E-Paper
Advertisement

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!
Advertisement

One Nation One Election: ఇండియాలో ఎలక్షన్లు అంటే.. నెవ్వర్ ఎండింగ్ స్టోరీ. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలో, ఉప ఎన్నికలో జరుగుతూనే ఉంటాయ్. ఇదంతా.. ఓ నిరంతర ప్రక్రియలా సాగుతూ ఉంటుంది. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో ఎన్నికలుంటే, వచ్చే ఏడాది మరో రాష్ట్రంలో ఉంటాయ్. దాంతో.. దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తున్న స్లోగన్.. వన్ నేషన్-వన్ ఎలక్షన్. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన, ఆలోచన దశాబ్దాలుగా ఉంది. ఇప్పటిదాకా కేవలం చర్చలకే పరిమితమైన ఈ మ్యాటర్.. ఇప్పుడు ఆచరణ రూపం దాల్చే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది.

2029లో కొత్త ఎన్నికల యుగానికి శ్రీకారం?

దీనికోసం.. కేంద్ర ప్రభుత్వం పక్కా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. 2029 నాటికి జమిలి ఎన్నికల దిశగా తొలి అడుగు పడబోతోందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనికోసమే నియమించిన 39 మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా జమిలి ఎన్నికలపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మరి.. జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రాల అసెంబ్లీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వెనుక ఉన్న సవాళ్లేంటి? దేశం దీనికి ఎంతవరకు సిద్ధంగా ఉంది?

వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్రం కొత్త వ్యూహం

Advertisement

జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని భారీగా కుదించడం, మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తలెత్తకుండా.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ రెండు దశల విధానంపై కసరత్తు చేస్తోంది. 2029, 2034 సంవత్సరాల్లో రెండు విడతలుగా దీన్ని అమలు చేసి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రూట్ క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దశలవారీగా జమిలి ఎన్నికలు

అందువల్ల.. జమిలీ ఎన్నికల చట్రంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి.. దశలవారీగా ముందుకు సాగడమే అత్యంత ఆచరణాత్మకమని జేపీసీ భావిస్తోంది. తొలి దశలో 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. జమిలి ఎన్నికలు అంటే దేశమంతటా ఒకే రోజు పోలింగ్ జరగడం కాదు. కేంద్ర ఎన్నికల సంఘం సౌలభ్యం ప్రకారం విడతల వారీగా పోలింగ్ జరుగుతుంది. కానీ ఫలితాలు, ప్రభుత్వాల ఏర్పాటు ఒకే టైమ్‌లైన్‌లో ఉంటాయ్.

రాజ్యాంగం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

Advertisement

జమిలి ఎన్నికలను దశలవారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు ముగియక ముందే ఎన్నికలు నిర్వహించొచ్చని, కొన్నింటిలో కాలపరిమితిని పొడిగించే వెసులుబాటు కూడా ఉందంటున్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితిలో మార్పులు జరిగాయి. అయితే, ఇంతటి భారీ మార్పుకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: ఆక్రమణ నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.. రేవంత్ సర్కార్‌కు పవన్ కళ్యాణ్ సవాల్!

జమిలి ఎన్నికలకు బ్రేక్ ఎలా పడింది..?

దేశంలో 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు లోక్‌సభకు, మెజారిటీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 1968–69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దయ్యాయ్. 1970లో లోక్‌సభ కాలపరిమితి ముగియకముందే రద్దయింది. దాంతో.. తొలిసారి జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో.. అనేక రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడం మొదలైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా.. ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది.

జమిలి ఎన్నికలు.. లాభాలా, నష్టాలా..?

జమిలి ఎన్నికల విధానంపై అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయ్. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని సమర్థించే వాళ్లున్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగం వెచ్చించే సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెప్పేవాళ్లు ఉన్నారు. అయితే, అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమాఖ్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రాల పదవీకాలాల్లో భారీ మార్పులు..?

జమిలి ఎన్నికల బిల్లు చట్టంగా మారితే, రాష్ట్ర ప్రభుత్వాల ఐదేళ్ల పదవీకాల సమీకరణాలు మారిపోతాయి. 2029లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానాన్ని తీసుకురావాలంటే.. రాష్ట్రాల అసెంబ్లీల విషయంలో మార్పులు తప్పవు. 2029 నాటికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం ముగిసిపోవచ్చు. మరికొన్ని రాష్ట్రాల్లో అప్పటికి కేవలం రెండేళ్లే పూర్తయి ఉండొచ్చు. 2027, 2028లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలను 2029 వరకు పొడిగించడమో, రద్దు చేయడమో చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని రాష్ట్రాల పదవీకాలన్ని కొద్ది నెలల పాటు పొడిగించాల్సి వస్తుంది.

జమిలి బ్లూప్రింట్ సిద్ధం

దీనికోసం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, ఆర్టికల్ 172లను సవరించాల్సి ఉంటుంది. ఇప్పటికే.. జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ప్యానెల్ ఏర్పాటైంది. ఏడు దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసి నివేదిక తయారుచేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనల తర్వాత.. కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రిపోర్ట్ సమర్పించింది. ఈ నివేదికని.. జేపీసీ అధ్యయనం చేస్తోంది. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి నాటికి సమర్పించాల్సి ఉంది. నివేదిక అందిన తర్వాత.. పార్లమెంటులో చర్చ, ఓటింగ్ జరుగుతాయ్.

