు!

Blue Star Smart AC

ప్రీమియం లుక్, క్వాలిటీ కోరుకుంటే బ్లూ స్టార్ ఏసీ కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది కొత్త మోడల్స్ చాలా ఎలాంటి సౌండ్స్ చేయకుండా చక్కగా పనిచేస్తున్నాయి. నిద్రపోతున్నప్పుడు ఏ చిన్న శబ్దం రాకుండా ఉండాలనుకునే వాళ్లు ఈ బ్లూ స్టార్ స్మార్ట్ ఏసీని ఎంపిక చేసుకోవచ్చు.

Panasonic Wi-Fi Inverter AC

స్మార్ట్ ఫోన్ ద్వారా ఏసీని కంట్రోల్ చేయాలనుకునే పానాసోనిక్ బెస్ట్ ఆప్షన్. ఆఫీసు నుండి బయలుదేరినప్పుడే ఫోన్ ద్వారా ఏసీ ఆన్ చేసుకుంటే, మీరు ఇంటికి వెళ్లేసరికి గది చల్లగా ఉంటుంది. ఈ ఏసీలో ఉన్న ‘మిరాఏ’ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

Daikin Inverter AC

డైకిన్ ఏసీలు మన్నిక, నాణ్యతకు పేరుగాంచాయి. ఈ బ్రాండ్ ఏసీలు చాలా ఏళ్ల పాటు ఎలాంటి రిపేర్లు లేకుండా పనిచేస్తాయి. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకునేవారు కళ్లు మూసుకుని డైకిన్ ఎంచుకుంటున్నారు. మొత్తానికి మీ అవసరానికి తగ్గట్టు, బడ్జెట్‌ను బట్టి పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఏది కొన్నా కూడా 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని ఎంచుకుంటే కరెంటు బిల్లు భారం తగ్గుతుంది.

Also Read: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న బెస్ట్ మొబైల్స్.. ఇందులో మీ ఫేవరెట్ ఏది?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×