Lalit Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ముగిసిన నేపథ్యంలో లలిత్ మోడీ (Lalit Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ సృష్టికర్తగా ఉన్న లలిత్ మోడీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని… పాత విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఫిక్సింగ్ ( fixing in the IPL) చేయాలని చాలా మంది తనను టార్చర్ పెట్టినట్లు గుర్తు చేశారు. అంతేకాదు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ( Dawood Ibrahim), చోటా చక్లీ ( Chota Chakli ) ఇద్దరు కూడా తన కొడుకును కిడ్నాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఐపీఎల్ లో ఫిక్సింగ్ చేయాలని… లేకపోతే తన కొడుకు అంతు చూస్తామని బెదిరింపులకు దిగినట్లు వెల్లడించారు. ఆ సమయంలోనే ఇండియాను వదిలి తాను లండన్ వెళ్లిపోయినట్లు వెల్లడించారు. కానీ ఈ విషయాలను తాను చెబితే ఎవరూ నమ్మకుండా.. తనపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పైన లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2008 సమయంలో ప్రారంభమైంది. ఇప్పటివరకు 19 సీజన్లు పూర్తయ్యాయి. అయితే 2008లో ఐపిఎల్ టోర్నమెంట్ కు ప్రాణం పోసింది లలిత్ మోడీనే. చాలా కష్టపడి ఈ టోర్నమెంటును నిర్వహించేలా చేశారు. ఈ క్రమంలోనే 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్ చైర్మన్ గా కొనసాగారు లలిత్ మోడీ. ఈయన పదవి కాలంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదు. టి20 క్రికెట్ ను ప్రపంచానికి పరిచయం చేసి తన సత్తా చాటారు లలిత్ మోడీ.
తాను ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఫిక్సింగ్ జరిగేలా చూడాలని ఉగ్రవాదులు దావూద్ ఇబ్రహీం, చోటా చక్లి ల నుంచి చాలా ఒత్తిడి వచ్చిందని వెల్లడించారు లలిత్ మోడీ. కానీ వాళ్ల ఒత్తిళ్లకు తాను ఎక్కడ తగ్గలేదని స్పష్టం చేశారు. తన కొడుకులు కూడా కిడ్నాప్ చేసి, తనపై ఒత్తిడి పెంచి నరకం చూపించినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇన్ని చేసినా కూడా.. తాను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే 2013లో ఫిక్సింగ్ జరిగింది నిజమేనని.. దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఐపీఎల్ ఫిక్సింగ్ కు తాను లొంగక పోవడంతో… తనను చంపేస్తామని, ఉగ్రవాదులు బెదిరింపులకు దిగారని వివరించారు. వాళ్ల వల్లే లండన్ నుంచి తాను ఇండియాకు రాలేకపోతున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా తాను చెప్పిన వాస్తవాలను నమ్మే పరిస్థితిలో లేక.. అవమానించిన వాళ్లు ఎక్కువగా ఉన్నారని బాంబు పేల్చారు. దీంతో లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
🚨 Lalit Modi revealed that his son was kidnapped because he refused to allow fixing in the IPL:
Question: So, you said that you were concerned about going back to India because, at some point, there was a hit on you from Dawood Ibrahim because you wouldn't allow fixing in the… pic.twitter.com/FarV7zWMl1
— Indian Cricket Ministry (@ICM_News45) June 2, 2026