Also Read: తెలంగాణ ప్రజలందరికీ గుడ్ న్యూస్.. ప్రతి పౌరునికీ ‘ఇందిరమ్మ జీవిత బీమా’ – మంత్రి పొన్నం

దేశ ప్రగతికి కొత్త ఎన్నికల చక్రం?

మన దేశంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల కోలాహరం కనిపిస్తూనే ఉంటుంది. ఈ రెగ్యులర్ ఎలక్షన్ మోడ్ వల్ల.. దేశ ఆర్థిక వ్యవస్థపై, పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందువల్లే.. జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయ్. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే పద్ధతి.. ఈ దేశ ప్రగతికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని భావిస్తున్నారు. దానికోసమే.. రెండు దశల్లో జమిలి ఎన్నికల ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయ్. 2029లో 20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంపై పడే ప్రభావంపై అంచనాలు సిద్ధమయ్యాయ్.

రాష్ట్రాల గడువులు మారనున్నాయా..?

2028లో ఎన్నికల రోస్టర్‌లో ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఐదు నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల కాలపరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030-31లో ఎన్నికలు జరగాల్సిన బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ఒకటి నుంచి రెండేళ్లు తగ్గే ఆస్కారం ఉంది. అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఒప్పించడం కష్టం కాబట్టి, తొలి విడతగా కొన్ని రాష్ట్రాలను కలిపి, 2034 నాటికి.. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే తాటిపైకి తెచ్చేలా కేంద్రం ఆలోచిస్తోంది.

జమిలి ఎన్నికల ముందు అతిపెద్ద ప్రశ్న

జమిలి ఎన్నికలు జరిగిన తర్వాత, ఏదైనా రాష్ట్రంలో అసమ్మతి వల్లో, అవిశ్వాస తీర్మానం వల్లో.. ప్రభుత్వం 2,3 ఏళ్లకే పడిపోతే ఏం చేస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలా? అనే ప్రశ్నలకు స్పష్టమైన, చట్టపరమైన పరిష్కారాలు లభించాల్సి ఉంది. దీనికి విదేశాల్లో ఉన్న నమూనాలను పరిశీలిస్తున్నారు. జమిలి ఎన్నికలు వినడానికి అద్భుతంగా అనిపించినా.. దీన్ని అమలు చేయడం కత్తిమీద సామే అంటున్నారు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ టూ బై థర్డ్ మెజారిటీ అవసరం.

ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకం

అంతేకాదు, కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదం తెలపాలి. ముఖ్యంగా.. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడమే కేంద్రానికి పెద్ద టాస్క్. జమిలి ఎన్నికల విషయంలో.. ప్రాంతీయ పార్టీలకు కొన్ని ఆందోళనలున్నాయ్. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. జాతీయ అంశాల హోరులో ప్రాంతీయ సమస్యలు కొట్టుకుపోతాయని, ఓటరు ఒకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని రీజినల్ పార్టీలు అంటున్నాయ్. అయితే, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు, ప్రాతినిథ్యానికి భంగం కలగకుండా చూస్తామని కేంద్రం హమీలిస్తోంది.

Also Read: బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

జమిలి ఎన్నికలతో లక్షల కోట్ల ఆధా?

జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంచనాల ప్రకారం.. జమిలి ఎన్నికల వల్ల దేశానికి భారీ ప్రయోజనాలున్నాయ్. నిరంతరం ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ సొమ్ము, పార్టీల డబ్బు విపరీతంగా ఖర్చవుతోంది. జమిలి వల్ల దాదాపు 7 లక్షల కోట్లు ఆదా అవుతుందని, ఇది దేశ జీడీపీ వృద్ధిని 1.6 శాతం పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా పరిపాలన కుంటుపడుతోంది.

జమిలి ఎన్నికలు.. భారీ సవాళ్లు

ఒకేసారి ఎన్నికలైపోతే, రూలింగ్‌లోకి వచ్చిన ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, కోడ్ అడ్డంకులు లేకుండా ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో పాలనపైనే ఫోకస్ పెట్టొచ్చు. టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు, రక్షణ దళాలను పదే పదే ఎన్నికల విధులకు మళ్లించాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే లక్షలాది కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లు కావాలి. వాటి రక్షణకు, పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతకు భారీగా బలగాలు అవసరమవుతాయి. విడతల వారీగా ఎన్నికలు జరపడానికే బలగాల కొరత ఎదురవుతోంది. అలాంటిది.. ఒకేసారి నిర్వహించడం పెద్ద సవాల్.

2029లో జమిలి ఎన్నికలు?

2029లో జమిలి ఎన్నికలు సాధ్యమా? కాదా? అనేది రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో జరిగే బిల్లుల ఆమోదం, ప్రాంతీయ పార్టీలతో కేంద్రం జరిపే చర్చల మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక పొదుపు, స్థిరమైన పాలన అనేవి సానుకూల అంశాలైతే.. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటం, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించడమనేది.. దీనికి ఉన్న పరిమితులు. ఏదేమైనా., దేశ రాజకీయ, పరిపాలనా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే మహా సంస్కరణ వైపు భారత్ అడుగులు పడుతున్నాయ్.

Also Read: ఏపీలో ‘జనసేన’.. తెలంగాణలో ‘భజనసేన’.. పవన్ కళ్యాణ్ వైఖరిపై సామ నిప్పులు!

Story by: Anup, Big Tv

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×