E-Paper
Advertisement

అదిరిపోయే లుక్స్.. అల్టిమేట్ ఫీచర్స్.. Huawei Nova 16 Pro వచ్చేసింది.. ధర ఎంతంటే?

అదిరిపోయే లుక్స్.. అల్టిమేట్ ఫీచర్స్.. Huawei Nova 16 Pro వచ్చేసింది.. ధర ఎంతంటే?
Advertisement

Huawei Nova 16 Pro: హువావే సంస్థ చైనా మార్కెట్లోకి నోవా సిరీస్‌లో భాగంగా రెండు సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. Huawei Nova 16 Pro, Huawei Nova 16 Ultra పేర్లతో ఇవి విడుదలయ్యాయి. ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత హార్మనీ ఓఎస్ 6.1 వర్షన్‌తో పనిచేస్తాయి. క్లియర్ బ్లూ, స్కై వైట్, స్టార్రి నైట్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.

ఈ రెండు ఫోన్లలోనూ 6.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను అందించారు. ఇది 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కున్లున్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఇక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం వీటిలో హువావే సొంత కిరిన్ 9010S చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడుగా 12GB RAM, గరిష్టంగా 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

Advertisement

Also Read: పబ్‌జీ, ఫ్రీఫైర్ లవర్స్ అలర్ట్.. అస్సలు హ్యాంగ్ అవ్వని, వేడెక్కని సూపర్ ఫోన్ల లిస్ట్ మీ కోసం..

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వీటిలో వెనుక వైపు 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను ఇచ్చారు. రంగులు స్పష్టంగా రావడం కోసం రెడ్ మేపుల్ కలర్ సెన్సార్‌ను కూడా చేర్చారు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అందించడం విశేషం.

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రధాన ఆకర్షణ వీటిలో ఉన్న 7,000mAh భారీ బ్యాటరీ. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే Ultra మోడల్‌లో అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నోవా 16 ప్రో మోడల్ ఐపీ65 రేటింగ్‌తో రాగా, ఆల్ట్రా మోడల్ మరింత పటిష్టమైన ఐపీ68, ఐపీ69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది.

చైనా మార్కెట్లో హువావే నోవా 16 ప్రో బేస్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.54,000గా ఉంది. అలాగే నోవా 16 ఆల్ట్రా ప్రారంభ వేరియంట్ ధరను రూ.65,000గా నిర్ణయించారు. వీటిలో 512GB, 1TB స్టోరేజ్ మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: స్మార్ట్‌వాచ్ కొనేముందు చాలామంది చేసే తప్పు ఇదే.. ఈ ఒక్క తేడా తెలుసుకోకపోతే మనీ వేస్ట్!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×